Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్!
ఇంట్లో రోజూ చేసుకునే గోధుమ రోటీలు, చపాతీలు తిని బోర్ కొట్టిందా? పప్పు, కూర ఏదైనా సరే.. ఎప్పుడూ ఒకేలా ఉండే రోటీలు తింటే కాస్త విసుగు రావడం సహజమే. అయితే మీ డైనింగ్ టేబుల్‌పైకి ఏదైనా కొత్త రుచిని తీసుకురావాలనుకుంటే, ఈసారి మట్కా రోటీ (కుండ రొట్టె) ట్రై చేయండి. పేరు కాస్త వెరైటీగా అనిపించినా.. పాపడ్ లా పల్చగా, కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే ఈ రోటీ రుచి అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ దేశీ స్టైల్ రోటీని ఇంట్లోని మట్టి కుండతో హోటల్ రుచిని తలపించేలా చాలా ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

మట్కా రోటీ తయారీకి కావలసిన పదార్థాలు
గోధుమ పిండి - 1 కిలో
ఉప్పు - 1 టీస్పూన్
నీరు - తగినంత
నూనె - కుండకు రాయడానికి కొద్దిగా
మట్టి కుండ - 1
ఎలాంటి మెషీన్ లేకుండానే ఇంట్లోనే స్వచ్ఛమైన వేరుశెనగ నూనె..ఎలా చేయాలో చూడండి..
మట్కా రోటీ తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు వేసి, సాధారణ రోటీల కంటే కాస్త మెత్తగా, తేమగా ఉండేలా నీళ్లు పోసి కలుపుకోవాలి. ఈ పిండిపై మూతపెట్టి సెట్ అవ్వడానికి అరగంట పాటు పక్కన పెట్టాలి.
-30 నిమిషాల తర్వాత, పిండి నుంచి ఒక చిన్న ముద్దను తీసుకుని 5-10 నిమిషాల పాటు బాగా పిసకాలి. దానిపైన కొద్దికొద్దిగా నీళ్లు చల్లుతూ మరో 15 నిమిషాల పాటు మర్దన చేయాలి. ఈ ప్రక్రియను 3-4 సార్లు రిపీట్ చేయాలి. పిండి సాగే గుణం వచ్చే వరకు, చేతికి అంటుకోకుండా మృదువుగా మారే వరకు ఇలా చేయాలి. పిండిని లాగితే తెగకుండా సాగుతోందంటే.. మీ రోటీ పర్ఫెక్ట్ గా వస్తుందని అర్థం.
-కట్టెల పొయ్యి లేకపోయినా కంగారు వద్దు. మీ ఇంట్లోని గ్యాస్ స్టవ్ మీద కూడా కుండను బోర్లించి ఈ రోటీలు చేసుకోవచ్చు. ఇప్పుడు మట్టి కుండను బోర్లించి స్టవ్ మీద వేడి చేయాలి. రోటీ వేసే ముందు కుండ అడుగు భాగానికి (పైకి ఉండే వైపు) కొద్దిగా నూనె రాయాలి. దీంతో రోటీ కుండకు అతుక్కోకుండా సులభంగా వస్తుంది.
-ఇప్పుడు చేతిలోకి కొద్దిగా పిండిని తీసుకుని, చేతులతోనే గుండ్రంగా, పల్చగా సాగదీయాలి. దీన్ని నెమ్మదిగా వేడి కుండ మీద వేయాలి. ఎక్కడైనా పల్చబడినా, చిరిగినట్లు అనిపించినా కొద్దిగా పిండిని అక్కడ అద్దండి.
-కేవలం ఒక్క నిమిషంలోనే రోటీ ఉడికిపోవడం మీరు గమనిస్తారు.
-కాలిన తర్వాత పల్చటి గరిటె లేదా చాకు సహాయంతో జాగ్రత్తగా తీసేయండి. కుండ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి చేతులతో నేరుగా తాకవద్దు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
