Latest Updates
-
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.!
చలికాలపు చర్మసౌదర్య రహస్యాలు...

1. చలికాలం ఎండ ఒంటికి అంత మంచిది కాదు. బయటికి వచ్చేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ తప్పక రాసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. పచ్చికూరలూ పళ్లూ అధికంగా తినాలి.
2. కొబ్బరినూనెను ఒంటికి పట్టించి, గంట తరవాత గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది.
3. సబ్బును ఉపయోగించకుండా వీలైనన్నిసార్లు మంచినీటితో ముఖాన్ని కడుక్కోవాలి.
4. రాత్రి పడుకోబోయే ముందు గోరువెచ్చని నీటిలో కాటన్ ముంచి ముఖాన్ని శుభ్రపరిచి, కోల్డ్ క్రీమ్ లేదా మాయిశ్చరైజర్ (బ్రాండెడ్‌వి, ఎక్స్‌పైరీ డేట్ చూసి తీసుకోవాలి) అప్లై చేయాలి. క్రమం తప్పకుండా ఈ విధంగా చేయడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.
5. పాలు సహజ వైటెనర్ గా పనిచేసి చర్మం నల్లగా అవకుండా రక్షిస్తాయి. గోరువెచ్చటి పాలలో మెత్తటి వస్త్రాన్ని ముంచి దాంతో ముఖంపై అద్దాలి. బాగా ఆరిపోయాక చల్లటి నీళ్లతో కడిగెయ్యాలి. రోజూ ఇలా చేస్తుంటే... చలి కారణంగా మెరుపు కోల్పోయిన చర్మం సహజమెరుపును సంతరించుకుంటుంది.
6. ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చర్మారోగ్యాన్ని సంరక్షిస్తాయి. అవి పుష్కలంగా లభ్యమయ్యే పాలు, చేపలు, వాల్ నట్స్, సోయా, అవిసె గింజలు ఆహారంలో భాగం చేసుకోవాలి.
7. పెరుగులో నాలుగైదు చుక్కల నిమ్మరసం వేసి ముఖానికి రాయాలి. ఈ మిశ్రమం మంచి బ్లీచింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది.
8. చలికాలంలో చర్మంలో నూనె ఉత్పత్తి తగ్గిపోతుంది. దాంతో చర్మం పొడిబారి అందవిహీనంగా, ముడతలుగా, పొలుసులుగా కనిపిస్తుంది. కనుక వారానికోసారి ఎక్స్‌ఫొలియేట్ తప్పకుండా చేసుకోవాలి. దీనివల్ల చర్మంలో పేరుకున్న మృతకణాలన్నీ తొలగిపోతాయి.
9. సెనగపిండి, పాలు కలిపి పేస్టులా చేసి రాయండి. పావుగంట తర్వాత కడిగేస్తే చర్మం సరికొత్త కాంతులీనుతుంది.
10. రెండు నిమ్మచెక్కలను తీసుకుని ముఖంపైనా మెడపైనా రుద్ది ఇరవై నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం తేటగా ఉంటుంది.



Click it and Unblock the Notifications
