Latest Updates
-
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.!
పాదాల పగుళ్ల వల్ల సిగ్గుగా ఉందా...?

1. ఒక టీ స్పూన్ చక్కెర, ఒక టీ స్పూన్ ఏదైనా నూనెను తీసుకోవాలి. ఒక నిమిషం పాటు రెండు పాదాలకు నెమ్మదిగా మర్దనా చేయాలి. 10-15 నిమిషాల తరువాత కడిగేయాలి. అలసిన పాదాలకు ఉపశమనం కలిగించడమే కాదు నునుపుగానూ అవుతాయి.
2. గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు, కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. అందులో పాదాలను పావుగంట సేపు నానబెట్టాలి. అనంతరం స్క్రబ్బర్ లేదా నునుపైన రాయితో పాదాలను మృదువుగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల పాదాలపై ఉన్న డెడ్‌స్కిన్ అంతా పోతుంది. పాదాలను ఇప్పుడు చల్లని నీటితో కడిగి మెత్తటి టవల్ తో తుడవాలి. పొడిగా ఉన్న పాదాలకు మాయిశ్చరైజర్ రాయాలి. తరచుగా ఇలా చేయడం వల్ల పాదాలు అందంగా తయారయవుతాయి.
3.కొద్దిగా ఆలివ్ ఆయిల్ తీసుకుని దానికి కొన్ని పాలు కలపాలి. వీటికి సరిపడా ఓట్స్ పౌడర్ తీసుకుని పాదాలకు మర్దనా చేయాలి. అర్ధగంట తరువాత కడిగేయాలి. ఇలా చేస్తే పాదాలపై డెడ్‌స్కిన్ తొలగిపోయి మృదువుగా ఉంటాయి.
4. ఒక బకెట్లో పావు భాగం వరకూ నీళ్లు తీసుకుని అందులో ఒక స్పూన్ కొబ్బరి నూనె, ఒక స్పూన్ విటమిన్ ఇ నూనె, చెంచాడు వంటసోడా వేసి ఒక అరగంటపాటు కాళ్లు అందులో ఉంచాలి.
5. కాళ్లు పగిలి బాధపెడుతుంటే రోజ్‌వాటర్, గ్లిజరిన్ , నిమ్మరసం సమపాళ్లలో తీసుకుని ఓ గాజుపావూతలో నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ స్నానం చేయడానికి అర్ధగంట ముందు, లేదా పడుకునేముందు అప్లై చేయాలి. పాదాల పగుళ్లు తగ్గుతాయి. చర్మం మృదువుగా మారుతుంది.



Click it and Unblock the Notifications
