Latest Updates
-
లిప్‌స్టిక్‌తో పెదాలు డ్రై అవుతాయా.. అధర అందం విషయంలో అతివలు చేసే పొరపాట్లు ఇవే.! -
చల్లటి పెరుగుతో చేటు: ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఎలా తినాలి? ఎప్పుడు అసలు తినకూడదు? -
గణేశ్ చతుర్థి స్పెషల్.. తమిళనాడు స్టైల్లో నోరూరించే పరమాన్నం.. తింటే స్వర్గమే.! -
కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్..బిర్యానీ కూడా దీనిముందు దిగదుడుపే! -
గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.! -
సోషల్ మీడియాను ఊపేస్తున్న రెట్రో మేనియా.. 1980’s క్లాసిక్ లుక్ మీరూ ట్రై చేశారా.? -
వాహనం ఏ రంగులో ఉన్నా.. టైరు మాత్రం నల్లగానే ఎందుకుంటుందో తెలుసా? -
ఈ రాశి వారు శుక్రవారం ఈ పూజ చేస్తే ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలువుదీరడం పక్కా.! -
గుంటూరు స్పెషల్ టిఫిన్స్ అల్లం పచ్చడి..ఒక్కసారి చేసుకుంటే నెల రోజులు నిల్వ! -
పులియబెట్టాల్సిన పనిలేదు.. దోశ పిండి లేకపోతే ఇన్‌స్టంట్‌గా ఈజీగా చేసుకునేలా.!
చర్మ సమస్యలకు టమోటో చేసే అద్భుతం...
టమోటోలను అందానికి ఉపయోగించడానికి ముఖ్య కారణం అందులో ఉండే లైకోపిన్ అనే యాంటీఆక్సిడెంట్ అత్యధికం ఉండటం. టమోటోలు మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వయస్సు పైబడనివ్వకుండా చేస్తుంది. ఇంకా చర్మానికి అవసరం అయ్యే ఆక్సిజన్ ను గ్రేట్ గా సప్లై చేస్తుంది. టమోటో శరీరానికి ఒక సన్ స్క్రీన్‌లా పనిచేసి, సన్ టాన్ నివారిస్తుంది. మీరు చర్మ సౌందర్యంను మెరుగు పరుచుకోవడంలో వివిధ రకాల స్కిన్ కేర్ టిప్స్ తో బోర్ గా ఫీలవుతుంటే చాలా సింపుల్ గా టమోటోలతో ప్రయత్నించండి. సింపుల్ గా టమోటోరసాన్ని ముఖానికి పట్టిస్తే చాలు, మీ చర్మసౌందర్యంలో వచ్చే అద్భుతమైన మార్పులను మీరు గమనించవచ్చు.
బ్యూటీ ప్రోడక్ట్స్ కంటే ఈ హోమ్ రెమెడీస్ ఎంతో సమర్థవంతంగా పనిచేయడంతోపాటు చర్మసౌందర్యాన్ని పెంపొందిస్తాయి. అలాంటి హోమ్ రెమెడీస్ లలో టమోటా ఒకటి ! టమోటా జ్యూస్ చర్మకాంతిని పెంపొందించుకోవడంతోపాటు ఇంకా రకరకాల సమస్యల నుంచి ఉపశమనం పొందేలా చేస్తుంది.
టమోటోలతో ఫేస్ ప్యాక్, ఫేస్ స్క్రబ్ వల్ల డార్క్ స్కిన్, ఆయిల్ స్కిన్, మొటిమలు, నల్లని ఛాయలు వంటి ప్రాబ్లమ్స్ ని దూరం చేసుకోవచ్చు. టమోటోలో విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ మరియు అసిడ్, ఆస్ట్రిజెంట్స్ వుంటాయి. అవి ముఖంలో జిడ్డును నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. అలాగే చర్మంలో నూనె ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఈ టమోటాతో కలిగే మరికొన్ని సౌందర్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

1. చర్మ రంద్రాలను మాయం చేస్తుంది:
టమోటో రసంలో నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకొని 15 నిముషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

2. మొటిమలను నివారిస్తుంది:
టమోటోను స్లైస్ గా కట్ చేసి, ముఖం మీద అప్లై చేస్తూ గుండ్రంగా మర్దన చేయాలి. టమోటోల్లో ఉండే విటమిన్ సి మరియు ఎ మొటిమలను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తాయి. 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో 3,4 సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

3. స్కిన్ ఎక్స్ ఫ్లోటర్ గా పనిచేస్తుంది:
అర చెంచ పంచదార తీసుకొని, ఒక టమోటోను స్లైస్ గా కట్ చేసి, స్లైను పంచదారలో అద్ది ముఖం మీద మర్ధన చేసుకోవాలి. ఇలా స్క్రబ్ చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగింపబడి చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంటుంది.

4.ఆయిల్ స్కిన్ నివారిస్తుంది:
టమోటోలను కీరదోసకాయ రసంతో మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి . ఆయిల్ స్కిన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

5. కాంతివంతమైన చర్మ సౌందర్యానికి :
మీ చర్మం కాంతివంతంగా మెరుస్తుండాలంటే, టమోటో గుజ్జులో కొద్దిగా తేనె మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకొని 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

6. సన్ బర్న్ నివారిస్తుంది:
సన్ బర్న్ సమస్యతో బాధపడుతున్న వారు టమోటో గుజ్జులో పెరుగు మిక్స్ చేయాలి . ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

7. టమోటో ఫేస్ ప్యాక్:
టమోటో గుజ్జులో కొద్దిగా ఓట్ మీల్ పౌడర్ మరియు పెరుగు చేర్చి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఇది చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది .

బ్లాక్ హెడ్స్ నివారిస్తుంది:
బ్లాక్ హెడ్స్ ను నివారిస్తుంది: టమోటో జ్యూస్ ను మీ ముఖం మీద అప్లై చేసి శుభ్రం చేసుకోవడం ద్వారా బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది. టమోటో రసంలో కొద్దిగా వాల్ నట్ పౌడర్ మిక్స్ చేసి అప్లై చేయడం ద్వారా బ్లాక్ హెడ్స్ శాశ్వతంగా నివారిస్తుంది.

స్కిన్ హైడ్రేషన్ కోసం :
టమోటో జ్యూస్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం తేమగా ఉంచతుంది. టమోటో జ్యూస్ ను అప్లై చేసి కొద్ది సమయం అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications
