Latest Updates
-
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
పోషకమైనవని భావించే ఈ ఆహారాలే బరువు పెరగడానికి కారణమవుతాయంట!
ఊబకాయానికి కారణమయ్యే ప్రధాన ఆహారాల్లో సమోసా,జిలేబీ ఒకటని.. ఇకపై సిగరెట్ల ప్యాకెట్ల మీద ఎలాగైతే హెచ్చరికలు ఉంటాయో ప్రభుత్వ క్యాంటీన్లలో కూడా జిలేబీ,సమోసా గురించి అలాంటి హెచ్చరిక బోర్డులు ఉంచాలని కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందంటూ ఓ వార్త గత వారం విపరీతంగా వైరల్ అయింది. అయితే చివరకు ఇది ఫేక్ అని తేలింది. వాస్తవానికి నూనెలో బాగా వేయించిన సమోసాలు, తీయతీయని జిలేబీలు అధిక బరువుకు ఒకరమైన కారణంగా ఉంటాయి. అయితే ఇవే బరువు పెరగడానికి ముఖ్య కారణం అనలేం.
అధిక చక్కెర, కొవ్వు పదార్థాలు ఉన్న ఏ ఆహారమైనా హానికరమేనని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేస్తోంది. ఈ జాబితాలో సమోసా, జిలేబీలు ఉన్నప్పటికీ వాటికి బదులుగా ఆరోగ్యకరం అని మనం భావించి తినే కొన్ని పదార్థాలు కూడా ఉన్నాయి. చాటుమాటుగా మన బరువును పెంచే ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇక్కడ చూడండి.

నట్స్
బాదం, వాల్ నట్ వంటి నట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కానీ ఇవి అధిక కేలరీలు కలిగి ఉంటాయి. పొద్దున్నే 2-3 నానబెట్టిన బాదం పప్పులు తింటే మేలు జరుగుతుంది. కానీ ఆకలి వేసినప్పుడల్లా గుప్పెళ్ల కొద్దీ తింటూ ఉంటే శరీరంలోకి అవసరానికి మించి కేలరీలు చేరి బరువు పెరగడం ఖాయం. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే ఆరోగ్యకరమనిపించే ఈ ఆహారాల విషయంలోనూ జాగ్రత్త అవసరం.
పండ్ల రసాలు
తాజా పండ్లు ఆరోగ్యకరమే అయినా వాటిని రసంగా మార్చినప్పుడు అందులోని అమూల్యమైన ఫైబర్ (పీచుపదార్థం) తొలగిపోతుంది. దీంతో పండ్లలోని ఫ్రక్టోజ్ అనే సహజ చక్కెర నేరుగా రక్తంలో కలిసి, చక్కెర స్థాయిలను అమాంతం పెంచుతుంది. ఇక బయట ప్యాకెట్లలో దొరికే రసాలలో అదనపు చక్కెరలు కలుపుతారు. ఫలితంగా కేలరీలు విపరీతంగా పెరిగిపోతాయి.
స్మూతీలు
ఇంట్లో పండ్లు, పెరుగుతో చేసుకునే స్మూతీ ఆరోగ్యకరమే. కానీ బయట దుకాణాల్లో కొనే స్మూతీలలో రుచి కోసం అధికంగా చక్కెర, ఐస్ క్రీమ్ లేదా క్రీమ్ కలుపుతారు. దీంతో అది ఓ అధిక కేలరీల పానీయంగా మారిపోతుంది. ఒక మీడియం పరిమాణంలో ఉండే గ్లాస్ స్మూతీలో 300-500 కేలరీలు ఉండవచ్చు.
సలాడ్ డ్రెస్సింగ్స్
సలాడ్లు ఎంతో పోషకమైనవి. అయితే సలాడ్ మీద మనం వేసుకునే డ్రెస్సింగ్ అసలుకే మోసం తేవచ్చు. క్రీమ్, మయోన్నైజ్ లేదా తీపి సాస్ లతో కూడిన డ్రెస్సింగులు వాడటం వల్ల సలాడ్ ప్రయోజనం పోయి ట్రాన్స్ ఫ్యాట్స్, కేలరీలు శరీరంలోకి చేరతాయి.
మల్టీగ్రెయిన్ ఉత్పత్తులు
మైదా తినకూడదని చాలామంది మల్టీగ్రెయిన్ బిస్కెట్లు, బ్రెడ్ లేదా పాస్తా వైపు మొగ్గు చూపుతారు. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందన్నది నిజమే కానీ చాలా మల్టీగ్రెయిన్ ఉత్పత్తులలో సంతృప్త కొవ్వులు కూడా అధికంగా ఉంటాయి. వీటిని చీజ్ లేదా వెన్నతో కలిపి తిన్నప్పుడు కేలరీలు మరింత పెరుగుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
