Latest Updates
-
ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోయే టమాటా మినపపప్పు చట్నీ.. ఒక్కసారి రుచి చూశారంటే వదిలిపెట్టరు! -
భారతదేశంలో నిప్పులు చెరుగుతున్న ఏకైక అగ్నిపర్వతం ఎక్కడుందో తెలుసా? -
క్రీమీ, చీజీ కాలీఫ్లవర్ పాస్తా.. ఒకే పాత్రలో సులభంగా చేసుకోండిలా.. -
దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే పెళ్లిళ్ల స్టైల్ మైసూర్ పాక్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
రుచిగా, పోషకాలతో నిండిన బ్రేక్ ఫాస్ట్..తింటే కొండలను ఢీకొట్టే శక్తి! -
ఈ ఒక్క ఎక్సర్ సైజ్ చేస్తే 100 ఏళ్లు బ్రతకొచ్చు..న్యూరాలజిస్ట్ చెప్పిన సంచలన నిజం! -
అట్లతద్ది స్పెషల్..ఈ టిప్స్ పాటిస్తే దూదిలా మెత్తటి వాయనం అట్లు.. -
Happy Atla Tadde 2026: బంధుమిత్రులకు, పెళ్లి కాని అమ్మాయిలకు అట్లతద్ది విషెస్, స్టేటస్ లు -
పొట్ట కొవ్వును కొవ్వొత్తిలా కరిగించే డ్రింక్స్ ఇవే! -
పక్క రాష్ట్రంలో భర్త జాబ్..మరిది ప్రైవేట్ పార్ట్ కొరికిన వదిన..55 కుట్లు పడ్డాయ్
కోయంబత్తూర్ స్పెషల్ టమాటా తన్నీ చట్నీ.. ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోయే కాంబినేషన్!
ఇడ్లీ, దోశలు ఎంత మృదువుగా ఉన్నా, వాటికి సరైన సైడ్ డిష్ లేకపోతే ఆ టిఫిన్ అసంపూర్ణమే. మన ఇళ్లలో సాధారణంగా పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ లేదా రెగ్యులర్ టమాటా చట్నీ చేస్తూ ఉంటాం. కానీ ప్రతిరోజూ ఒకే రకమైన రుచులు తిని బోర్ కొట్టిందా? మీ ఇంట్లో వాళ్లకు టమాటా చట్నీ అంటే మహా ఇష్టమా? అయితే ఈసారి కాస్త భిన్నంగా, నోటికి ఎంతో రుచిగా ఉండే కోయంబత్తూర్ స్పెషల్ టమాటో తన్నీ చట్నీ(నీళ్ల చట్నీ) ట్రై చేయండి. ఈ చట్నీని ఇడ్లీల మీద పోసుకుని తింటుంటే ఆ మజాయే వేరు.
కావాల్సిన పదార్థాలు
తాజా టమాటాలు - 6
నూనె - 3 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
మినపపప్పు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
ఎండు మిరపకాయలు - 3
కరివేపాకు - 3 రెమ్మలు
వెల్లుల్లి - 10 రెబ్బలు
ఉల్లిపాయలు - 3
పచ్చి మిరపకాయలు - 3
పసుపు - అర టీస్పూన్
కారం - 1 టీస్పూన్
ధనియాల పొడి - 2 టీస్పూన్లు
మెంతుల పొడి (వేయించినది) - పావు టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నీరు - చట్నీకి అవసరమైనంత
కొత్తిమీర - కొద్దిగా

తయారీ విధానం
-ముందుగా టమాటాలను తీసుకుని శుభ్రంగా కడగాలి. వాటి పైభాగంలో కత్తితో చిన్న గాట్లు పెట్టండి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి, స్టవ్ మీద పెట్టి మరిగించండి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ టమాటాలను అందులో వేసి మెత్తబడే వరకు ఉడికించాలి.
-టమాటాలు ఉడికిన తర్వాత వాటిని బయటకు తీసి చల్లారనివ్వాలి. ఇప్పుడు తొక్కను తీసేసి, మిక్సీ జార్ లో వేసి మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. టమాటాలు ఉడికించిన నీటిని పారబోయకండి, ఆ నీటిని చట్నీలో వాడటం వల్ల రుచి రెట్టింపు అవుతుంది.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. అందులో నూనె వేసి వేడి చేయండి. నూనె కాగాక ఆవాలు, మినపపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి.
-పోపు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా వేగనివ్వండి. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి, ఉల్లిపాయలు మెత్తబడే వరకు బాగా మగ్గనివ్వాలి.
ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోయే టమాటా మినపపప్పు చట్నీ.. ఒక్కసారి రుచి చూశారంటే వదిలిపెట్టరు!
-ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో పసుపు, కారం, ధనియాల పొడి, మెంతుల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. మసాలాల పచ్చివాసన పోవడానికి, మనం పక్కన పెట్టుకున్న టమాటా ఉడికించిన నీళ్లలో కొద్దిగా పోసి ఉడికించండి.
ఇప్పుడు మిక్సీ పట్టి ఉంచుకున్న టమాటా పేస్ట్ ను కడాయిలో వేసి బాగా కలపాలి. మిగిలిన టమాటా నీళ్లను కూడా ఇందులో పోసేయాలి. ఈ చట్నీ కొద్దిగా నీళ్లలా (తన్నీ లాగా) ఉంటేనే బాగుంటుంది. ఈ మిశ్రమాన్ని బాగా మరగనివ్వాలి.
-గుమగుమలాడుతూ చట్నీ ఉడుకుతున్నప్పుడు, సన్నగా తరిగిన కొత్తిమీరను పైనుంచి చల్లుకుని స్టవ్ ఆఫ్ చేస్తే.. కోయంబత్తూర్ స్పెషల్ టమాటా తన్నీ చట్నీ రెడీ.
-వేడి వేడి ఇడ్లీలను ఒక ప్లేట్ లో పెట్టుకుని, ఈ తన్నీ చట్నీని ఇడ్లీలు మునిగేలా పోసుకుని తింటుంటే.. ఆ రుచికి ఫిదా అవ్వాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
