Latest Updates
-
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.! -
కుజ, గురు గ్రహాల అరుదైన కలయిక.. 3 రాశుల వారికి ఈ అడ్డంకుల నుంచి ఉపశమనం -
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.!
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.!
హిందూ మత సంప్రదాయ ప్రకారం ప్రతిరోజూ దీపారాధన తప్పనిసరి. పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత కానీ ఏ పనీ మొదలుపెట్టరు. భగవంతుడి ముందు వెలుగుతున్న దీపాన్ని జ్ఞానానికి, సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. అయితే కొన్నిసార్లు దీపం సడెన్‌గా ఆరిపోతుంది. ఇలా జరిగితే అశుభానికి సంకేతంగా భయపడుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి.. పండితుల సలహాలు, సూచనలు చేద్దాం..

దీపారాధన చేసిన ప్రమిదల్లో నూనె అయిపోయేంత వరకు దీపం వెలుగుతూ ఉంటే ఇంట్లో ఎవరికైనా మనశ్శాంతిగా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో దీపం సడెన్‌గా ఆరిపోతుంది. దీంతో ఏదో అశుభం జరగబోతుంది అంటూ భయానికి గురవుతుంటారు. అయితే ప్రతిసారీ దీనిని చెడుకి సంకేతంగా భావించలేమని పండితులు అంటున్నారు.
బలమైన గాలులు వీచడం, దీపం సరిగ్గా వెలగకపోయినా, వత్తిలో లోపాలు ఉన్నా అకస్మాత్తుగా దీపం ఆరిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ కారణాలు అయితే దానిని అశుభ సూచనగా పరిగణించకూడదని సూచిస్తున్నారు. ఇది సాధారణ పరిస్థితిగా పరిగణించాలి.
పదే పదే జరుగుతుంటే..
ఈ కారణాలేవీ కాకుండా దీపారాధన చేశాక దీపం పదే పదే ఆరిపోతున్నప్పుడు దానిని సాధారణంగా భావించకూడదు. పలు కారణాలు ఉండవచ్చు. తరచూ ఇలా జరుగుతూ ఉంటే భవిష్యత్తులో రాబోయే కష్టానికి సూచన కావచ్చని శకున శాస్త్రం చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భయపడకుండా పండితులు, పూజారుల సలహాలు తీసుకోవడం పరిష్కారాన్ని సూచిస్తుంది.

దుష్ప్రభావాలను ఎలా తగ్గించుకోవాలి..
పూజ సమయంలో దీపం పదే పదే ఆరిపోతుంటే.. ఎలాంటి అశుభం జరగకుండా ఉండాలంటే మీ కులదైవాన్ని ప్రత్యేకంగా పూజిస్తూ ఆరాధించండి. మీకు ఆధ్యాత్మిక గురువులు ఉన్నట్లయితే వారితో చర్చించి పరిష్కారం తెలుసుకోండి. రాబోయే కీడు నుంచి తప్పించుకునేందుకు, నివారించుకునేందుకు ఓం నమఃశివాయ మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో జపించడం ఉపశమనంతో పాటు మేలు చేస్తుంది.
మీ జన్మ నక్షత్రం, రాశి అధిపతికి సంబంధించి జ్యోతిష్య పండితుల సలహాల ద్వారా తగిన చర్యలు తీసుకోండి. దైవ మంత్రాలను జపిస్తూ, మీ రాశి ప్రకారం వస్తువులను దానం చేయడం పరిష్కారం కావచ్చు. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠిస్తూ ఉండటం ద్వారా మీలో ధైర్యం, శక్తి చేరి మున్ముందు కష్టాలను నివారించుకోవచ్చు.



Click it and Unblock the Notifications
