Latest Updates
-
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
మొటిమలను,మచ్చలను నివారించే 15 సూపర్ ఫుడ్స్
అందమైన ముఖంలో చిన్న మొటిమ, దాని మచ్చలు కనబడితే చాలు చూడటానికి అసహ్యంగా ఉండటం మాత్రమే కాదు, బాధాకరం కూడా. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వయస్సులో ఈ మొటిబాధను అనుభవం కలిగే ఉంటారు . ముఖ్యంగా యుక్తవయస్సులో మరింత ఎక్కువగా ఉంటాయి.
మొటిమలకు కారణాలెన్నో ఉండవచ్చు. కానీ వాటిలో ముఖ్యంగా హార్మోనుల సమతుల్యం, స్ట్రెస్, పొల్యూషన్, హైబ్లడ్ షుగర్, స్మోకింగ్, ఆల్కహాల్, అజీర్తి, పరిశుభ్రత పాటించకపోవడం, పోషకాహార లోపం ఇవన్నీ కూడా మొటిమలకు దారితీస్తాయి. ఇంకా ప్రొసెస్డ్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ మరియు డైరీ ప్రొడక్ట్స్ వంటి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు కూడా మొటిమలకు కారణం అవుతాయి.
ఇలాంటి స్కిన్ సమస్య నుండి బయటపడాలంటే, కొన్ని ప్రత్యేకమైన ట్రీట్మెంట్స్ ను తీసుకోవాలి . మరియు కొన్ని ప్రత్యేకమైన ప్రొడక్ట్స్ కూడా మొటిమలను నివారించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ప్రొడక్ట్స్ వల్ల డబ్బు వ్రుదాయే కానీ, ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. కాబట్టి మొటిమలను కంట్రోల్ చేయడానికి గ్రేట్ గా ఎఫెక్టివ్ గా పనిచేసే వాటిలో నేచురల్ ఫుడ్స్ ముఖ్యమైనవి . కానీ రెగ్యులర్ డైట్ నుండి కాఫీ మరియు టీలను నివారించాలి .ఇవి మొటిమలు ఏర్పడుటకు దారితీస్తాయి.
READ MORE: 15 నిమిషాలు కేటాయిస్తే చాలు.. మొటిమలు, మచ్చలు బై బై
మీరు కరెక్ట్స్ ఫుడ్స్ ను ఎంపిక చేసుకోవడం వల్ల మొటిమలను మాయం చేయడం మాత్రమే కాదు ఇతర చర్మ సమస్యలను కూడా నివారిస్తుంది . మొటిమలను నివారించడానికి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు సహాయపడుతాయి, అయితే ఇకొన్ని ఆహారాలు మొటిమలను పూర్తిగా మాయం చేయడానికి సహాయపడుతాయి . మొటిమలను నివారించే అలాంటి ఎఫెక్టివ్ ఫుడ్స్ ను ఈ క్రింది లిస్ట్ లో ...మరి వీటి గురించి మరింత డీప్ గా తెలుసుకుందాం......

క్యారెట్స్
క్యారెట్స్ లో న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి. అంతే కాదు విటమిన్ ఎ మరియు బీటా కెరోటిన్ పుష్కలంగా ఉండి, ఇవి మొటిమలకు వ్యతిరేకంగా పోరాడుతాయి. కాబట్టి రెగ్యులర్ గా క్యారెట్స్ ను తినడం వల్ల ముఖంలో క్రమంగా మొటిమలు తగ్గుతాయి . నిధానంగా మచ్చలు కూడా తొలగిపోతాయి.

సాల్మన్:
సాల్మన్ ఫిష్ లో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి . ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది మరియు ఇన్ఫ్లమేషన్ తో పోరాడేందుకు సహాయపడుతుంది .మరియు ఇందులో ప్రోటీనులు అధికంగా ఉండటం వల్ల హెల్తీ స్కిన్ పొందడానికి సహాయపడుతుంది.

బొప్పాయి:
చర్మ రక్షణకు బొప్పాయి గ్రేట్ గా సహాయపడుతుంది. బొప్పాయిలో ఉండే బీటా కెరోటిన్ స్కిన్ క్లియర్ చేస్తుంది మరియు సెల్యులార్ రీజెనరేషన్ మెరుగుపరుస్తుంది మరియు సెల్ రిపేర్ చేస్తుంది.

అవొకాడో:
అవొకాడోలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది . ఇది మొటిమలను నివారించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది చర్మానికి తగినంత తేమను అందిస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది. వీటిలో ఉండే విటమిన్ సి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది మరియు స్కిన్ మాయిశ్చరైజర్ చేస్తుంది.

