Latest Updates
-
తోబుట్టువుల మధ్య గొడవలా.. రాఖీ కట్టేటప్పుడు మీ సోదరుడితో తప్పనిసరిగా ఈ మాట చెప్పండి.! -
ఇతరుల సీక్రెట్స్ తెలుసుకోవడంలో ఈ 3 రాశుల వారే కింగ్స్..వాళ్లవి మాత్రం ముక్క కూడా చెప్పరు! -
చాణక్య నీతి: ఈ నాలుగు పనులు చేసిన తర్వాత స్నానం చేయడం తప్పనిసరి.. లేదంటే.! -
రాఖీ 2026 స్పెషల్: మీ చేతులతో సోదరుడి కోసం కుంకుమపువ్వు పిస్తా మిల్క్ కేక్ ఇలా చేయండి! -
పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచే ‘బయోటిన్ డ్రింక్’.. ఒక్క గ్లాసు తాగితే చాలు.. నిమిషాల్లో రెడీ.! -
పోషకభరితమైన, రుచికరమైన దొండకాయ మసాలా రైస్,,లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ రెసిపి ఇది! -
టీ, కాఫీతో హార్మోన్ల సమస్య.. మహిళల్లో గర్భధారణ, సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుందా.? -
నవపంచమ దృష్టి యోగం..సెప్టెంబర్ 1 నుంచి ఈ 4 రాశుల జాతకం మారిపోబోతోంది! -
100 ఏళ్లు మిమ్మల్ని ఆరోగ్యంగా బతికించే బ్రేక్ ఫాస్ట్..దీన్ని మించింది ప్రపంచంలోనే లేదు! -
భోజనం తర్వాత డెజర్ట్ లేదా డ్రింక్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే జెల్లీ కాఫీ.. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు.!
మెడ వెనుక నలుపు మురికి అనుకుంటున్నారా? పెద్ద అనారోగ్యానికి సంకేతం!
అద్దంలో చూసుకున్నప్పుడు మెడ వెనుక భాగంలో నల్లగా, మందంగా కనిపిస్తోందా? చాలామంది దీనిని సాధారణ చర్మ సమస్యగానో, ఎండకు తిరగడం వల్ల వచ్చిన మార్పుగానో లేదా కేవలం మురికిగానో భావిస్తుంటారు. సబ్బుతో గట్టిగా రుద్దితేనో, ఖరీదైన క్రీములు వాడితేనో ఈ నలుపు పోతుందని కొట్టిపారేస్తుంటారు.
కానీ మీరు ఎంత శుభ్రం చేసినా ఆ నల్లటి వలయాలు తగ్గకుండా క్రమంగా పెరుగుతున్నాయంటే, అది మురికి కాదు...మీ శరీరం లోపల జరుగుతున్న ఒక తీవ్రమైన అనారోగ్యానికి అది ఒక సైరన్ అని మీరు గ్రహించాలి. ఈ సమస్యను తేలికగా తీసుకోకూడదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

అకాంతోసిస్ నిగ్రిగాన్స్
మెడికల్ భాషలో మెడ చుట్టూ చర్మం నల్లబడే ఈ పరిస్థితిని అకాంతోసిస్ నిగ్రిగాన్స్ అని పిలుస్తారు. ఈ సమస్య ఉన్నవారిలో చర్మం మందంగా, నల్లగా, గరుకుగా లేదా ముట్టుకుంటే వెల్వెట్ వస్త్రం లాగా మారుతుంది.
ఇది కేవలం మెడ వెనుక మాత్రమే కాదు, చంకల్లో, తొడల మధ్య, శరీరంలోని ఇతర మడతలలో కూడా కనిపిస్తుంది. గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇది స్వయంగా ఒక చర్మ వ్యాధి కాదు, మన శరీరంలో దాగి ఉన్న ఒక పెద్ద సమస్యను బయటపెట్టే లక్షణం మాత్రమే.
అసలు చర్మం ఎందుకు నల్లబడుతుంది?
ఈ నల్లదనం నేరుగా ఇన్సులిన్ నిరోధకతతో ముడిపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మన రక్తంలోని చక్కెరను శక్తిగా మార్చడానికి ఇన్సులిన్ అనే హార్మోన్ అవసరం. కానీ, శరీరం ఆ ఇన్సులిన్ ను సరిగ్గా వినియోగించుకోలేకపోయినప్పుడు, దాన్ని భర్తీ చేయడానికి ప్యాంక్రియాస్ మరింత ఎక్కువగా ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ అదనపు ఇన్సులిన్ నేరుగా చర్మ కణాలపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా కణాలు వేగంగా వృద్ధి చెంది, చర్మం నల్లబడటానికి దారితీస్తుంది. ఇది ఒక్క రాత్రిలో జరిగేది కాదు, మెల్లగా మొదలై ముదిరిపోతుంది.
మధుమేహానికి ముందస్తు హెచ్చరిక
చాలా కేసుల్లో, మెడ వెనుక నలుపు అనేది టైప్ 2 డయాబెటిస్ రావడానికి ముందు కనిపించే తొలి సంకేతం. ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారు, పొట్ట చుట్టూ విపరీతంగా కొవ్వు పేరుకుపోయినవారు, లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా మధుమేహం ఉన్నవారు ఈ నలుపును ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పుతున్నాయని చెప్పే రెడ్ అలెర్ట్ ఇది.
ఎవరిలో ఈ ముప్పు ఎక్కువ?
-ఊబకాయంతో బాధపడేవారు, శారీరక శ్రమ లేకుండా రోజంతా కూర్చుని పనిచేసే జీవనశైలి ఉన్నవారిలో ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది.
-జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, స్వీట్లు, చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు తాగేవారిలో ఇది త్వరగా వస్తుంది.
-నేటి కాలంలో మహిళలను విపరీతంగా వేధిస్తున్న పీసీఓఎస్ (PCOS) లేదా పీసీఓడీ వంటి హార్మోన్ల అసమతుల్యత సమస్యలు ఉన్నవారిలో కూడా ఈ అకాంతోసిస్ నిగ్రిగాన్స్ సర్వసాధారణంగా కనిపిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications