Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆలివ్ ఆయిల్ వాడుతున్నారా.. జాగ్రత్త సుమా
ఆలివ్ ఆయిల్ చర్మ, జుట్టు సంరక్షణకు బాగా ఉపయోగపడుతుంది. ఇతర నూనెలతో పోల్చితే ఇందులో కొవ్వు శాతం తక్కువగా ఉండటం వల్ల సౌందర్య సాధనంగా దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. చర్మంపై దద్దుర్ల నివారణకు ఆలివ్ ఉపయోగపడుతుంది. పొడిబారిన చర్మానికి ఆలివ్ ఆయిల్ చక్కటి పరిష్కారం. కాళ్ల పగుళ్లకు, పెదాలకు ఆలివ్ ఆయిల్ మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది.
ఆలివ్ నూనెలో సుగుణాలు మెండుగా ఉన్నప్పటికి.. కొన్ని సందర్భాల్లో ఆలివ్ ఆయిల్ కి దూరంగా ఉంటడం మంచిది. ఎందుకంటే.. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. మార్కెట్ లో దొరికే ఈ నూనెలో కెమికల్స్ ఉండటం వల్ల అవి.. చర్మానికి హాని చేయవచ్చు. కాబట్టి ఆలివ్ ఆయిల్ ని ఎలా వాడాలి.. దాని వల్ల వచ్చే దుష్ర్పభావాలు ఏంటో తెలుసుకుందాం.

యాక్నే
ఆలివ్ ఆయిల్ ని మసాజ్ చేసినా.. ఇది చర్మంలోకి త్వరగా ఇంకిపోదు. ఆలివ్ ఆయిల్ ని ముఖానికి రాస్తే.. చర్మంపై ఒక పెచ్చులా ఏర్పడుతుంది. జిడ్డు కారణంగా.. దుమ్ము, ధూళి పేరుకుని.. యాక్నే, పింపుల్స్ కి కారణం అవుతుంది.

దద్దుర్లు
ముఖానికి ఆలివ్ ఆయిల్ రాయడం వల్ల చర్మ కాంతి రెట్టింపు అవుతుంది. కానీ.. జిడ్డు చర్మతత్వం ఉన్నవాళ్లు ఆలివ్ ఆయిల్ రాస్తే.. దద్దుర్లు, చర్మం ఎర్రగా మారడం, దురద పెట్టడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

అలర్జీ
ఆలివ్ ఆయిల్ అన్నిరకాల చర్మతత్వాలకి సరిపోదు. ఈ నూనె ఏ మాత్రం అలర్జీగా అనిపించినా.. వెంటనే వాడటం మానేయడం మంచిది. లేదంటే.. చర్మంపై రియాక్షన్ చూపిస్తుంది. ఒకవేళ అలాంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

చంటిపిల్లల చర్మానికి ఆలివ్ ఆయిల్ వద్దు
అప్పుడే పుట్టిన చిన్నారుల చర్మతత్వం ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి.. ఆలివ్ నూనె వారి చర్మానికి హాని చేసే అవకాశముంది. కాబట్టి చంటి పిల్లలకు ఈ నూనె రాయడం వల్ల అలర్జీలు వస్తాయి.

పొడిచర్మానికి ఆలివ్ నూనె సరికాదు
పొడిచర్మానికి ఆలివ్ ఆయిల్ మంచిదే అయినప్పటికి కొంతమందిపై అది దుష్ర్పభావం చూపుతుందని.. నిపుణులు చెబుతున్నారు. చర్మంపై ఉండే.. సహజ మాయిశ్చరైజర్ని ఆలివ్ ఆయిల్ తొలగిస్తుంది.

బ్లాక్ హెడ్స్
యువతను ఎక్కువగా వేధించే బ్లాక్ హెడ్స్ కి ఆలివ్ ఆయిల్ కూడా కారణం కావచ్చు. ఆలివ్ నూనె కొంచెం గ్రీజీగా ఉండటం వల్ల చర్మంలోకి ఇంకదు. దీంతో.. దుమ్ము చేరుకుని బ్లాక్ హెడ్స్ రావడానికి కారణమవుతుంది.



Click it and Unblock the Notifications