Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
5 ముఖ్యమైన చర్మ వ్యాధులు
అతిపెద్దగా మరియు ఎక్కువగా కనిపించేది శరీరంలోని భాగం చర్మం. దీని ముఖ్యమైన పనులలో అంతర్లీనంగా ఉన్న భాగాలను (మాంసం, ఎముకలు, రక్త నాళాలు, మొదలైనవి) రక్షించటం మరియు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించటం. చర్మం, శరీరం పోషణ కోసం అవసరమైన నీరు, విటమిన్లు, చమురు మరియు అవసరమైన కొవ్వులు నిల్వచేస్తుంది.
చర్మం ప్రతికూలమైన వ్యాధులకు మూలంగా ఉండటంవలన, అది చర్మం యొక్క ఆరోగ్యం మీద ప్రభావితం అవుతుంది. ఉదాహరణకు, చేతులు అధికంగా కడగటం వలన చర్మం పొడిగా మారుతుంది. ఎహ్డువలనంటే చర్మంలోని చమురు మరియు నీరు కడగటంతో అవి ఇంకిపోతాయి మరియు అవి తక్కువగా ఉంటాయి. ఇక్కడ చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే కొన్ని సాధారణమైనవి మరియు కొన్ని అసాధారణమైనవి టాప్ 5 చర్మ వ్యాధులను ఇస్తున్నాము.

తామర
దీనిని అటోపిక్ డెర్మాటిటిస్ అని కూడా పిలుస్తారు. ఇది మళ్ళీమళ్ళీ వొచ్చే చర్మం యొక్క తాపం(ఎర్రగా కందటం)లో ఒక రకం. ఇది సాధారణంగా అనారోగ్యమైన పరిసరాలు మరియు జన్యు కారకాలు కారణంగా కలుగుతుంది. ఈ చర్మవ్యాధి సాధారణ లక్షణాలు కొన్ని; ఎర్రగా అవటం, వాపు, దద్దుర్లుగా ఉన్న చర్మం, దురద, పొడి మరియు పెళుసుబారిన చర్మం. ఎర్రగా ఉన్న దద్దుర్లను గోకినట్లయితే, పొక్కులు మరియు రక్తస్రావం కూడా కలగవచ్చు.

తామర
తామర ద్వారా ప్రభావితం చర్మం గోకకుండా ఉండటం మంచిది, ముఖ్యంగా మేకులు వంటి పదునైన వస్తువులతో గోకరాదు. ఇలా చేయటం వలన సమస్య మరింత క్లిష్టంగా తయారవుతుంది. ఈ తామరకు ఎటువంటి ఖచ్చితమైన చికిత్స లేదు; ఇది ఒక ఆవర్త చర్మపు రుగ్మత అందుకే చికిత్సా విధానం మంట మరియు దురద తగ్గించే లక్ష్యంతో సాగాలి.

సేబాషియస్ తిత్తి
ఒక జున్ను-వంటి పదార్ధం చర్మం ఎపిడెర్మిస్ లో జమ అయినప్పుడు ఈ రుగ్మత ఏర్పడుతుంది. సేబాషియస్ గ్రంధులు చర్మ పొరలను మరియు చర్మం పొరలలో గల జుట్టు ఫోలికల్స్ కు కందెనలాగా సహాయపడే ఒక జిడ్డుపదార్థాన్నిస్రవింపజేస్తాయి. కొన్ని కారణాల వలన ఈ క్రియ ఆగిపోయినప్పుడు ఈ తిత్తి ఏర్పడుతుంది. ఈ తిత్తులు ఎక్కువగా ముఖం, మెడ మరియు ట్రంక్ అలాగే నాళం (మహిళల విషయంలో) వొచ్చే అవకాశం ఉన్నది.

సేబాషియస్ తిత్తి
ఈ తిత్తి యొక్క సాధారణ లక్షణాలు బూడిదరంగు లేదా తెలుపు స్రావాలతో చెడు వాసన కలిగి ఉన్న ఎరుపు గడ్డలు ఏర్పడటం. సేబాషియస్ తిత్తులను పరిశుభ్రత మరియు సూర్యరశ్మి ఎక్కువగా తగలనివ్వటం ద్వారా నివారించవచ్చు. సాధారణంగా, ప్రభావిత ప్రాంతాల్లో వేడిగా ఉన్న పాడ్స్ ఉంచుతారు, ఏది ఏమైనా ఈ క్లిష్టమైన మరియు పునరావృత తిత్తుల విషయంలో వైద్య సలహా తీసుకోవటం తప్పనిసరి.

బొల్లి
ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని ప్రభావితం చేస్తున్న మరో సాధారణ చర్మ వ్యాధి 'బొల్లి'. చర్మం మీద మెలనోసైట్లను (చర్మం వర్ణద్రవ్యం కణాలు) నాశనం అవుతాయి, అందువలన చర్మంలో కొన్ని భాగాలు పిగ్మెంటేషన్ కోల్పోవటంతో ఈ చర్మ రుగ్మత కలుగుతుంది. ఈ స్థితి శరీరం మీద ఒకేచోట గాని లేదా మొత్తం శరీరం మీద గాని వ్యాప్తి చెందుతుంది.

దద్దుర్లు
దీనిని యూర్టికారియా అని కూడా పిలుస్తారు, చర్మం మీద దురదతో ఎరుపు గడ్డలు వృద్ధి అవటం వలన కలిగే ఒక రకమైన చర్మ వ్యాధి. ఇవి ఎక్కువగా అలెర్జీ ప్రతిచర్యల (దుమ్ము, ఆహారం, మందులు, పరాన్నజీవుల అంటురోగం, మొదలైనవి) కారణంగా ఏర్పడతాయి మరియు పరిమాణం మరియు ఆకారాలలో తేడాలు ఉంటాయి. వీటి కదలికలు త్వరితంగా ఉంటాయి మరియు ఇవి ఒక ప్రదేశం నుండి అదృశ్యం అయి, ఇంకో ప్రదేశంలో ప్రత్యక్షమవుతాయి.

మొటిమలు
ఇవి ఏ వయసులోనైనా, ఎప్పుడైనా ప్రజలను ప్రభావితం చేసే చర్మవ్యాధి ఈ మోటిమలు. సాధారణంగా ఈ మొటిమలు కౌమారదశలో టీనేజర్లలో వొస్తుంటాయి. వీటి లక్షణాలు చర్మం మీద గీతల్లాగా ఎరుపు అతుకులు, బ్లాక్-హెడ్స్, వైట్-హెడ్స్, పిమ్పుల్స్ మరియు పిన్-హెడ్స్. ఫోలికల్స్ పెద్ద సంఖ్యలో చర్మం రంధ్రాలను మూసివేసినప్పుడు లేదా సేబాషియస్ గ్రంధులు అదనపు క్రొవ్వు మరియు శ్లేషపటలము కలిసిన మిశ్రమము స్రవింపజేస్తున్నప్పుడు ఇవి వృద్ధి చెందుతాయి. ఈ మొటిమలు ఏర్పడటానికి గల ఇతర కారణాలు-హార్మోన్ల చర్యలు, జన్యు మార్పులు, ఇన్ఫెక్షన్లు, మానసిక రుగ్మతలు మరియు అనారోగ్యకరమైన ఆహారం.



Click it and Unblock the Notifications