Latest Updates
-
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్‌లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.! -
అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి? మన శరీరానికి ఎంత అవసరం? -
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.!
ముఖం - కళ్ళు క్రింద ముడతలు తగ్గించే చిట్కాలు...

ముందుగా మొహాన్ని శుభ్రం చేసుకొని బొప్పాయి లేదా అరటి గుజ్జుతో ముఖాన్ని మర్దన చేసి తుడవాలి. మినప పప్పు పొడి 2 చెంచాలు, బార్లీ గింజల పొడి 4 చెంచాలు , రెండు చెంచాల కేపోలిన్ లను తోటకూర రసంలో కలిపి ప్యాక్‌గా చేసి ముఖంపై వేయాలి. బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.
బాదంపొడి, పాలపొడి, కలబంద గుజ్జు చెంచా చొప్పున తీసుకుని అన్నింటినీ గులాబి నీటితో కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోని పదిహేను నిమిషాలయ్యాక కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మం తాజాగా మృదువుగా వుంటుంది. అలాగే మరుగుతున్న నీళ్లలో యూకలిప్టస్ ఆకులు కానీ యూకలిప్టస్ నూనె కానీ వేసి ఆవిరి పట్టుకుంటే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
రోజంతా చర్మంపై తేమ వుండేలా చూసుకోవాలి. ఇందుకోసం వాటర్ కలిసిన మాయిశ్చరైజింగ్ క్రీమును రాసుకోవాలి. దానికంటే ముందుగా ముఖంపై రోజ్ వాటర్ రాసుకుంటే మంచిది. మరొక ఉపాయం ఏమిటంటే ఒక టేబుల్ స్పూను తేనెలో రెండు చెంచాల పాలు, కొన్ని చుక్కల ఆలివ్ నూనె కలిపి ముఖం, మెడ భాగానికి రాసుకొని, పదిహేను నిమిషాలయ్యాక చల్లని నీటితో కడిగితే ముఖం మృదువుగా మారుతుంది.
కళ్ళు కింద ముడతలు తగ్గాలంటే: ప్రతిరోజు ఉదయం కాచిన పాల నుండి చెంచా పాల మీగడ తీసుకుని అందులో విటమిన్ ఇ నూనెను వేసి నిమిషం పాటు కళ్ళ చుట్టూ మృదువుగా మర్దన చేసి పది నిమిషాలయ్యాక శుభ్రం చేస్తే కళ్ల చుట్టూ వుండే ముడతలను తగ్గించుకోవచ్చు.
కళ్ళ కింద ముడతలు పోవాలంటే, ఒక కప్పు నీళ్ళలో ఎండు ఉసిరికాయని నానబెట్టాలి. మర్నాడు పొద్దున ఈ నీళ్ళలో మరో కప్పు నీళ్లు కలిపి వాటితో కళ్లని కడుక్కోవాలి.
కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తినే ఆహారంలో బొప్పాయి. గుడ్డు, చేపలు, పాలు వుండేలా చూసుకోవాలి
చేతులు మృదువుగా వుండాలంటే : చేతులకు పట్టే మురికి, డెడ్ స్కిన్ పోవాలంటే చేతుల్ని ఓ రెండు నిమిషాలు వేడినీళ్ళలో వుంచాలి. చర్మం మెత్తబడ్డాక ఉప్పు కలిపిన నిమ్మికాయ రసం రాసి పాత టూత్ బ్రష్ తో నెమ్మదిగా శుభ్రం చేయాలి. తరువాత మాయిశ్యరైజర్ రాసుకున్నట్లైతే చర్మంలోని ముడతలు క్రమంగా తగ్గుతాయి.
ఒక గిన్నెలో ఒక స్పూను శెనగపిండి, రెండు స్పూన్లు పచ్చిపాలు, ఆర స్పూన్ గంధం పొడి చేసి బాగా కలిపిప చేతికి ప్యాక్ వేసుకొని కాసేపయ్యాక శుభ్రం చేయాలి. ఇలా అప్పుడప్పుడు చేయటం వల్ల చేతులు మృదువుగా అవుతాయి.



Click it and Unblock the Notifications