Latest Updates
-
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. !
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
లైక్, కామెంట్, షేర్.. సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించే పేర్లు ఇవి. తాము చేసిన రీల్, పోస్ట్ లేదా వీడియోకి ఎంతమంది లైక్ చేశారు. ఏం కామెంట్స్ చేశారు, ఎన్ని షేర్స్ ఉన్నాయి.. ఇలా వీటిపైనే తమ సోషల్ మీడియా క్రేజ్‌ను అంచనా వేసుకుంటారు. అయితే ఇలా బానిస కావడం మీ మానసిక ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపిస్తుందో ఆలోచిస్తున్నారా.?

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా లేకుండా గడపడం ఎంత కష్టమో తెలియనిది కాదు. వయసుతో సంబంధం లేకుండా స్కూల్ పిల్లల స్టేజ్ నుంచి పెద్దల వరకు విపరీతంగా సోషల్ మీడియాకి బానిస అవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్‌బుక్, స్నాప్‌చాట్, యూట్యూబ్ ఛానెల్స్ వంటి ప్లాట్‌ఫామ్‌ల్లో ఫొటోలు, రీల్స్, వీడియోలు పోస్ట్ చేస్తూ వాటికి వచ్చే లైక్‌లు, కామెంట్స్, షేర్స్‌ని తరచూ చెక్ చేసుకుంటూ ఉంటారు. ఎంత ఫాలోయింగ్ ఉంటే తమకు డిజిటల్ సొసైటీలో అంత క్రేజీ ఉన్నట్లుగా ఫీలవుతుంటారు. ఈ ఫాలోయింగ్ తగ్గితే మాత్రం తీవ్రంగా నిరాశ, ఒత్తిడి, ఆత్మన్యూనతకి గురవుతుంటారు. దీని వల్ల ఎక్కువ సమయంలో సోషల్ మీడియాలో గడుపుతున్నారు.
రోజులో ఎక్కువ సమయంలో సోషల్ మీడియాలో గడపడం, ఇతరులు చేసిన పోస్ట్‌లు, రీల్స్‌తో పోల్చుకోవడం, ఒంటరిగా ఉండటం వంటివి తీవ్రంగా మానసిక అనారోగ్యానికి దారితీస్తాయని నిపుణులు అంటున్నారు. సోషల్ మీడియాకి అడిక్ట్ అవడం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి.. నిపుణుల సలహా చూద్దాం..

హార్మోన్‌పై ప్రభావం
మీరు చేసిన పోస్ట్‌కి లైక్‌లు, కామెంట్స్, షేర్‌లు ఎక్కువైతే అది మీ మెదడులో డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్‌ని విడుదల చేస్తుంది. ఈ క్రేజ్ తరచూ రిపీట్ అవుతుంటే మీలో సంతోషం, సంతృప్తి పెరుగుతుంది. ఈ క్రమంలో మీరు హ్యాపీగా ఉండటం కోసం ఎక్కువగా సోషల్ మీడియాపైనే ఆధారపడతారు. అయితే ఈ క్రేజ్ తగ్గినప్పుడు మీరు తీవ్ర నిరాశలో ఉండిపోతారు. మీలో ఆత్మన్యూనతా భావం ఏర్పడుతుంది.
లైక్‌లతో ఒత్తిడి
సోషల్ మీడియాలో మీ పోస్ట్ లేదా రీల్‌కి లైక్ లేదా కామెంట్స్ తగ్గినప్పుడు మీలో నిరాశ, ఆందోళన, మీపై అనుమానం పెరుగుతుంది. అసలు ఎందుకు ఎవరూ లైక్ చేయడం లేదని పదే పదే పోస్ట్‌ను చూసుకుంటుంటారు. ఆందోళన ఎక్కువై పోస్ట్ తొలగిస్తారు. ఇది తరచూ కొనసాగితే మీ ఆత్మవిశ్వాసంపై ప్రభావం పడుతుంది. మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది.

పోలిక
చాలా మంది తమ జీవితంలో స్పెషల్ మూమెంట్స్, ప్రత్యేక రోజులు, క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు. వీటిని మీరు చూసినప్పుడు మీ లైఫ్‌ను వారితో పోల్చుకుని వారు చాలా సంతోషంగా గడుపుతున్నారనే భావనలో ఉండి ఆత్మన్యూనతకి గురవుతారు. వారిపై అసూయ పెంచుకుంటారు. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
అదే పనిగా ఫోన్ చూడటం
మీరు చేసిన పోస్ట్‌ని ఎంతమంది చూశారు, లైక్‌లు, కామెంట్స్ వివరాల కోసం, నోటిఫికేషన్‌ల కోసం తరచూ మీ ఫోన్‌ను చెక్ చేసుకుంటూ ఉంటారు. దీంతో ఎక్కువ సేపు ఫోన్‌లోనే గడిపేస్తారు. ఇది మీ స్టడీస్, వర్క్‌పై ప్రభావం చూపించడంతో పాటు మీరు మీ ఫ్యామిలీతో గడిపే సమయంపైనా ప్రభావం చూపిస్తుంది. నిద్రపై ప్రభావం పడుతుంది. ఏకాగ్రత తగ్గి రోజువారీ పనులపై ప్రభావం పడుతుంది.
ట్రోలింగ్స్
మీ పోస్ట్‌పై ట్రోలింగ్, అసభ్యకరమైన కామెంట్స్, బాడీ షేమింగ్, వేధింపులు వంటి ఎదుర్కొన్నట్లయితే అవి మెంటల్ హెల్త్‌పై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. దీంతో మీలో భయం, ఒత్తిడి, ఆందోళన పెరిగి విచారంలో ఉండిపోతారు. ఒంటరితనానికి గురవుతారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
మీరూ సోషల్ మీడియాకి ఇదే విధంగా బానిసలవుతూ మానసికంగా ఆందోళనకి గురవతున్నట్లయితే దీని నుంచి వీలైనంత త్వరగా బయటపడటం మేలు. సోషల్ మీడియా వాడకాన్ని వీలైనంతగా తగ్గించాలి. నిర్దేశించుకున్న సమయంలో మాత్రమే వాడేలా చూసుకోండి. మీ ఐడెంటిటీని లైక్‌లు, ఫాలోయింగ్స్ ద్వారా డిసైడ్ చేసుకోండి. కుటుంబీకులతో సమయం గడపడం, నచ్చిన పనులు చేయడం, స్నేహితులతో ప్రత్యక్షంగా గడపడం వంటి వాటితో నెగిటివ్ ప్రభావాన్ని తొలగించుకోండి. ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్నట్లయితే వాటి నుంచి దూరంగా ఉండండి. అవసరమైతే మానసిక నిపుణుల సలహాలు తీసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
