Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
Washing machine Tips: ఈ చిట్కాలు పాటిస్తే.. వాషింగ్ మెషిన్‌లోనే కఠినమైన మరకలు కూడా వదిలిపోతాయి!
ఒకప్పుడు బట్టలు ఉతకాలంటే మన ఇంట్లో అమ్మ వాళ్ళు ఉదయాన్నే లేచి చేతులతో ఓ బండమీద ఉతికేవారు. కానీ ఇప్పుడు అలా లేదు. పరిస్థితులు అన్నీ మారిపోయాయి. బట్టలు ఉతికేందుకు, అంట్లు తోమేందుకు కూడా మెషిన్ వచ్చేశాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో వాషింగ్ మెషిన్స్ ఉన్నాయి. చేతులతో కస్టపడి బట్టలు ఉతకకుండా కేవలం మెషిన్‌లోనే ఖరీదైన డిటర్జెంట్ లిక్విడ్ వినియోగించి బట్టలను ఉతికేస్తున్నారు.
అయితే వాషింగ్ మెషిన్‌లో బట్టలు ఉతికేటప్పుడు సరిగ్గా ఉతకడం లేదని, మురికిగానే ఉంటాయని చాలా మంది చెబుతుంటారు. చేతుల దగ్గర, కాలర్ దగ్గర మురికి అలానే ఉండిపోతుందని, ఎంత డిటర్జెంట్ వినియోగించినా ఫలితం ఉండడం లేదని చెబుతుంటారు. అయితే ఈ టిప్స్ పాటించడం వల్ల నల్లటి మరకలు కూడా మెషిన్‌లోనే ఉతికేయొచ్చు. ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో వివరించాము పూర్తిగా చదవండి.

నిండుగా బట్టలు వేయకూడదు
బట్టలు సరిగ్గా ఉతకాలంటే వాషింగ్ మెషిన్ నిండుగా బట్టలు వేయకూడదు. ఇలా వేయడం వల్ల బట్టలు శుభ్రం కావు. మురికి కూడా సరిగ్గా వదలదు. బట్టలు సరిగ్గా ఉతకాలంటే బట్టల కోసం ఎల్లప్పుడూ కొంత స్థలాన్ని వదిలేయాలి. 10 కేజీల సామర్థ్యం ఉన్న మెషిన్ ఉన్నప్పటికీ కేవలం 7 నుంచి 8 కేజీల వరకు మాత్రమే అందులో వేయాలి. అలాగే బట్టలు సగం కడిగిన తరువాత మళ్లీ లిక్విడ్ లేదా పౌడర్ వేయాలి. ఈ విధంగా బట్టలు సులభంగా శుభ్రం చేయవచ్చు.
చొక్కా కాలర్ ఎలా శుభ్రం చేయాలి?
మీరు షర్టును మెషిన్‌లో ఉంచినప్పుడు, చొక్కా తిప్పి వేయాలి. తరవాత పొడిని బకెట్‌లో వేసి నానబెట్టి అరగంట తర్వాత మెషిన్‌లో వేసి కడిగేస్తే పూర్తిగా శుభ్రంగా అయిపోతుంది. ఈ సరి చొక్కాలను ఇలా కడగడానికి ప్రయత్నించండి. కచ్చితంగా మీకు మెరుగైన ఫలితాలు వస్తాయి.
చేతులపై నల్ల మచ్చలను రుద్దండి
చొక్కా చేతులపై నల్లటి మరకలు ఉంటే, ముందుగా మారక ఉన్న ప్రదేశంలో చేతులతో రుద్దాలి. ఆ తరువాత ఆ చొక్కాను మెషిన్‌లో వేసుకోవాలి. ఇలా చొక్కాను మెషిన్‌లో వేసుకోవడం వల్ల చొక్కా చేతులపై ఉండే మరకలు కూడా వదిలిపోతాయి. చొక్కా శుభ్రంగా తళతళా మెరిసిపోతుంది.
మెషిన్ టబ్, ఫిల్టర్ శుభ్రంగా ఉంచుకోవాలి
వాషింగ్ మెషీన్ టబ్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. యంత్రం పూర్తిగా ఆరిపోయిన తర్వాత, తడి గుడ్డతో తుడుచుకోవాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి ఫిల్టర్‌ని తీసి శుభ్రం చేస్తూ ఉండాలి. దీని వల్ల బట్టలు కూడా సులభంగా శుభ్రం అవుతాయి. అలాగే వాసన రాకుండా ఉంటుంది.



Click it and Unblock the Notifications
