Latest Updates
-
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై
ఇవి తింటే ముడతలు మాయం... యవ్వనం సొంతం...

పండ్లు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసును. అన్నంతో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం .
సాల్మన్: మీకు సీఫుడ్ అంటే ఇష్టమా? అయితే మీకు సాల్మన్ కనబడితే ఫి(ని)ష్ ఫెస్టివల్ చేసుకొండి. చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. మన శరీర నిర్మాణంలో ప్రొటీన్స్ ప్రముఖ పాత్రను పోషిస్తాయి. విరివిగా లభించే సాల్మన్ ఫిష్ ప్రొటీన్ తో సమృద్ధి. వీటిలో తైలము ఎక్కువ మరియు ఎ, డి, ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ అధికముగా ఉంటాయి. కనీసం వారంలో మూడు సార్లు సాల్మన్ ను ఆరగించండి. అందమైన మార్పుకు ఆహ్వానం పలకండి.
ఆవకాడో: ఈ పండులో గుండెకు ఆరోగ్యానిచ్చే మోనో-శాట్యురేటడ్ ఫ్యాట్ శాతం అధికంగా ఉంటుంది. దీనిలోని ఫైటో కెమికల్స్ నోటి క్యాన్సర్ ను నివారిస్తాయి. ఈ పండును సాస్ కు బదులు శాండ్విచ్ తో తీసుకోవచ్చు. అవకాడో తినడం వల్ల శరీరంలో అనవసర కొవ్వును అదుపుచేయడంలో ఉపయోగకరంగా ఉంటుంది. విటమిన్-ఈ అధికంగా ఉండే అవకాడో చర్మానికి సరికొత్త నిగారింపును తీసుకుస్తుంది. బీ.పి.ని కంట్రోల్ చేయడంలో తోడ్పడుతుంది.
బ్రకోలీ: బ్రకోలీ ‘క్రూసిఫెరస్' వంశానికి చెందినది. క్రూసిఫెరస్ వంశానికి చెందిన కాయగూరలు టాక్సీన్స్‌తో పోరాడే యోదులుగా చెబుతుంటారు. విదేశీయులు బ్రొకోలీగా పిలుచుకునే ఈ క్యాలీ ఫ్లవర్ లో పోషక తత్వాలు, విటమిన్ ఎ, యాంటి ఆక్సిడింట్స్ ఉన్నాయి. ఉడికించిన లేదా పచ్చి క్యాలీప్లవర్ ను వ్యాయామానికి ముందు లేదా తర్వాత తీసుకుంటే కండరాల నొప్పులు ఉండవు. హాయిగా బ్రకోలిని ఆరగించండి. తరువాత మన శరీరాన్ని విషతుల్యాల నుంచి కాపాడే సంగతి అదే చూసుకుంటుంది.
బెర్రీస్: బెర్రీస్ రొసేసీ కుటుంబానిది చెందిన అనేక రకాల పండ్ల జాతి రకాలు . వీటిలో కొన్ని మానవులు తినేందుకు ఉపయోగపడతాయి. కొన్ని విషపూరితమైనవిగా గుర్తించబడ్డాయి బెర్రీస్ అనే ఈ పండ్లు పలు రంగుల్లో వస్తాయి. వీటిలో బ్లాక్‌బెర్రీ తప్పించి మిగిలినవన్నీ తినతగినవే. బ్లూ, రెడ్, స్ట్రాబెర్రీ, క్రేన్ బెర్రీస్ అనే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బెర్రీ పండ్లలో పీచు పదార్థం, వర్ణకాలు మెదడు కణాలను, రక్త నాళాలను ఫ్రీరాడికల్స్ ప్రభావం నుండి రక్షిస్తాయి. ఫలితంగా వయసు మీరినట్లుగా కనిపించదు. అంతేకాదు వీటిని తీసుకోవడం వల్ల చర్మ కొత్త నిగారింపును సంతరించుకుంటుంది. కాంతులీనే చర్మంతో మెరిసిపోతారు. బెర్రీస్‌లలలో స్పెషల్‌గా నలుపు, నీలం బెర్రీలను మీ డైట్‌లో రెగ్యులర్‌గా చేసుకొండి. బెర్రీస్ ఆంటీఆక్సీడెంట్స్ సమృద్ధిగా ఉంటుంది. ఆంటీఆక్సీడెంట్స్ మన శరీరాన్ని రాడికల్స్‌తో సమస్యలేకుండా చేస్తుంది. శరీరంలో టాక్సిన్‌ను అదుపుచేసి శరీర నిర్మాణానికి ఉపయోగ పడుతుంది.
పుచ్చకాయ: పుచ్చకాయలకిది ఆఫ్ సీజన్. కానీ సమ్మర్ మాత్రం పుచ్చకాయలను పిచ్చ పిచ్చగా తినండి ( కొంచెం కంట్రోల్ కూడా చేసుకొండి)పుచ్చకాయలో కొవ్వు, కొలెస్టరాల్ వంటివి ఉండవు. విటమిన్-ఎ, బి6, సి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. పీచు పదార్థం, పొటాషియం అధిక మొత్తాల్లో ఉంటాయి. విటమిన్-ఎ కంటి ఆరోగ్యానికి అవసరం. విటమిన్-బి6 మెదడులో సెరటోనిన్, మెలటోనిన్, డోపమిన్ వంటి న్యూరోట్రాన్సిమిటర్స్ విడుదలవ్వటానికి తోడ్పడుతుంది. ఈ న్యూరోట్రాన్సిమిటర్స్‌వల్ల ఆందోళన, చిరాకు వంటివి తగ్గుతాయి. విటమిన్-సి వల్ల వ్యాధి నిరోధకశక్తి పెరిగి ఇనె్ఫక్షన్లు దాడి చేయకుండా ఉంటాయి. పొటాషియం అనేది శరీరంలో ఉండే నీటి మొత్తాలను అదుపుచేస్తుంది. ఇది లోపిస్తే కండరాల నొప్పి అనుభవమవుతుంది. * పుచ్చకాయలో ఎరుపు రంగుకు కారణమైన లైకోపీన్ అనే కెరటినాయిడ్ పదార్థం ఉంటుంది.



Click it and Unblock the Notifications