Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
బోద కళ్ళు(కళ్ళు వాపు)ను నివారించే బెస్ట్ హోం రెమెడీస్
ఒత్తిడి మరియు నిద్రలేమి వల్ల కళ్ళు ఉబ్బడం అనేది ఒక సహజ సమస్య. ఒత్తిడి, నిద్రలేమి వల్ల కళ్ళ చుట్టూ వాపు రావడం లేదా కళ్ళు ఉబ్బుగా కనబడటం జరుగుతుంది. కళ్ళ చుట్టూ వాపు లేదా కళ్ళు ఉబ్బడానికి కారణం కళ్ళ చుట్టూ ఉండే చర్మం చాలా సున్నితంగా ఉండటం.
సాధారణంగా, ఒత్తిడి, నిద్రలేమి, లేదా కలత నిద్ర, నిద్రించే భంగిమ మరియు తీసుకొనే ఆహారం సరిగా లేకున్నా బోద కళ్ళుకు కారణం అవుతుంది. ఫలితంగా బోదకళ్ళు దురదపెట్టడం లేదా మంట పెట్టడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. కొన్ని సార్లు, బోదకళ్ళుకు కనురెప్పల వెంట్రుకల్లో వాపు కూడా కారణం అవుతుంది. ఇది కనురెప్పలకు మరియు కన్నుకు ఇన్ఫ్లమేషన్ కలిగిస్తుంది.
బోద కళ్ళకు కొన్నిసాధారణ కారణాలు అసౌకర్యం, చూపు మసకబారడం, కంటి చుట్టూ ఎరుపు, కంటి దురద, కళ్ళ మీద నొప్పిగా ఉండటం వల్ల ఈ ప్రభావం శరీరం మీద కూడా పడుతుంది. బోద కళ్ళుకు మరికొన్ని ఇతర లక్షణాలు, ఫేషియల్ లేదా మెడ వాపు, జ్వరం, మరియు మరియు తీవ్రమైన తలనొప్పి కూడా ఉన్నాయి.
వీటితో పాటు మరికొన్ని లక్షణాలతో మీరు బోదకళ్ళుతో బాధపడుతన్నట్లైతే, ఈ సమస్య మరింత తీవ్రం కాకముందే తగినన్ని జాగ్రత్తలు తీసుకొని బోదకళ్ళును నివారించడం ఉత్తమ మార్గం. బోదకళ్ళు నివారణకు కొన్ని హోం రెమెడీస్ బాగా సహాయపడుతాయి. మరియు కళ్ళయొక్క ఉబ్బును లేదా వాపును తగ్గిస్తాయి...

1. బంగాళదుంప: బోద కళ్ళ నివారణకు బంగాళదుంప గ్రేట్ గా సహాయపడుతుంది. బంగాళ దుంపను ఫ్రిజ్ లో కొంత సమయం ఉంచి, తర్వాత బయటకు తీసి స్లైస్ గా కట్ చేసి రెండు స్లైస్ ను రెండు కళ్ళమీద ఉంచాలి. కళ్ళు రెండూ మూసుకొని 15-20నిముషాలు విశ్రాంతి తీసుకోవాలి . మీ బోదకళ్ళు లైట్ గా తగ్గుముఖం పట్టడాన్ని మీరు గమనించవచ్చు. పఫీ ఐస్ కు ఇది ఒక సింప్లెస్ట్ హోం రెమెడీ.
2. పాలు: బోదకళ్ళును పాలు చాలా అద్భుతంగా నివారిస్తుంది . ఒక చిన్న కప్పులో చల్లటి పాలు తీసుకొని, అందులో కాటన్ బాల్ డిప్ చేసి, ఇప్పుడు వాటిని మూసిన కనురెప్పల మీద ఉంచి 15-20విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత గమనిస్తే కళ్ళ వద్ద వాపు తగ్గడానికి మీరు గమనించవచ్చు.
3. విటమిన్ ఇ ఆయిల్: బోదకళ్ళును నివారించడంలో విటమిన్ ఇ ఆయిల్ గ్రేట్ గా సహాయపడుతుంది . రెండు కాటన్ బాల్స్ ను తీసుకొని , విటమిన్ ఇ ఆయిల్లో డిప్ చేయాలి. తర్వాత వీటిని రెండు కళ్ళ మీద ప్లేస్ చేయాలి.15-20నిముషాలు అలాగే ఉంచి తర్వాత తీసేయాలి . దాంతో మీ కళ్ళ మీద ఇరిటేషన్ మరియు వాపును క్రమంగా తగ్గడానికి మీరు గమనించవచ్చు. ఇది దీర్ఘకాలంలో చాలా బాగా సహాయపడేతుంది. బోదకళ్ళ నివారణకు విటమిన్ ఇ ఆయిల్ తో కళ్ళును మసాజ్ చేయడం కూడా ఒక బెస్ట్ రెమెడీ.
4. టీ బ్యాగ్స్: మీరు రెగ్యులర్ గా వినియోగించే టీ బ్యాగ్స్ , వాటిని ఉపయోగించిన తర్వాత, వాటిని ఫ్రిజ్ లో పెట్టాలి. కొద్దిసేపటి తర్వాత బయటకు తీసి కళ్ళు మీద కొద్ది సమయం పెట్టి, కనీసం 25నిముషాలు విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత వాటిని తీసి ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి . చివరకు మీరు ఖచ్చితంగా రిలాక్స్ అవుతారు.
5. ఎగ్ వైట్: సన్ టాన్ నుండి బోదకళ్ళు వరకూ నివారించడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది . ఎగ్ వైట్ చాలా హెల్ఫ్ ఫుల్ గా ఉంటుంది. ఒక గుడ్డు తీసుకొని గిన్నెలో వేసి బాగా బీట్ చేయాలి. ఇలా బీట్ చేసిన గుడ్డు మిశ్రామన్ని కళ్ళు మీద అప్లై చేయాలి. 20నిముషాలు అలాగే వదిలేయాలి . కళ్లు చుట్టూ బిగువుగా అవుతున్న సమయంలో చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
6. నీళ్ళు: మీ కళ్ళు ఉబ్బినట్లు అనిపిస్తున్నట్లైతే, ఎక్కువ నీళ్ళు త్రాగడం ఉత్తమ మార్గం. మీ శరీరంను హైడ్రేషన్ లో ఉంచుకోవడం ఉత్తమం. బోదకళ్ళకు నీళ్ళు ఒక ఉత్తమ రెమెడీ...



Click it and Unblock the Notifications