Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి!
తెలుగిళ్లలో వేడి వేడి అన్నంలోకి ఘాటుగా పచ్చడి లేకుండా ఎవరికైనా ముద్ద దిగదు. టమాటా పచ్చడి, గోంగూర పచ్చడి, దొండకాయ పచ్చడి ఇలా రకరకాలుగా కారంగా పచ్చళ్లు చేసుకుంటాం. ఇక, వంకాయ పచ్చడి అయితే ఆ రుచికి ఉన్న క్రేజ్ వేరు. ఈ వంకాయ పచ్చడిని తోటకూర, టమాటాలతో కలిపి చేయండి.. ఇక, నెలలో రెండు, మూడు సార్లయినా ఈ స్పెషల్ రెసిపీని తప్పకుండా మీ కిచెన్‌లో ఉండాల్సిందే..

వంకాయ తోటకూర పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
తోటకూర- పెద్ద కట్ట(ఒకటి)
వంకాయలు- నాలుగు
టమాటా- మూడు
నూనె- ఐదు టేబుల్ స్పూన్లు
మెంతులు- పావు టీస్పూన్
ఆవాలు- టీస్పూన్
ధనియాలు- రెండు టీస్పూన్లు
జీలకర్ర- రెండు టీస్పూన్లు
నువ్వులు- రెండు టీస్పూన్లు
పచ్చిమిర్చి- పదిహేను(కారానికి సరిపడా)
పసుపు- పావు టీస్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
చింతపండు- కొద్దిగా
ఎండుమిర్చి- మూడు
వెల్లుల్లి రెబ్బలు- ఏడు
వంకాయ తోటకూర పచ్చడి తయారీ తయారీ విధానం
ముందుగా తోటకూరను కాడలు తీసేసి ఆకులను సన్నగా కట్ చేసి శుభ్రంగా కడిగి నీళ్లు మొత్తం పోయేలా ఆరబెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్‌పైన కడాయి పెట్టుకుని అందులో టీస్పూన్ నూనె వేసి వేడయ్యాక, మెంతులు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు వేసి దోరగా వేయించుకోవాలి. వీటిని చిన్న గిన్నెలోకి తీసుకుని చల్లారనివ్వాలి.
వంకాయలను ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీళ్లలో కడగాలి. టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు అదే కడాయిలో రెండు టీస్పూన్ల నూనె వేసి కాగనివ్వాలి. అందులో పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేగనివ్వాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత తోటకూర వేసి కాసేపు మగ్గనివ్వాలి. తోటకూరలో నీరు అంతా పోయి మగ్గిన తర్వాత పక్కన పెట్టుకోవాలి.
అదే కడాయిలో వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి నూనెలో మగ్గనివ్వాలి. అందులో పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఉడకనివ్వాలి. కొద్దిగా చింతపండు వేసి మరికాసేపు ఉడకనివ్వాలి.
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్!
మిక్సీ జార్ తీసుకుని అందులో మొదట వేయించిన నువ్వుల మిశ్రమాన్ని వేసి పొడిగా చేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి, తోటకూర, వంకాయ, పచ్చడి మిశ్రమాన్ని వేసుకోవాలి. ఉప్పు రుచి చూసుకుని అవసరమైతే మరికొంత కలిపి రుబ్బుకోవాలి.
చివరిగా బాణలిలో మిగిలిన నూనె వేసుకుని వేడయ్యాక పోపు గింజలు వేసుకుని పచ్చడికి తాలింపు పెట్టుకోవాలి. అంతే రుచికరమైన, ఘాటైన తోటకూర వంకాయ టమాటా పచ్చడి రెడీ. వేడి వేడిగా అన్నంలోకి లేదా రోటీలోకి ఈ పచ్చడి అమోఘంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
