Latest Updates
-
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి!
స్వీట్ తినాలనిపిస్తే బరువు పెరిగిపోతామేమో అన్న భయం చాలామందిని వెంటాడుతుంది. కానీ తీపికి తీపి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. పైగా బరువు తగ్గడంలో సహాయపడే ఒక అద్భుతమైన స్వీట్ ఉందంటే.. అది మన సంప్రదాయ రాగి లడ్డూ. కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉండే రాగి లడ్డూలు ఎముకలను ఉక్కులా మారుస్తాయి. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి ఇవి ఒక అద్భుతమైన ఔషధం అని చెప్పవచ్చు. గ్లూటెన్ లేకపోవడం వల్ల జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి.
అంతేకాదు ఒక్క లడ్డూ తింటే చాలు, చాలాసేపటి వరకు కడుపు నిండిన భావన కలిగి ఉండి చిరుతిళ్లపైకి మనసు మళ్లదు. అలాగే మధుమేహం ఉన్నవారు కూడా తీపి తినాలనే కోరికను ఈ ఆరోగ్యకరమైన లడ్డూతో తీర్చుకోవచ్చు. ఇంతటి పోషక విలువలున్న రాగి లడ్డూలను ఇంట్లోనే సులభంగా, ఎంతో రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

రాగి లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు
రాగి పిండి - 250 గ్రాములు
స్వచ్ఛమైన నెయ్యి - 50 గ్రాములు
నువ్వులు - 80 గ్రాములు
వేరుశెనగ గుళ్లు - 80 గ్రాములు
బెల్లం - 300 గ్రాములు
జాజికాయ పొడి - 1 టీస్పూన్
సొంటి పొడి (ఎండు అల్లం) - 2 టీస్పూన్లు
యాలకుల పొడి - 1 టీస్పూన్
రాగి లడ్డు తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి, మందపాటి కడాయి పెట్టుకోండి. అందులో నెయ్యి వేసి కరిగిన తర్వాత, రాగి పిండిని వేయండి. సన్నని మంటపై పిండి పచ్చివాసన పోయి, కమ్మని సువాసన వచ్చేంతవరకు దోరగా వేయించుకుని ఒక పళ్లెంలోకి తీసుకోండి.
-అదే కడాయిలో వేరుశెనగలను, నువ్వులను విడివిడిగా దోరగా వేయించుకోండి. అవి చల్లారాక మిక్సీ జార్ లో వేసి బరకగా పొడి చేసి పెట్టుకోండి.
-ఇప్పుడు కడాయిలో బెల్లం వేసి, అందులో అరకప్పు నీళ్లు పోయండి. బెల్లం పూర్తిగా కరిగి, కొద్దిగా లేత పాకంలా (కొద్దిగా జిగురుగా) వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆపేయండి.
-వేయించి పెట్టుకున్న రాగి పిండిలో ముందుగా మిక్సీ పట్టుకున్న వేరుశెనగ, నువ్వుల పొడిని కలపండి. ఈ మిశ్రమానికి మరింత రుచిని, యాలకుల పొడి, సొంటి పొడి, జాజికాయ పొడి వేసి చేత్తో బాగా కలుపుకోండి. ఈ పిండి మిశ్రమంలో సిద్ధం చేసుకున్న వేడి వేడి బెల్లం పాకాన్ని కొద్దికొద్దిగా పోస్తూ గరిటెతో కలపండి.
-పాకం పిండికి బాగా పట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడే మీ చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని గుండ్రని లడ్డూల్లా చుట్టుకోండి.
-అంతే నోట్లో వేసుకుంటే కరిగిపోయే కమ్మని రాగి లడ్డూలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
