Latest Updates
-
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ!
షేవింగ్ తర్వాత పొడి చర్మాన్నినివారించే సింపుల్ టిప్స్!
సాధారణంగా షేవింగ్.. చేసుకోవడమంటే కొందరికి బాధాకరమైన అనుభవం. గడ్డం గీసుకున్న తర్వాత మంట, రాషెస్ తో పడే బాధ వర్ణనాతీతం. మహిళలకు హేర్ రిమూవింగ్ క్రీమ్ లాగా మగవారికీ గడ్డం పెరగకుండా ఏవైనా క్రీమ్ లు వస్తే బాగుండనుకుంటారు కొంత మంది. వయస్సు 20కి వచ్చేసరికి మగవారికి రోజూ షేవింగ్ పని ఉండాల్సిందే. అలవాటైన పనిగా కాక, కొంత శ్రద్ద చూపితే షేవింగ్ ప్రక్రియ సులువవుతుంది. చర్మం కూడా మృదువుగా ఉంటుంది. అయితే షేవింగ్ చేసుకొన్న తర్వాత చర్మ పొడిగా, పొరలుగా మరియు చర్మం దురదతో బాధపడుతున్నారా? షేవింగ్ కోసం మంచి నాణ్యమైన రేజర్ మరియు ఖరీదైన క్రీమ్ ను ఉపయోగించాలి. అయితే ఇటువంటివి పొందగోరే విధంగా లేదు. పురుషుల్లో కానీ లేదా స్త్రీలలోకానీ ఇది చాలా సాధారణ సమస్య. మహిళలకు, ముఖ్యంగా వేసవిలో, ఇది మరింత పెద్ద సమస్యగా మారుతుంది . కాళ్ళు, చేతులను పెల్విక్ ఏరియా, బికినీ లైన్ చర్మాన్ని చాలా పొడిగా.. దురుదగా.. మరియు సున్నితంగా చేస్తుంది.
ఈ సమస్యలను నివారించడానికి, మీ చర్మాన్ని షేవింగ్ కు సిద్దం చేయాలి. అయితే షేవింగ్ కు ముందు షేవింగ్ తర్వాత చర్మానికి మాయిశ్చరైజర్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ చర్మాన్ని మెత్తగా చేస్తుంది. అలాగే షేవింగ్ చేయడానికి చాలా సులభం అవుతుంది. షేవింగ్ తర్వాత పొడి చర్మాన్ని నిర్మూలించేందుకు ఉపయోగపడే కొన్ని రెమడీస్ ను క్రింది విధంగా పరిశీలించండి....

మాయిశ్చరైజింగ్ ఆయిల్స్: ఒక కాటన్ వస్త్రాన్ని తీసుకొని వేడి నీటిలో ముంచి, మీ చర్మమీద చాలా సార్లు వత్తుకోవాలి. నీళ్ళు మీర వేడిగా లేకుండా చూసుకోవాలి. తర్వాత మీ ముఖం, కాళ్ళు, భుజాలు మరియు షేవింగ్ చేసుకొనే ఇతర బాగాల్లో జోజోబ ఆయిల్ లేదా అవొకాడో ఆయిల్ చాలా ప్రభావంతంగా పనిచేస్తాయి.

స్ట్రాబెర్రీ ప్యాక్: ముందుగా స్ట్రాబెర్రీస్ ను బాగా మెత్తగా చిదిమేసి, సోర్ క్రీమ్ తో మిక్స్ చేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను మీరు షేవింగ్ చేసుకొన్న తర్వాత అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత అరగంట పాటు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

కార్న్ స్ట్రాచ్ -తేనె ప్యాక్: కార్న్ స్ట్రాచ్(మొక్కజొన్న పిండితో తయారు చేసిన గంజి)కి కొద్దిగా తేనె మరియు పాలు మిక్స్ చేసి చిక్కటి పేస్ట్ లా తయారు చేసుకొని, ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. గుర్తుంచుకోవల్సిన విసయం..షేవింగ్ చేసుకొన్న 15నిముషాల తర్వాత ఈ ప్యాక్ ను ఉపయోగించుకోవాలి.

హోం మేడ్ లోషన్ : ఈ లోషన్ తయారు చేయండి. ఎండిన comfreyఆకులు, కాలెండ్యుల ఫ్లవర్స్, హాజె ఎక్స్ ట్రాక్ట్, రోజ్ వాటర్, గ్లిజరిన్, లావెండర్ మరియు గంధం, అవసరమైన నూనె. వీటిలో ఆకలు, పువ్వులు హాజెల్ ఎక్స్ ట్రాక్ట్ ను ను రెండు వారాల పాటు ఎండబెట్టుకోవాలి. తర్వాత మిగిలిన వస్తువులను కూడా మిక్స్ చేసుకోవాలి . అన్నింటిని మిక్సీలో వేసి పౌడర్ చేసుకొని, ఆరు నెలల పాటు మీరు ఉపయోగించుకోవచ్చు.

అలోవెరా జెల్: పొడి చర్మానికి ఇది చాలా అద్భుతమైన వస్తువు. ఈ కలబంధ జెల్ ను చర్మానికి మాయిశ్చరైజ్ చేయడం వల్ల పగుల్లకు తక్షణ నివారణ కలిగిస్తుంది. అలోవెరా జెల్ ను మీరు మార్కెట్లో కొనవచ్చు లేదా మీ కిచెన్ గార్డెన్ లో పెంచుకొన్నట్లైతే ఎప్పుడు కావాలన్నా మీకు అందుబాటులో ఉంటుంది.

కొలైడాల్ ఓట్ మీల్ బాత్: పొడి చర్మానికి చాలా మంచిది. మరియు ఎక్జిమా వంటి చర్మవ్యాధులకు చాలా బాగా పనిచేస్తుంది. మీరు మార్కెట్లో ఓట్ మీల్ కొనవచ్చు లేదా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఓట్ మీల్ ను మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని బాత్ టబ్ నీళ్ళల్లో ఈ పౌడర్ ను మిక్స్ చేసుకోవాలి. తర్వాత మీ పూర్తి శరీరాన్ని బాత్ టబ్ లో కొద్దిసేపు నానేట్లు చేసి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

వెనిగర్ మరియు తేనె: షేవింగ్ చేసుకొన్న తర్వాత తేనె ను మీ చర్మం మీద అప్లై చేయాలి. పది నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఆపిల్ సైడర్ వెనిగర్ ను ముఖం మీద చిలకరించుకోవాలి. ఇది చర్మాన్ని స్మూత్ గా ఉంచుతుంది. మరియు పొరలు పొరలుగా ఉన్న చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి షేవింగ్ తర్వాత పొడి చర్మాన్ని నివారించడానికి ఈ హోం రెమడీస్ ను ఉపయోగించండి..



Click it and Unblock the Notifications