Latest Updates
-
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.!
పాలతో పాలరాతి బొమ్మలా మెరిసిపోండి..!!
ఎన్నో ఆహార ప్రయోజనాలు కలిగి ఉన్న పాలను నిత్యం తీసుకుంటూ ఉంటాం. రోజూ పాలు తాగడం వల్ల కాల్షియం సమృద్ధిగా అందుతుంది. ముఖ్యంగా మహిళలు.. రోజువారీ డైట్ లో పాలను చేర్చుకోవాలి. అయితే కేవలం హెల్త్ బెన్ఫిట్స్ మాత్రమే కాదు.. అనేక బ్యూటీ బెన్ఫిట్స్ కూడా పాలలో దాగున్నాయి. పాలతో రకరకాలుగా ముఖానికి మర్దనా చేయడం వల్ల.. చర్మం కొత్త నిగారింపు సంతరించుకుంటుంది.
రోజూ ఒక్క గ్లాసు పాలు త్రాగితే కలిగే ప్రయోజనాలెన్నో మీకు తెలుసా...!
పాలను రోజ్ వాటర్ తో కలిపి చర్మానికి తరచూ అప్లై చేయడం వల్ల నిగారిస్తుంది. అలాగే పాలలో కొంచెం ఉప్పు కలిపి ఉదయం, సాయంత్రం ముఖానికి మసాజ్ చేస్తే.. మొటిమలు తగ్గిపోయి.. ఫేస్ లో గ్లో పెరుగుతుంది. పాలతో శరీరాన్ని మర్దనా చేసుకుని.. కాసేపటి తర్వాత స్నానం చేస్తే.. పాలరాతి సోయగం మీ సొంతం.

పావుకప్పు పాలల్లో చెంచా తేనె, రెండు చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరనివ్వాలి. పూర్తీగా ఆరిన తర్వాత స్నానం చేస్తే.. నలుపుదనం తగ్గిపోతుంది. అలాగే మృతకణాలు తగ్గిపోయి చర్మం స్మూత్ గా తయారవుతుంది.
పాలు ఎందుకు తాగాలి ? పాలతో పొందే ప్రయోజనాలేంటి ?
శనగపిండి, పాలు చర్మ సౌందర్యానికి చాలా బాగా సహాయపడతాయి. కాబట్టి ఒక స్పూన్ శనగపిండి, చిటికెడు పసుపు, పావు కప్పు పాలు, స్పూన్ తేనె బాగా కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని.. కాసేపు మర్దనా చేయాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకుంటే.. స్కిన్ స్మూత్ గా మారుతుంది. గ్లోయింగ్ కూడా పెరుగుతుంది.

కొంతమందికి జిడ్డు చర్మం వేధిస్తుంటుంది. అలాంటప్పుడు పాలు చక్కటి పరిష్కారం. పచ్చిపాలలో ఒక స్పూన్ తేనె కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. ఆరనివ్వాలి. బాగా ఆరిపోయిన తర్వాత శుభ్రం చేసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది.
శోభనానికి వధువు పాలు తీసుకెళ్లడం వెనక సైంటిఫిక్ రీజన్స్ ఏంటి ?
పొడిచర్మం ఉన్నవాళ్లు గుడ్డులోని తెల్లసొన, ఒక టీ స్పూన్ నిమ్మరసం, రోజ్ వాటర్, ఆలివ్ ఆయిల్ కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖానికి, మెడకు, చేతులకు అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత.. స్నానం చేస్తే.. పొడిచర్మం పోయి.. స్కిన్ స్మూత్ గా తయారవుతుంది. తరచుగా ఈ ప్యాక్ అప్లై చేస్తుంటే.. చర్మం పొడిబారే తత్వం నుంచి బయటపడుతుంది.



Click it and Unblock the Notifications
