Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
వర్షాకాలంలో జీర్ణశక్తిని అమాంతం పెంచే అద్భుతమైన పండ్లు.. అస్సలు మిస్ అవ్వకండి.!
వర్షాకాలం ఆరంభమైంది. సీజనల్ వ్యాధుల బెడదతో పాటు జీర్ణక్రియ సమస్యలూ అధికమవుతాయి. మనం తినే ఆహారం కలుషితమయ్యే అవకాశాలు ఈ కాలంలోనే ఎక్కువ. ఇది జీర్ణవ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు తాజా ఆహారంతో పాటు మీ భోజనంలో ఫైబర్ ఎక్కువగా ఉండే కొన్ని రకాల పండ్లను చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..

సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా శరీరానికి తగినంతగా పోషకాలు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. దీంతో మెరుగైన జీర్ణక్రియకు దోహదపడి మెటబాలిజం సక్రమంగా ఉంటుంది. వర్షాకాలం ఆరంభం జూన్, జూలై నెలల్లో నల్ల నేరేడు పండ్లు సమృద్ధిగా లభిస్తాయి. చాలా తక్కువ ధరలో దొరికే ఈ పండ్లు ఆరోగ్యానికి సంజీవనిలా పనిచేస్తాయి. బ్లాక్ జామూన్‌లో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. అందువల్ల వర్షాకాలంలో ఈ పండ్లను తినడం ద్వారా జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడకుండా మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది.
నేరేడు పండ్లు తినడం వల్ల గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతను నివారిస్తుంది. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న కారణంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
వర్షాకాలంలో ప్రతి ఒక్కరికీ విటమిన్ సి చాలా అవసరం. విటమిన్ సి అధిక మొత్తంలో లభించే జామకాయలు అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. నిమ్మజాతి పండయిన నారింజలో కంటే జామలోనే ఇది అధికంగా ఉంటుంది. ఇందులో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణక్రియకు మేలు చేస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి సీజనల్ వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తుంది.
ఈ కాలంలో విరివిగా లభించే పండు బేరి పండు. మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఈ పండు మేలు చేస్తుంది. పీచుపదార్థం పుష్కలంగా ఉండే బేరి పండ్లను ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం ద్వారా ప్రయోజనాలు ఉంటాయి. ఈ పండ్లను బాగా నమిలి తినాలి. ప్రతిరోజూ తినడం ద్వారా కొన్ని రోజుల్లో మంచి ఫలితాలను చూడవచ్చు. మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు.

వేసవిలో, వర్షాకాలంలో సమృద్ధిగా లభించే ప్లమ్ పండ్లు ఈ కాలంలో జూన్ నుంచి ఆగష్టు వరకు దొరుకుతాయి. ఇందులో డైటరీ ఫైబర్, సార్బిటాల్ పుష్కలంగా ఉంటుంది. వీటిని ఈ కాలంలో తరచూ తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకంతో బాధపడేవారికి ఈ పండ్లు మేలు చేయడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచి అనారోగ్యానికి గురి కాకుండా సంరక్షిస్తుంది.
మాన్‌సూన్‌లో లభించే అద్భుతమైన లీచీ పండ్లు చర్మ సంరక్షణలో దోహదపడతాయి. ఈ రసవంతమైన పండ్లు శరీరాన్ని తేమగా ఉంచుతాయి. విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 100 గ్రాముల లీచీలో 1.3 గ్రాముల ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారికి, మలబద్ధకం సమస్య ఉన్నవారికి సంజీవనిలా పనిచేస్తుంది. ఈ పండ్లు తేలికగా జీర్ణమవుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