కీరదోసకాయ:
వెజిటేబుల్స్ లో అధికంగా వాటర్ కంటెంట్ ఉంటుంది. మరియు మొటిమను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. కీరదోసకాయ చర్మరంద్రాల్లోని టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేస్తుంది . మొటిమలకు మచ్చలకు కారణం అయ్యే స్కిన్ ఇన్ఫ్లమేషన్ ను నయం చేస్తుంది .

ఆకుకూరలు:
మొటిమలు నివారించడంలో ఆకుకూరలు బెస్ట్ ఫుడ్స్. ఆకుకూరల్లో క్లోరోఫిల్ అధికంగా ఉంటుంది . ఇవి జీర్ణవాహికలోని బ్యాక్టీరియాను శుభ్రం చేస్తుంది . రక్తనాళాలను కూడా శుభ్రం చేయడం వల్ల మొటిమల సమస్య ఉండదు . ఆకుకూరల్లో ఉండే విటమిన్ ఎ యాంటీ ఎన్స్ ఏజెంట్ గా పనిచేస్తుంది.

రెడ్ గ్రేప్స్:
రెడ్ గ్రేప్స్ లో యాంటీఆక్సిడెంట్స్ మరియు కెమికల్స్ స్కిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. ముఖ్యంగా చర్మ సమస్యల్లో ఫోరియోసిస్, ఎక్జిమా మరియు మచ్చలను తగ్గిస్తుంది . అదే విధంగా స్కిన్ అలర్జీ , అలర్జింగ్ రియాక్షన్స్ ను కూడా నివారిస్తుంది.

వెల్లుల్లి:
స్కిన్ ఇన్ఫ్లమేషన్ తో పోరాడే గుణాలు వెల్లుల్లిలో గ్రేట్ గా ఉన్నాయి. గార్లిక్ లో నేచురల్ అల్లిసిన్ కెమికల్స్ ఉండటం వల్ల మొటిమలకు కారణం అయ్యే హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

బ్రొకోలీ:
బ్రొకోలీ ఒక బెస్ట్ స్కిన్ క్లియరింగ్ ఫుడ్. ఇది మొటిమలను చాలా ఎఫెక్టివ్ గా క్లియర్ చేస్తుంది. అలాగే ముఖంలో ముఖంలో మచ్చలను మాయం చేస్తుంది. చర్మంను రేడియంట్ గా మార్చేస్తుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఫ్రీరాడికల్స్ మొటిమలను , ఫైన్ లైన్స్ ను , సాగిన చర్మంను దూరం చేస్తుంది.

బ్రౌన్ రైస్ :
బ్రౌన్ రైస్ లో విటమిన్ బి, ప్రోటీన్, మెగ్నేషియం మరియు ఇతర యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ బి హార్మోన్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది మొటిమలను మరియు మచ్చలను నివారిస్తుంది.

సోంపు:
సోంపు నేచురల్ స్కిన్ క్లెన్సర్. ఇది వాపు, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, చర్మంలోని టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేస్తుంది. దాంతో మొటిమలను మచ్చలను మాయం చేస్తుంది.

నట్స్ :
శరీరంల జింక్ మరియు సెలీనియం లోపిస్తే మొటిమలకు దారితీస్తుంది. అన్ని రకాల నట్స్ లో సెలీనియం, కాపర్, విటమిన్ ఇ మరియు జింక్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది.

ఫ్లాక్స్ సీడ్స్:
ఫ్లాక్స్ సీడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి . ఇవి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది . మొటిమలను కంట్రోల్ చేస్తుంది. ఫ్యాటీ ఫిష్ సాల్మన్ మరియు సార్డిన్స్ కూడా ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.

టమోటోలు:
టమోటోల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది స్కిన్ సెల్ వాల్స్ ను బలోపేతం చేస్తుంది మరియు మొటిమలను , మచ్చలను మాయం చేస్తుంది . మరియు ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ గా పనిచేస్తుంది. మరియ నయం చేసే గుణాలు పుష్కలంగా ఉంటాయి.

స్వీట్ పొటాటో:
స్వీట్ పొటాటో లో బ్లడ్ షుగక్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. ఇన్సులిన్ లెవల్స్ ను స్థిరంగా ఉంచుతుంది . మొటిమలను నివారిస్తుంది. వీటిలో విటమిన్ ఎ మరియు బి పుష్కలంగా ఉంటుంది . ఇవి చర్మానికి గొప్పగా సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications











