For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యుక్తవయస్సులో చర్మ సమస్యలు: నివారణ చర్యలు

|

యుక్త వయసులో ఉండే వారి చర్మ పరిస్థుతులు అనిశ్చితంగా మరియు హటాత్తుగా మారుతుంటాయి. మీ చర్మానికి ఒకవేళ ఎలాంటి క్రీమ్'లను వాడకపోయిన, నల్లటి వలయాలు, మచ్చలు, మొటిమలకు కలుగుతుంటాయి. చర్మ రక్షణకు కావలసిన అన్ని రకాల జాగ్రత్తలు పరిశోధకులు తెలిపారు కానీ, యుక్త వయసులో వచ్చే చర్మ సమస్యలకు వారు ఎలాంటి సమాధానం చెప్పలేకపోతున్నారు. కానీ కొన్ని సౌందర్య చిట్కాలను అనుసరించటం వలన యుక్త వయసులో కలిగే చర్మ సమస్యల నుండి కొంత వరకు అయిన ఉపశమనం పొందవచ్చు.

సాధారణంగా అమ్మాయిలలో 11 నుండి 12 సంవత్సరాల మధ్యలో వారి శరీరంలో చాలా రకాల మార్పులు మరియు హార్మోన్'ల విడుదలలో మార్పులు కలుగుతుంటాయి, కావున ఈ వయసు నుండే అమ్మాయిలు చర్మం కోసం జాగ్రత్తలు తీసుకోవటం ప్రారభించాలి. కానీ కొంత మంది అమ్మాయిలు, ఇతర అమ్మాయిల కన్నా సహజంగా త్వరగా అభివృద్ధి చెందుతారు కారణం మానసికంగా మరియు శారీరకంగా అబివృద్ది చెందే సమయం ఇదే అని చెప్పవచ్చు.

Skin Care Tips For Teenagers!

యుక్త వయస్కుల చర్మ రక్షణ కోసం చిట్కాలు
యుక్త వయసులో ఉన్న వారు ప్రారంభం నుండే, రోజు పడుకోటానికి ముందు మీ చర్మానికి తేమను అందించే క్రీమ్'లను వాడండి. యుక్త వయసులో ఉన్న వారు చర్మానికి తగిన జాగ్రత్తలు తీసుకోటాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. మీరు తినే ఆహర పదార్థాల పట్ల అవగహనను పెంచుకోండి. చర్మం యొక్క ఆరోగ్యం మీరు తీసుకునే ఆహరం పైన మాత్రమె ఆధారపడి ఉంటుంది. కానీ కొంత మందిలో ఇతరులతో పోలిస్తే, కొన్ని ఆహర పదార్థాలకు సున్నితత్వాన్ని కలిగి ఉంటారు. మీరు తినే ఆహారాలలో తప్పులను సవరించుకొని చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి.

మొటిమలు
యుక్త వయసు గల వారి చర్మం గురించి మాట్లాడేటపుడు మొటిమలను మరచిపోకూడదు. యుక్త వయసు గల వారిలో ఈ సమస్యలు చాలా సాధారణం మరియు వీటి వలన చాలా మంది భావోద్వేకాల పరంగా, మానసికంగా కలతలకు గురి అవుతుంటారు. సరి అయిన జాగ్రత్తలు తీసుకోకపోవటం వలన మొటిమలు దీర్ఘకాలిక మచ్చలను కలుగచేస్తాయి. మొటిమలకు చికిత్స చేయటం చాలా కష్టం మరియు మంచి చికిత్సలను చేయటం వలన తిరిగి రాకుండా కూడా ఉంటాయి. నూనుపైన చర్మం కోసం చాలా రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి, కానీ మొటిమలకు శాశ్వత పరిష్కారం లేదా దీర్ఘకాలిక చికిత్సలు మాత్రం అందుబాటులో లేదు. ఒకవేళ, నునుపైన చర్మం మరియు ఆరోగ్యవంతమైన చర్మం కోసం చికిత్స తీసుకున్నట్లయితే అవి మొటిమలు రావటాన్ని ఆపలేవు. మీరు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీ వైద్యుడితో చెర్చించి మంచి యాంటీ-బయాటిక్స్ మందులను మరియు స్వల్ప కాలికంగా ఉపయోగపడే క్రీమ్'లను మాత్రమె ఇవ్వమని చెప్పండి. కానీ చాలా మందిలో ఇలాంటి క్రీమ్'లను వాడినను ఫలితాలు మాత్రం నిరశపరచేవిగా ఉన్నాయి. కావున మొటిమలకు చికిత్స కన్నా కొద్ది కాలం వేచి ఉండటం తప్పనిసరి అని తెలుసుకోండి.
సౌందర్యం చిట్కాలు

మీ చర్మం సౌందర్యంగా ఉండటానికి ప్రతిదీ వాడి ఉంటారు, కావున అవి కాకుండా ఆహర నియంత్రణ మరియు ఎక్కువ వ్యాయామాలు వంటి వాటివి చేయటం వలన చర్మానికి ఉచిత రక్షణ ఇస్తాయి. తేమను అందించే క్రీమ్'లు, ముఖానికి వాడే క్రీమ్'లు మరియు కాస్మోటిక్స్ వంటివి చర్మ ఆరోగ్యం కొరకు వాడుతూనే ఉంటాము. చర్మానికి సరిపోయేంత మొత్తంలో తేమను పొందటానికి కొంత సమయం పడుతుంది. మీ స్నేహితుల చర్మానికి శక్తివంతంగా పని చేసే క్రీమ్'లు మీ చర్మానికి పని చేయకపోవచ్చు. మీ చర్మం ఇతరుల చర్మంతో పోలిస్తే జిడ్డుగాను లేదా పొడిగాను ఉండవచ్చు, కావున మీకు వైవిధ్యమైన క్రీమ్'లు అవసరం. మీ చర్మం స్పష్టంగా మరియు శుభ్రంగా ఉండటానికి టొనింగ్ మరియు ఎక్సోఫోలేట్ వంటివి చేపించుకోవటం చాలా మంచిది.

అధికంగా నీటిని త్రాగండి, దీని వలన మీ చర్మం కణాలలో ద్రావణాల శాతం సరి అయిన స్థాయిలో నిర్వహించబడతాయి. నీరు మీ చర్మాన్ని ఆక్సిజనేటేడ్'గా మరియు నిర్వీషికరణ లేదా డిటాక్సిఫైయర్'గా ఉంచుతుంది.

English summary

Skin Care Tips For Teenagers!

Skin problems start at mainly during the teenage period due to lack of proper knowledge about skin type, skin care routine, Hormonal changes accompanied by clogged pores due to dust grime, pollution and sweat due to long hours of outdoor playing or outing with friends or going to school and college and tutions, Lack of right amount of facial cleansing and face care routine.Teenagers should be guided by an adult regarding the benefits of skin care and how to do this right at this stage itself. So here we give you some skin care tips.
Story first published: Friday, February 20, 2015, 11:25 [IST]
Desktop Bottom Promotion