Latest Updates
-
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.! -
కుజ, గురు గ్రహాల అరుదైన కలయిక.. 3 రాశుల వారికి ఈ అడ్డంకుల నుంచి ఉపశమనం -
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం!
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.!
రోజంతా ఇంటి బాధ్యతలు, ఆఫీసు పనుల్లో బిజీబిజీగా గడిపిన తర్వాత అలసిన శరీరానికి రాత్రి అలా పడుకోగానే నిద్ర పడితే వచ్చే ఆనందమే వేరు. ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకని సుఖమది. కానీ ఈ రోజుల్లో చాలా మందికి వివిధ కారణాల వల్ల రాత్రిళ్లు త్వరగా కునుకు పట్టక సతమతమవుతున్నారు. ఊపిరిసలపని ఆలోచనలు నిద్రకి దూరం చేస్తున్నాయి. ఈ సమస్య ఎందుకు వస్తుంది.. దానిని ఎలా నివారించాలి.. నిపుణుల సలహా చూద్దాం..

రాత్రి నిద్ర పోయే ముందు చాలా మంది మెదడులో అనేక ఆలోచనలు తిరుగుతుంటాయి. ఆర్థిక పరిస్థితులు, ఫ్యూచర్ గురించిన ఆలోచనలు, గత జ్ఞాపకాలు, వృత్తిపరమైన, కుటుంబ ఒత్తిడి ఇవన్నీ మనసులో మెదులుతూ ఉండటం వల్ల నిద్రకి దూరం అవుతున్నారు. గంటల తరబడి ఆలోచనల అనంతరం ఏ అర్ధరాత్రి దాటాకో గాఢ నిద్రలోకి చేరుకుంటున్నారు. ఈ సమస్య ఎక్కువ కాలం కొనసాగుతూ ఉంటే.. నిద్ర, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని మానసిక ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ పరిస్థితిని మరి ఎలా నివారించాలి..
రాత్రి నిద్రపై పగటి ఒత్తిడి
పగలంతా పని, చదువు, కుటుంబ బాధ్యతలు, ఇతర బాధ్యతలతో బిజీగా గడుపుతుంటారు. ఈ క్రమంలో ఇందుకు సంబంధించి ఎన్నో ఆలోచనలు, భావోద్వేగాలను మనసులో నింపుకొంటారు. ఇవన్నీ రాత్రి సమయంలో నిద్రకు ఉపక్రమించే ముందు బయటపడుతుంటాయి. వాటిని నెమరువేసుకుంటూ ఉంటారు. ఈ అతి ఆలోచనలు మిమ్మల్ని నిద్ర నుంచి దూరం చేస్తున్నాయి.
ఆందోళన
ఇప్పటికే ఒత్తిడి, ఇతర మానసిక ఆందోళనలు అనుభవిస్తున్నట్లయితే ఇవి మిమ్మల్ని రాత్రి సమయంలో తీవ్రంగా మారతాయి. పదేపదే వాటిని గుర్తు చేసుకుంటూ పరిష్కారాల వైపు ఆలోచిస్తుంటారు. దీంతో అతిగా ఆలోచించి మీ నిద్రకి భంగం కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు.

స్కీన్ టైం
సాధారణంగా నిద్ర పోయే గంట ముందు వరకూ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించకూడదని నిపుణులు సూచిస్తారు. కానీ ఎక్కువసేపు మొబైల్ ఫోన్ చూడటం, ల్యాప్‌టాప్, టీవీతో ఎక్కువ సమయం గడపడం వల్ల మీ మెదడుకి ఆటంకం కలిగిస్తుంది. వాటి స్క్రీన్ నుంచి వెలువడే కాంతి, కిరణాలు నిద్రకి సహాయపడే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిపై ప్రభావిం చూపిస్తుంది. దీంతో మెదడు యాక్టివ్‌గా మారి ఎక్కువగా ఆలోచిస్తూ నిద్రకి దూరమవుతారు.
నిద్ర అలవాట్లు
వివిధ కారణాల వల్ల కొందరి నిద్ర సమయాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. ఆలస్యంగా నిద్ర పోవడం, లేటుగా లేవడం వల్ల జీవ గడియారం దెబ్బతిని నిద్ర పట్టడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీంతో ఆలోచనలు పెరుగుతుంటాయి.
ఈ సమస్య నుంచి బయటపడి త్వరగా నిద్రపోవాలనుకుంటే కొన్నిి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్ర పోవడం, మేల్కొనడానికి ప్రయత్నించండి. నిద్రపోయే గంట ముందు వరకూ మొబైల్ ఫోన్లు, ఇతర స్క్రీన్‌లకు దూరంగా ఉండాలి. మంచి పుస్తకం చదవడం లేదా సంగీతం వినడం ద్వారా మంచి నిద్రకి సహకరిస్తుంది. లోతైన బ్రీతింగ్ లేదా ధ్యానం చేయడం ద్వారా త్వరగా విశ్రాంతి తీసుకోగలరు. మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే విషయాలను డైరీలో రాసుకోవడం ద్వారా ఆలోచనలు రాకుండా ఉంటాయి. సమస్య నుంచి బయటపడలేకపోతే సైకాలజిస్టులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
