Latest Updates
-
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.!
అందమే ఆనందం...అందమే ఆరోగ్యం...!

1. ఒక కప్పు పెరుగులో ఒక స్పూన్ కమలా పండు రసం, ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించి మర్దనా చేయాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల చర్మం నునుపుదేరి కాంతివంతంగా కనబడుతుంది.
2. ముఖం పైన జిడ్డు చేరనీయకుండా అప్పుడప్పుడు చన్నీటితో సుభ్రపరచుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ముఖంపైన మొటిమలు తగ్గి చర్మం నునుపుగా, అందంగా ఏర్పడుతుంది.
3. నిమ్మరసం టేబుల్ స్పూన్, కోడిగుడ్లు తెల్ల సొన రెండు టేబుల్ స్పూన్లు, తేనె రెండు టేబుల్ స్పూన్లు, స్ట్రాబెర్రీ గుజ్జు అర కప్పు తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిపి ముఖానికి అప్లయ్ చేసుకోవాలి. పూర్తిగా ఆరిపోయాక నీటితో శుభ్రపరచుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తుంటే చర్మం జిడ్డు తగ్గిపోయి నునుపుగా, కాంతివంతంగా తయారవుతుంది.
4. టొమాటో, బంగాళ దుంపలను కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమానికి ముఖానికి, మెడకు, చేతులకు రాసుకొని 5 నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా చేయడం ద్వారా చర్మంపై ఉన్న మచ్చలు తొలగిపోయి మృదువుగా తయారవుతుంది.
5. రాత్రి పడుకోబోయే ముందు టేబుల్ స్పూన్ గోరువెచ్చని బాదం నూనెతో ముఖం మీద 10 నిమిషాల పాటు వ్యతిరేక దిశలో మర్దనా చేయాలి. మరుసటి ఉదయం గోరువెచ్చటి నీటితో కడిగేస్తే చర్మం నిగారిస్తుంది.
6. కోడిగుడ్డు తెల్ల సొనలో టీ స్పూన్ తేనె, టీ స్పూన్ సన్ ఫ్లవర్ నూనె కలపాలి. ఈ మిశ్రమం ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారంలో రెండు సార్లు ఇలా చేస్తే చర్మం పట్టులా నునుపవుతుంది.



Click it and Unblock the Notifications
