Latest Updates
-
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే.. -
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన!
టమోటోలోని అద్భుతమైన సౌందర్య గుణగణాలు
భారతీయ వంటకాల్లో తప్పనిసరి టమోటోలు. జ్యూసీ గా ఉండే ఎర్రని టమోటోలు చూడగానే నోరూరిస్తూ వెంటనే తినేయాలనిపిస్తుంది. మన వంటగదిలో ఉండే ఈ ఎర్రని జ్యూసీ వెజిటేబుల్ టేస్ట్ మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని, అందాన్ని కూడా పెంచే ఒక అద్భుతమైన సౌందర్య రాశి. టమోటోలోని సౌందర్య ప్రయోజనాలు కొన్ని మనకు తెలిసినవే. టమోటోల్లో లైకోపిన్ దీన్ని మనం యాంటీఆక్సిడెంట్ గా భావిస్తాం. ఎర్రని టమోటోలో ఉండే లైకోపిన్ మన చర్మాన్నిశుభ్రపరచడంలో మరియు మెరిపించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మరియు ఇది సూర్యరశ్మి నుండి వెలువడే హానికరమైన రేడియన్స్ ను చర్మానికి తగలకుండా చేస్తుంది.
టమోటోలోని అద్భుతమైన సౌందర్య గుణగణాలు ఏంటంటే ముడుతలు ఏర్పడకుండా వ్యతిరేకంగా పనిచేస్తుంది మరియు వృద్ధాప్యం లక్షణాలు రాకుండా చర్మానికి రక్షణ కల్పిస్తుంది. ప్రతి రోజూ ఉదయం 200గ్రాముల ఉడికించిన టమోటోను తీసుకుంటే మీరు అన్ని వేళల యవ్వనంగా కనబడేలా నిర్ధారిస్తుంది. ఇది అద్భుతమైనది మాత్రమే కాదు?టమోటోలోని లైకోపిన్ కంటెంట్ చర్మక్యాన్సర్ ప్రమాదాన్నికలగనివ్వకుండా పోరాడటానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. మరి ఈ ఎర్రని టమోటో పండులోని అద్భుతమైన బ్యూటీ ప్రయోజనాలు పరిశీలించి, మీలోని అన్నిరకాల చర్మ సమస్యలకు గుడ్ బై చెప్పండి...
అలాగే టమోటోలోని ఆరోగ్యప్రయోజనాలు తెలుసుకోవాలంటే...

1. చర్మం మీద రంద్రాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది: చర్మం మీద ఏర్పడే అతి పెద్ద రంధ్రాలలో మురికి చేరేలా దారితీస్తుంది. మురికిచేరిన చర్మం రంద్రాలు ఇన్ఫెక్షన్ కు గురి అవుతుంది. కాబట్టి, అందుకు ఒక టేబుల్ స్పూన్ టమోటో జ్యూస్ తీసుకొని అందులో 2-3చుక్కల నిమ్మరసం మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని చర్మరంధ్రాల మీద అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత సర్కులర్ మోషన్ లో మసాజ్ చేయాలి. 15నిముషాలు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
2. మొటిమలను మాయం చేస్తుంది: ఎర్రని జ్యూసి టమోటోల్లో విటమిన్ ఎ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇవి మొటిమలను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతాయి. మీకు చాలా తక్కువగా మొటిమలున్నప్పుడు టమోటోను కట్ చేసి, మొటిమల మీద మర్ధన చేయాలి. మొటిమలు అధికంగా ఉన్నప్పుడు టమోటోను మెత్తని గుజ్జులా తయారుచేసి ముఖానికి అప్లై చేయాలి. ఒక గంట అలాగే వదిలేసి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో మొటిమలు తగ్గుముఖం పడుతాయి.
3. ఆస్ట్రిజంట్ గా ఉపయోగించండి: టమోటో రసంను మరియు కీరదోసకాయ రసంను సమంగా తీసుకొని, బాగా మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని రెగ్యులర్ గా మీ ముఖంకు అప్లై చేయండి. ఇది ఒక బెస్ట్ ఆస్ట్రిజంట్. దీని వల్ల చర్మం జిడ్డుగా లేకుండా చేస్తుంది.
4. బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది: బ్లాక్ హెడ్స్ నిజంగా చాలా వరకూ ముఖంలో ఇబ్బంది, అసౌకర్యం కలిగిస్తూ, అందవిహీనంగా కనబడేలా చేస్తుంది. ఈ సమస్య నుండి బయటపడాలంటే టమోటో మరియు అవొకాడోను మెత్తగా పేస్ట్ చేసి, ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల చర్మం శుభ్రపడటంతో పాటు, చర్మాన్ని చాలా స్మూత్ గా తయారుచేస్తుంది.
5. స్కిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది: మనం ఇంతకు మందు చర్చించినట్లు, టమోటో చర్మానికి రక్షణంగా ఉండి, సూర్య రశ్మి నుండి చర్మానికి తగిలే రేడియేషన్ తగ్గిస్తుంది. కాబట్టి టమోటోను మెత్తగా పేస్ట్ చేసి, అందులో పెరుగు మిక్స్ చేసి, సూర్యరశ్మికి గురయ్యే చర్మానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. స్కిన్ ఇన్ఫ్లమేషన్ కు వ్యతిరేకంగా పనిచేసే ఇది ఒక అద్భుతమైన నివారణిగా పనిచేస్తుంది.



Click it and Unblock the Notifications











