Latest Updates
-
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్!
వాలెంటైన్ డే స్పెషల్ అట్రాక్షన్ కోసం ఫ్రూట్ ఫేస్ ప్యాక్

1. కీరకాయను ముక్కలుగా చేసి మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి అందులో పెసరపిండి, దాల్చిన చెక్క పొడిని వేసి కలపి పెట్టుకొని, చన్నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ ముఖానికి పట్టించాలి. ఈ ప్యాక్ రాత్రి వేసుకుంటే ఉదయపు బడలిక అంతా మటుమాయమై రిలాక్సేషన్ తోపాటు చర్మకాంతి కూడా పెరుగుతుంది.
2. బొప్పాయి గుజ్జులో తేనె, విటమిన్ ఇ క్యాప్సూల్, మీగడ, కొద్దిగా గ్లిజరిన్ కలిపి ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయే ముందు ముఖానికి, మెడకు, తలకు రాసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీటిలో కడిగేసుకుని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా రాస్తుంటే చర్మం పొడిబారదు. నల్లబడదు.
3. పీచ్, స్ట్రాబెరీ, ఏప్రికాట్, కివీ (సూపర్‌మార్కెట్‌లలో లభిస్తాయి)పండ్లు చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తాయి. ఈ పండ్ల జ్యూస్ లో కొద్దిగా నిమ్మరసం,కొద్దిగా గ్లిజరిన్, కొద్దిగా తేనె, కొన్ని కాచిన పాలు కలిపి ఈ మిశ్రమాన్ని ఒళ్లంతా పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే మృదువుగా మారిన చర్మం కొత్తమెరుపు సంతరించుకుంటుంది.
4. తగినంత మామిడి గుజ్జులో చెంచా చొప్పున తేనె, పెరుగు తీసుకొని బాగా కలిపి, ముఖం, మెడ భాగానికి పూతలా వేసుకోవాలి. ఐదు నిమిషాలు సున్నితంగా మర్దన చేసి వదిలేయాలి. కొద్దిసేటపటి తర్వాత నీళ్లతో కడిగేసుకుంటే చాలు. ఇలా వేసవంతా రోజు మార్చి రోజు ఈ పూత వేసుకోగలిగితే.. చర్మం పసిమిచాయతో మెరిసిపోతుంది.
5. జిడ్డు చర్మతత్వం ఉన్నవాళ్లకు ఈ పండుతో వేసే పూత చాలా బాగా పని చేస్తుంది. చెంచా స్ట్రాబెర్రీ రసం, ముల్తానీమట్టి, కలబంద గుజ్జు చెంచా చొప్పున, కొద్దిగా తేనె కలిపి పూతలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని ఆరాక కడిగేసుకోవాలి. ఈ పూతతో మొటిమలు తగ్గుతాయి. అధిక జిడ్డు వదులుతుంది.
6. పుచ్చకాయ చర్మాన్ని చాలా త్వరగా చల్లబరుస్తుంది. రెండు చెంచాల పుచ్చకాయ గుజ్జు లో కొద్దిగా తేనె, టీస్పూన్ ముల్తానీమట్టి తీసుకుని అన్నింటినీ కలిపి చర్మానికి పూత వేయాలి. దీనివల్ల ఎండకు ఎర్రగా మారిన చర్మంలో చాలా త్వరగా మార్పు కనిపిస్తుంది. అందంగానూ మారుతుంది.



Click it and Unblock the Notifications
