Latest Updates
-
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.!
హస్తప్రయోగం చేసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందా? నిజమెంత?
హస్తప్రయోగం అంటే అదో పాపంగా చూస్తారు. చాలా మంది చేసుకునేదే అయినా దాని గురించి బహిరంగంగా మాట్లాడుకోరు. దాదాపు ప్రతి పురుషుడి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ రకమైన అనుభవాన్ని, అనుభూతిని పొందుతారు. బయట పెద్దగా దీని గురించి మాట్లాడుకోకపోవడం వల్ల హస్త ప్రయోగం గురించి చాలా మంది అపోహలనే నిజమనుకుని నమ్మేస్తుంటారు. అలాంటి వాటిలో ఒకటి.. హస్తప్రయోగం చేయడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని, రోగాలపై పోరాడే రోగనిరోధక శక్తి సొంతం అవుతుందని చాలా మంది అనుకుంటారు. మరి ఇది నిజమేనా.. లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

హస్త ప్రయోగం, రోగనిరోధక శక్తి ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయని ఈ మధ్యే జరిగిన పరిశోధనకు సంబంధించిన వివరాలు ఓ జర్నల్ లో ప్రచురితం అయ్యాయి. హస్త ప్రయోగం చేసిన 5 నిమిషాల్లోనే ఇమ్యూనిటీ పవర్ ను పెంచే కణాల స్థాయిల పెరుగుదలను పరిశోధకులు గుర్తించి ఆశ్చర్యపోయారు. అయినప్పటికీ.. హస్త ప్రయోగానికి, రోగనిరోధక శక్తికి ఎలా ముడిపడి ఉన్నాయో నిరూపించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరం.
హస్త ప్రయోగం వల్ల మానసిక స్థితిని మెరుగుపరిచే ఆక్సిటోసిన్, డోపమైన్ వంటి రసాయనాలు విడుదల అవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. ఎండార్ఫిన్లు విడుదల కావడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది. బాగా నిద్రపడుతుంది. మరో రకంగా చెప్పాలంటే ఇవన్నీ రోగనిరోధక శక్తిని పెంచడానికి పరోక్షంగా కారణం అవుతాయని వైద్యులు చెబుతున్నారు.
సెరోటోనిన్, డోపమైన మానసిక స్థిని మెరుగుపరిచే హార్మోన్లు. ఈ హర్మోన్లు ఉద్వేగ సమయంలో విడుదల అవుతాయి. అలాగే ఉద్వేగ సమయంలో శరీరంలో రక్త ప్రసరణ వేగవంతం అవుతుంది. అలాగే ఉద్వేకంలో నొప్పి భరించే సామర్థ్యం కూడా పెరుగుతుంది. వీటన్నింటి వల్ల హస్తప్రయోగానికి రోగనిరోధక శక్తికి మధ్య సంబంధం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
