మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్‌ కొట్టదు.!

గోధుమ పిండితో చేసే కచోరీలు చాలా ఫేమస్‌. హెల్తీనే కాదు టేస్టీగా ఉండటంతో స్నాక్స్‌ లేదా బ్రేక్‌ఫాస్ట్‌గా లొట్టలేసుకుంటూ తినేస్తారు. అయితే కచోరీల్లో సాధారణంగా స్టఫింగ్‌ కోసం బఠాణీ, శనగపిండి వాడుతుంటారు. కానీ ఉల్లిపాయతో స్టఫ్‌ చేసి కచోరీలు చేశారంటే సమోసాలను మించిన రుచితో అద్భుతంగా ఉంటాయి. ఉల్లి కచోరీ ఎలా చేయాలో చూద్దాం..

Onion kachori healthy snack or breakfast with wheat flour recipe in telugu

ఉల్లి కచోరీ తయారీకి కావాల్సిన పదార్థాలు

గోధుమ పిండి- రెండు కప్పులు
వాము- టీస్పూన్‌
ఉప్పు- రుచికి సరిపడా
నెయ్యి- ఐదు టీస్పూన్లు
నూనె- డీప్‌ ఫ్రైకి సరిపడా

ఉల్లి కచోరీల్లో స్టఫింగ్‌ కోసం

ఈ పద్ధతిలో అల్లం చట్నీ చేస్తే.. ఎవరైనా సరే నాలుగు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు!

తరిగిన ఉల్లిపాయ- కప్పు
అటుకులు- పావు కప్పు
పచ్చిమిర్చి- రెండు
అల్లం వెల్లుల్లి పేస్ట్‌- టీస్పూన్‌
కొత్తిమీర- కొద్దిగా
కారం- అర టీస్పూన్‌
ఉప్పు- రుచికి సరిపడా
ధనియాల పొడి- అర టీస్పూన్‌
జీలకర్ర పొడి- అర టీస్పూన్‌
గరం మసాలా- పావు టీస్పూన్‌
నిమ్మకాయ- సగం ముక్క
కార్న్‌ఫ్లోర్‌- మూడు టేబుల్‌ స్పూన్లు

ఉల్లి కచోరీ తయారీ విధానం

మందుగా ఒక గిన్నెలో గోధుమ పిండి, వాము, ఉప్పు, రెండు టీస్పూన్ల నెయ్యి వేసి ఒకసారి కలపాలి. తర్వాత కొన్ని నీళ్లు పోసి పిండి ముద్దను సాఫ్ట్‌గా కలుపుకోవాలి. పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టఫింగ్‌ కోసం మరో గిన్నె తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అటుకులను స్మాష్‌ చేసి అందులో వేయాలి. చిన్నగా తరిమిన పచ్చిమిర్చి ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, కొత్తిమీర తురుము, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర తురుము, గరం మసాలా, జీలకర్ర పొడి, నిమ్మకాయ రసం వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి.

Onion kachori healthy snack or breakfast with wheat flour recipe in telugu

ఇప్పుడు చిన్న బౌల్‌ తీసుకుని అందులో కార్న్‌ఫ్లోర్‌(లేదా బియ్యం పిండి), మిగిలిన నెయ్యి వేసి చిక్కగా కలుపుకోవాలి.

ఇప్పుడు తడిపిన గోధుమ పిండి ముద్దను నాలుగు సమభాగాలుగా చేసుకోవాలి. వీటిని నూనె, పొడి పిండి సహాయం లేకుండా చపాతీల్లా ఒత్తుకోవాలి.

చపాతీలో ఫేవరెట్‌ పనీర్‌ మెంతి కర్రీ.. రెస్టారెంట్‌ స్టైల్‌లో ఇలా అదరగొట్టేయండి.!

ఒక చపాతీపై కార్న్‌ఫ్లోర్‌, నెయ్యి మిశ్రమాన్ని వెడల్పుగా రాయాలి. దీనిపైన మరో చపాతీ వేసుకుని దానిపై అదేవిధంగా రాయాలి. ఇలా ఒకదానిపై ఒకటి నాలుగిటిని వేసుకోవాలి.

వీటిని రోల్స్‌గా చేసుకుని పరోటాలకు ఏ మాదిరిగా చేసుకుంటామో ఆ విధంగా రోల్‌ చేస్తూ చిన్న సైజు చపాతీ పిండి ముద్దలను చేసుకోవాలి.

ఈ పిండి ముద్దలను కొంచెం వెడల్పు చేసి అందులో ఉల్లిపాయ స్టఫ్‌ పెట్టుకుని క్లోజ్‌ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ స్టఫింగ్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

స్టవ్‌పైన కడాయి పెట్టుకుని డీప్‌ ఫ్రైకి సరిపడా నూనె వేసి బాగా కాగనివ్వాలి. ఇందులో ఈ కచోరీలను వేసి రెండు వైపులా క్రిస్పీగా కాల్చుకోవాలి.

పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా, స్పైసీగా ఉండే కచోరీలు రెడీ. ఉల్లిపాయ సమోసాల కంటే అద్భుతమైన రుచితో ఎన్ని తిన్నా బోర్‌ కొట్టదంటే నమ్మండి.

[ of 5 - Users]
Story first published: Wednesday, August 5, 2026, 12:46 [IST]
Desktop Bottom Promotion