Latest Updates
-
శ్రావణ మాసం స్పెషల్ హెల్తీ లడ్డు.. పప్పు నానబెట్టే పనే లేదు,పాకం పట్టే శ్రమ లేదు..ఈజీగా చేసుకోండిలా.. -
పాలు విరిగిపోయాయా? అయితే పారబోయకుండా ఈ 5 అద్భుతమైన వంటకాలు చేయండి! -
ఇడ్లీ, దోసె పిండి బాగా పులిసిపోయిందా? పారేయకుండా ఈ చిట్కాలతో ఫ్రెష్ గా మార్చేయండి! -
కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, జలదరింపుని లైట్ తీసుకుంటున్నారా? పక్షవాతానికి ముందస్తు హెచ్చరిక? -
ఆరోగ్యానికి మహా బలం అందించే నువ్వుల బాదం లడ్డు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే -
ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ప్రోటీన్ చిక్కి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Chanakya Niti: మహిళలు ఈ 5 విషయాలను రహస్యంగా ఉంచితేనే జీవితంలో తిరుగుండదు! -
ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు..ఇది కాకరకాయ ఫ్రైస్..ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు.. -
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్!
మగవారి చర్మం నిగారింపు కోల్పోవడానికి కారణాలు
అందంగా ఉండాలని ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు చెప్పండి. అందుకే అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా.. గ్లామర్ పై దృష్టిపెడుతున్నారు. కాలానికి తగ్గట్టే అబ్బాయిలకు కూడా.. మార్కెట్ లో బోలెడన్ని సౌందర్య ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో క్రీములు, ఫేస్ వాష్ లతో.. ముఖవర్చస్సు పెంచుకునే ప్రయత్నాలు మొదలు పెట్టేశారు యంగ్ గాయ్స్. క్రీములు వాడినా.. చాలా మంది ప్రయోజనం పొందలేకపోతున్నారు. దీంతో.. ముఖం నిర్జీవంగా కనిపిస్తోందని ఫీలవుతున్నారు.
ఒకప్పుడు సౌందర్యంపై మగవాళ్లలో ఆసక్తి ఉండేది కాదు. కానీ.. ఈ మధ్య చాలా మంది.. చర్మ సంరక్షణపై అవగాహన పెంచుకుంటున్నారు. అయితే అబ్బాయిల చర్మంలో నిగారింపు కోల్పోవడానికి వాళ్లు ఫాలో అవుతున్న అలవాట్లే కారణం. తీసుకునే ఆహారం నుంచి అన్నింటిలోనూ అబ్బాయిలు జాగ్రత్త వహించలేకపోవడంతో.. చర్మం నిర్జీవంగా మారుతోంది. మగవాళ్ల చర్మ కాంతి తగ్గడానికి కారణాలేంటో చూద్దాం...

పొగత్రాగటం
చర్మంలో నిగారింపు తగ్గిపోవడానికి పొగత్రాగడం.. ప్రధాన కారణం. రకరకాల క్రీములు వాడినా.. పొగత్రాగే అలవాటు ఉన్న వాళ్ల చర్మం నిర్జీవంగానే కనిపిస్తుంది. అంతేకాదు.. స్మోకింగ్ వల్ల తొందరగా చర్మంపై ముడతలు వస్తాయి.

మద్యం సేవించడం
మద్యం సేవించడం వల్ల చర్మం నిగారింపును కోల్పోతుంది. మందు తాగడం వల్ల నిద్రలో అనేకమార్పులు వస్తాయి. దీంతో మగవాళ్ల ముఖవర్చస్సు తగ్గిపోతుంది.

ఎండలో తిరగడం
ఎండలో బయటకు వెళ్లినప్పుడు చాలా మంది అబ్బాయిలు ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోరు. పైగా ఎక్కువ సమయం ఎండలో గడుపుతూ ఉంటారు. దీంతో చర్మంపై సూర్యరశ్మి డైరెక్ట్ గా ప్రభావం చూపడంతో అది నిర్జీవంగా తయారవుతుంది. బయటకు వెళ్లేటప్పుడు.. సూర్యరశ్మి చర్మంపై పడకుండా.. సన్ స్ర్కీన్ లోషన్ వాడటం మంచిది.

లేట్ నైట్స్
వృత్తిరిత్యా చాలా మంది అబ్బాయిలు.. లేట్ నైట్స్ స్పెండ్ చేయాల్సి వస్తుంటుంది. దీంతో నిద్ర తక్కువవుతుంది. శరీరానికి కావాల్సినంత నిద్రలేకపోవడం వల్ల.. చర్మం మరింత డామేజ్ అవుతుంది.

ఒత్తిడి
ఎక్కువగా ఒత్తిడికి లోనవుతున్న మగవారి చర్మం నిర్జీవంగా మారుతుంది.

చర్మ సంరక్షపై దృష్టిపెట్టకపోవడం
చాలా తక్కువ మంది మగవాళ్లు చర్మ సంరక్షణపై ఆసక్తి చూపుతుంటారు. టైం, వర్క్, ఒత్తిడి కారణంగా.. అబ్బాయిల చర్మ సంరక్షణ గురించి పట్టించుకోరు.

షేవింగ్ హ్యాబిట్స్
షేవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. సరైన క్రీములు, పద్ధతులు వాడితే.. అబ్బాయిల చర్మం డ్యామేజ్ కాకుండా ఉంటుంది.



Click it and Unblock the Notifications