Latest Updates
-
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే..
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.!
కళ్లకి కాటుక పెట్టుకోవడం అతివల అందాన్ని మరింత పెంచుతుంది. మేకప్ ఉన్నా లేకపోయినా కాటుక ఇచ్చే స్పెషల్ లుక్ వేరు. అయితే కాటుక పెట్టుకోవడం కళ్లకి సురక్షితమేనా అంటే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా కనురెప్పల వాపు, కళ్లు పొడిబారడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో కళ్లను రక్షించుకుంటూ కాటుక ఎలా పెట్టుకోవాలో బ్యూటీ నిపుణుల సలహాలు చూద్దాం..

మేకప్‌లో భాగంగా కళ్లకి కాటుక పెట్టుకోవడం చాలా ప్రత్యేకం. కాటుకతో అందమైన లుక్ కోసం మార్కెట్‌లో చాలా రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక మేకప్ కోసమే కాకుండా సాధారణ రోజుల్లో కూడా చాలా మంది మహిళలకు కాటుక పెట్టుకోవడం అలవాటు. అయితే రోజంతా కళ్లకి కాటుకతో ఉన్నప్పుడు రాత్రిపూట అలాగే కాటును తొలగించకుండా నిద్రపోతారు. దీని వల్ల కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
కాటుక ఎలా పెట్టుకోకూడదు
కనురెప్పల అంచున మీబోనియన్ గ్రంథులు అనేవి ఉంటాయి. ఇవి సహజ నూనెను ఉత్పత్తి చేస్తాయి. కళ్లలో తేమను నిలుపుతాయి. కన్నీళ్లు త్వరగా ఎండిపోకుండా నివారిస్తాయి. ఈ క్రమంలో కనురెప్పల అంచున కాటుక పెట్టడం ద్వారా ఇందులోని రేణువులు, నూనె.. గ్రంథుల చుట్టూ పేరుకుపోయి నూనె ప్రవాహం ఆగిపోయే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఫలితంగా కనురెప్పలపై ఎర్రటి గడ్డ లేదా స్టై ఏర్పడవచ్చు. దీనివల్ల నొప్పి ఏర్పడుతుంది. ఈ క్రమంలో ఇన్‌ఫెక్షన్ లేకపోయినా, వాపుతో కూడిన గడ్డలు ఏర్పడతాయి. ఈ పరిస్థితి తీవ్రమైనప్పుడు సర్జరీ చేయాల్సి వస్తుంది.

కాటుక ఎలా పెట్టుకోవాలి
ఈ పరిస్థితి రాకుండా మీ అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచుకునే పనిలో భాగంగా కళ్లకు కాటుక పెట్టుకునేటప్పుడు కీలక జాగ్రత్తలు తీసుకోవాలి. కనురెప్పల అంచున కాటుక పెట్టుకోకండి. అదేవిధంగా రాత్రంతా కాటుక పెట్టుకుని నిద్రపోకండి.. నిద్రపోయేటప్పుడు కళ్లకి కాటుక తొలగించడం ఉత్తమం.
ఈ తప్పులు వద్దు
మీరు కళ్లకి పెట్టుకునే కాటుకను, మీ మేకప్ సామగ్రిని ఇతరులతో అసలు పంచుకోకండి. ఇతరులతో షేర్ చేసుకుంటే ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. అందంగా కనిపించడంతో పాటు ఆరోగ్యకరంగా కనురెప్పల అంచుకు పెడుతూనే కొంచెం బయటగా కాటుకను పొరలా అప్లై చేయడం ద్వారా ఎలాంటి హాని జరగదు. అయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీ కళ్లలో గడ్డలా అనిపించినా, నిరంతరం కంటి నొప్పి పదే పదే కంటి కురుపులు ఏర్పడితే సొంత చిట్కాలు, చికిత్స తీసుకోకుండా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
