ఒత్తయిన జుట్టుకి దివ్య ఔషధం కరివేపాకు నిల్వ పచ్చడి.. ఈ ఒక్కటి కలిపారంటే పది రెట్లు రుచి.!

వర్షాకాలం వచ్చిందంటే చాలు వేడివేడి అన్నంలోకి కూరల కంటే ఎక్కువగా నిల్వ పచ్చళ్లనే ఇష్టపడతారు. ఇక పచ్చళ్లలో కరివేపాకు నిల్వ పచ్చడి చాలా ఫేమస్‌. ఒత్తయిన జుట్టు కోసం, షుగర్‌ లెవెల్స్‌ కంట్రోల్‌ చేసేందుకు కరివేపాకు దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఇంటిల్లిపాదీ నచ్చేలా ఈ కరివేపాకు నిల్వ పచ్చడిని ఇలా కొత్తగా చేసి చూడండి.. ఫిదా అయిపోతారు.

Curry leaves storage pickle for growing hair healthy and solution for diabetes patients

కరివేపాకు నిల్వ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు

కరివేపాకు- ఐదు కప్పులు(100 గ్రాములు)
చింతపండు- అరకప్పు(50 గ్రాములు)
మెంతులు- టీస్పూన్‌
ఆవాలు- మూడు టీస్పూన్లు
ధనియాలు- టీస్పూన్‌
వేరుశనగ నూనె- ఒకటిన్నర కప్పు
శనగపప్పు- రెండు టీస్పూన్లు
నల్ల మినుములు- రెండు టీస్పూన్లు
జీలకర్ర- టీస్పూన్‌
ఆవాలు- టీస్పూన్‌
కచ్చాపచ్చాగ దంచిన వెల్లుల్లి- రెండు టీస్పూన్లు
ఎండుమిర్చి- అర కప్పు
కరివేపాకు- కొద్దిగా(నూనెలో వేసేందుకు)
ఇంగువ- స్పూన్‌(ఆప్షనల్‌)
కారం- కప్పు(100 గ్రాములు)
ఉప్పు- పావు కప్పు(రుచికి సరిపడా)
బెల్లం- పావు కప్పు

నోట్లో వేస్తే కరిగిపోయేలా ప్రొటీన్‌ రిచ్‌ ఇడ్లీలు.. మినప్పప్పు, రవ్వతో పనిలేదు.!

ముందుగా కరివేపాకును శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండును గింజలు లేకుండా కడిగి వేడి నీళ్లలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు మెంతులు, ఆవాలు, ధనియాలను దోరగా వేయించి మిక్సీలో పొడి చేసి పెట్టుకోవాలి.

స్టవ్‌పైన కడాయి పెట్టుకుని వేడయ్యాక ఒకటి పావు కప్పు నూనె పోసుకుని బాగా కాగనివ్వాలి. ఇందులో శనగపప్పు, నల్ల మినుములు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసి చల్లారనివ్వాలి.

Curry leaves storage pickle for growing hair healthy and solution for diabetes patients

ఇప్పుడు మరో పాన్‌లో మిగిలిన నూనె వేసి వేడయ్యాక కరివేపాకును డ్రై అయ్యే వరకు వేయించాలి. దీనిని మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి. అదే పాన్‌లో చింతపండు గుజ్జు వేసి చిక్కగా అయ్యేవరకు ఉడకనివ్వాలి. తర్వాత కరివేపాకు పొడితో కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత కారం, ఉప్పు, కొన్ని మరిగిన నీళ్లు పోసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి.

ఈ మిశ్రమాన్ని చల్లారిన నూనెలో వేసి చేతితో లేదా గరిటెతో కలియతిప్పాలి. చివరిగా పాన్‌లో బెల్లం వేసి కాసిన్ని నీళ్లు పోసి కరగనివ్వాలి. బెల్లం పానకం కొద్దిగా చిక్కబడుతున్నప్పుడు స్టవ్‌ ఆఫ్‌ చేసి ఆ పానకాన్ని ఈ పచ్చడిలో కలుపుకోవాలి. అంతే స్సైపీ కరివేపాకు నిల్వ పచ్చడి రెడీ.

కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా..

పచ్చడి చల్లారిన తర్వాత శుభ్రమైన పొడిగా ఉన్న గాజు సీసాలోకి తీసుకోవాలి. గాలి చొరబడకుండా మూత పెట్టుకోవాలి. వేడి వేడి అన్నం, టిఫిన్లలోకి రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ పచ్చడిలో బెల్లం కలుపుకొంటేనే దాని రుచి రెట్టింపు అవుతుంది.

[ of 5 - Users]
Story first published: Thursday, July 30, 2026, 16:49 [IST]
Desktop Bottom Promotion