For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పింపుల్స్, డార్క్ స్పాట్స్ కి చెక్ పెట్టే ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్స్..!

By Swathi
|

ముల్తానీ మట్టి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచి, న్యాచురల్ లుక్ అందించే.. అద్భుతమైన బ్యూటీ ప్రొడక్ట్. ఇది చర్మానికి రకరకాల ప్రయోజనాలు అందిస్తుంది. ఇందులో చాలా విభిన్నమైన గుణాలు ఉంటాయి. అవి రకరకాల చర్మ సమస్యలను నివారిస్తాయి. పూర్వ కాలం నుంచి ముల్తానీ మట్టిని చర్మ సౌందర్యానికి ఉపయోగిస్తూ వస్తున్నారు.

కళ్ల కింద నల్లటి వలయాలకు ముల్తానీ మట్టి చేసే అద్భుతం

ముల్తానీ మట్టి ఉపయోగించడం వల్ల చర్మం అందంగా, హెల్తీగా ఉండటంతో పాటు.. న్యాచురల్ గా పనిచేస్తుంది. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ముఖ్యంగా ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ లు వేసుకోవడం వల్ల డార్క్ ప్యాచెస్, మొటిమలు, మచ్చలు, గుంతలు కనిపించకుండా చేయవచ్చు. మరి ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ లు ఉపయోగించే బ్యూటిఫుల్ స్కిన్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

డార్క్ ప్యాచెస్

డార్క్ ప్యాచెస్

చర్మంపై అసహ్యంగా కనిపించే డార్క్ ప్యాచెస్ నివారించడానికి 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, పుదీనా ఆకులు, పెరుగు తీసుకోవాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసి.. ఆ ప్యాక్ ని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వారానికి ఒకసారి వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఆయిలీ స్కిన్

ఆయిలీ స్కిన్

ఒక టేబుల్ స్పూన్ యాపిల్ జ్యూస్, అర స్పూన్ ముల్తానీ మట్టి తీసుకుని కలిపి.. ఆ పేస్ట్ ని ముఖానికి పట్టించాలి. 5 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ అప్లై చేస్తే ఎక్సస్ ఆయిల్ తగ్గిపోయి.. మెరిసే చర్మం పొందవచ్చు.

పాలిపోయిన చర్మానికి

పాలిపోయిన చర్మానికి

1 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, ఒక టేబుల్ స్పూన్ బంగాళదుంప పేస్ట్ కలిపి ముఖానికి అప్లై చేసి.. 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఈ రెండింటి మిశ్రమం మిరాకిల్ చేస్తుంది. ట్రై చేసి చూడండి.

ట్యాన్

ట్యాన్

1 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, అర టేబుల్ స్పూన్ కొబ్బరి నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మానికి న్యాచురల్ కాంప్లెక్షన్ ఇస్తుంది.

డ్రై స్కిన్

డ్రై స్కిన్

1 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, సమానంగా ఓట్స్, పెరుగు, తేనె తీసుకుని.. అన్నింటినీ మిక్స్ చేయాలి. ఈ ప్యాక్ న ముఖానికి అప్లై చేసి.. 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే.. పొడిబారిన చర్మాన్ని ట్రీట్ చేయవచ్చు. చర్మానికి మాయిశ్చరైజర్ అందిస్తుంది.

మొటిమలు

మొటిమలు

ఒక టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, సమానంగా రోజ్ వాటర్, వేప పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ అప్లై చేస్తే.. మొటిమలు మచ్చలు తొలగిపోయి.. చర్మం నిగారిస్తుంది.

స్కిన్ టోన్

స్కిన్ టోన్

1 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, పెరుగు, ఎగ్ వైట్ సమానంగా తీసుకుని.. అన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే.. స్కిన్ టోన్ అద్భుతంగా ఉంటుంది.

English summary

7 Homemade Face Packs Using Multani Mitti For A Beautiful Skin

7 Homemade Face Packs Using Multani Mitti For A Beautiful Skin. Multani Mitti, also popularly known as Fuller's Earth, is an incredible natural ingredient that can benefit your skin in ways you've not known before.
Story first published:Wednesday, May 18, 2016, 11:20 [IST]
Desktop Bottom Promotion