Latest Updates
-
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.! -
ఐరన్, ప్రొటీన్ అబ్బా.. సూపర్ హెల్తీ, టేస్టీ పాలక్ పన్నీర్ చపాతీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నీకు టీబీ ఉంది,అడిగితే లేవదు,నన్ను సుఖపెట్టలేవు..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తపైనే తిరగబడ్డ భార్య! -
మూషిక వాహనంపై బొజ్జ గణపయ్య.. గణేశ్ పూజలో ఎలుక ప్రాముఖ్యత, సందేశం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి! -
ఈ టేస్ట్ నెవర్ బిఫోర్.. సండే స్పెషల్ పాలకూర చికెన్, చిక్కటి గ్రేవీకి మైమరిచిపోతారు.! -
సెప్టెంబర్ 17 న కన్యారాశిలోకి సూర్యుడు.. నెల రోజులపాటు మహర్జాతకులు అంటే వీరే.!
మీ ఇంటి డాబాపైన ఈ మొక్కలు పెడుతున్నారా.. వెంటనే తీసేయకపోతే ఈ బాధలు తప్పవు.!
నగరాలు, పట్టణాల్లో ఎక్కువగా ఇంటి డాబాపైన కూరగాయలు, పూల మొక్కలు పెంచడం చూస్తుంటాం. ఇంటి ఆవరణలో ఖాళీ స్థలం ఎక్కువగా లేకపోతే ఇలా టెర్రస్‌పైన మొక్కలు పెంచడానికి ఇష్టపడతారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం డాబాపైన కొన్ని మొక్కలు పెంచకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కొన్ని మొక్కలు.. అశుభ పరిణామాలకు సంకేతంగా చెబుతున్నారు. మరి డాబాపైన ఎలాంటి మొక్కలు పెంచాలి.. ఎలాంటివి పెంచకూడదు.. నిపుణుల సలహాలు చూద్దాం..

ముళ్ల మొక్కలు
ఇంటి డాబాపైన ముళ్ల మొక్కలను పెంచకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అయితే గులాబీ మొక్కలను పెంచవచ్చని.. కానీ మొత్తం ముళ్లు ఉండే బ్రహ్మజెముడు లాంటి మొక్కలను పెంచకూడదని చెబుతున్నారు. ఇవి ఎక్కువగా ఎడారి ప్రాంతంలోనే ఉంటాయి. వీటిని టెర్రస్ పైన పెంచితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచి కుటుంబంలో ఒత్తిడి, ఆర్థిక బాధలు, ఒత్తిడికి దారితీస్తాయని అంటున్నారు.

బోన్సాయ్ మొక్కలు
టెర్రస్‌పైన బోన్సాయ్ మొక్కలను పెంచకూడదు. వీటి వల్ల కుటుంబీకుల ఎదుగుదల, అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. ఆర్థికంగా పరిస్థితి దిగజారడంతో పాటు మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది.
పాలు కారే మొక్కలు
డాబా పైన జిల్లేడు మొక్క వంటి పాలు కారే మొక్కలను పెంచకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఈ మొక్కలు ఇంట్లో సుఖశాంతులను దూరం చేయడంతో పాటు ఆర్థిక కష్టాలను తీసుకువస్తుంది.

ఎండిన, వాడిన మొక్కలు
వాస్తు శాస్త్రం ప్రకారం ఎండిపోయిన, వాడిపోయిన మొక్కలను ఇంటి టెర్రస్‌పైన ఉంచకూడదు. అదేవిధంగా ప్లాస్టిక్ ఆకుల మొక్కలు, నకిలీ ప్లాంట్స్‌ను డాబా పైన పెట్టకూడదు. ఇవి ఇంట్లోకి దరిద్రాన్ని, అనారోగ్యాన్ని ఆహ్వానిస్తాయని నిపుణులు అంటున్నారు. మీ ఇంటి డాబా పైన ఇలాంటి మొక్కలు ఉంటే వెంటనే తీసేసి తాజా మొక్కలు ఉంచాలని సూచిస్తున్నారు.
మొక్కలు ఆరోగ్యకరంగా, శుభసూచకంగా పెరగడానికి అనువైన వాతావరణం అవసరం. మెుక్కల వేర్లు విశాలంగా నేలలో వ్యాపించినట్లయితే ఆకులు, పూలు, కూరగాయలు ఆరోగ్యంగా పెరుగుతాయి. కొత్తిమీర, పుదీనా వంటి వాటిని కుండీలలో పెంచవచ్చు. వాటిని కొంతకాలం తర్వాత తీసేసి మళ్లీ గింజలు నాటుతాం కాబట్టి వీటికి చాలా తక్కువ ప్లేస్, కుండీలు సరిపోతాయి. కానీ పూల మొక్కలు, తులసి వంటి వాటికి పెద్ద కుండీలు అవసరం. వాటి వేర్లు వ్యాపించడానికి, విశాలంగా పెరగడానికి అనువైన స్థలం అవసరమని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
