Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
ఎక్కువ కాలం బతకాలా? ఈ వ్యాయామాలు చేస్తే మరణ ప్రమాదం తగ్గుతుంది..
వయసు పెరుగుతున్న కొద్దీ కండరాల సామర్థ్యం తగ్గడం సహజం. అయితే క్రమం తప్పకుండా చేసే స్ట్రెంగ్త్ ట్రైనింగ్(కండరాల బలం పెంచే వ్యాయామాలు - బరువులు ఎత్తడం లాంటివి) వల్ల గుండె జబ్బులు, నాడీ సంబంధిత వ్యాధులు దరిచేరవని, అసలు మరణ ప్రమాదమే గణనీయంగా తగ్గుతుందని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక రిపోర్ట్ ఈ ఆసక్తికరమైన వాస్తవాలను బయటపెట్టింది.

దాదాపు 30 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ అధ్యయనంలో మొత్తం 147,374 మంది వ్యక్తుల ఆరోగ్య డేటాను పరిశోధకులు లోతుగా విశ్లేషించారు. ఈ ముప్పై ఏళ్ల వ్యవధిలో వారిలో 35,798 మంది మరణించినట్లు నమోదైంది. ఈ సుదీర్ఘ అధ్యయనంలో తేలిన అద్భుతమైన విషయం ఏమిటంటే.. వారానికి కేవలం 90 నుంచి 120 నిమిషాల పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసే వారిలో ఏ కారణం చేతనైనా సరే అకాల మరణం సంభవించే ప్రమాదం 13 శాతం మేర తక్కువగా ఉంది.
ముఖ్యంగా నేటి కాలంలో ప్రధాన సమస్యగా మారిన గుండె సంబంధిత వ్యాధుల వల్ల మరణించే ముప్పు 19 శాతం తగ్గగా.. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి నాడీ సంబంధిత వ్యాధుల వల్ల మరణించే ప్రమాదం ఏకంగా 27 శాతం వరకు తగ్గినట్లు తేలింది.

ఏరోబిక్స్ కూడా తోడైతే అద్భుతమే
కేవలం బరువులు ఎత్తడం మాత్రమే సరిపోతుందా అంటే..ఏరోబిక్ వ్యాయామాలు కూడా దానికి తోడైతే ఆ ప్రయోజనాలు మరింత రెట్టింపు అవుతాయని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. నడక, పరుగు, సైక్లింగ్, ఈత వంటి ఏరోబిక్ కార్యకలాపాలను వారానికి కనీసం 150 నిమిషాల పాటు చేసిన వారిలో మెరుగైన ఫలితాలు కనిపించాయి.
అసలైన మ్యాజిక్ ఎక్కడ ఉందంటే.. వారానికి 30-44 ఎంఈటీ (MET) గంటల ఏరోబిక్ వ్యాయామంతో పాటు, 60 నుంచి 119 నిమిషాల స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కలిపి చేసిన వారిలో మొత్తం మరణ ప్రమాదం ఏకంగా 45 శాతం వరకు తగ్గింది. ఒకవేళ ఏరోబిక్ కార్యకలాపాలు 45 ఎంఈటీ గంటల కంటే ఎక్కువగా ఉంటే, ఈ మరణ ముప్పు 53 నుంచి 58 శాతం వరకు దూరమైనట్లు అధ్యయనం తేల్చింది.
ముఖ్య విషయం ఇదే
అయితే ఇక్కడ ఒక అత్యంత ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆరోగ్యానికి మంచిది కదా అని రోజంతా జిమ్ లో గంటల తరబడి బరువులు ఎత్తేయడం ఏమాత్రం సరైన పద్ధతి కాదు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ను వారానికి 120 నిమిషాల కంటే ఎక్కువగా (అంటే రోజుకు 20 నిమిషాల కంటే ఎక్కువ) చేయడం వల్ల శరీరానికి దక్కే అదనపు ప్రయోజనాలు ఏమీ లేవని శాస్త్రవేత్తలు స్పష్టంగా తేల్చి చెప్పారు.
దేనికైనా మితం అన్నది చాలా ముఖ్యం. ప్రతిరోజూ నడక, రన్నింగ్ వంటి మితమైన ఏరోబిక్ వ్యాయామాలు చేస్తూనే, దానికి వారానికి రెండు లేదా మూడు రోజులు మితమైన స్థాయిలో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ జోడించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
