Latest Updates
-
దీపావళి స్పెషల్ స్నాక్.. ఇంట్లోనే ఈజీగా క్రిస్పీ కారప్పూస మిక్చర్ చేసుకోండిలా.. -
ఇడ్లీ, దోశలోకి హోటల్ స్టైల్ చిన్న ఉల్లిపాయ చట్నీ..యమా రుచి బాసూ.. -
చికెన్ మజ్జిగ పులుసు..నెలల పాటు నాలుక మీద ఉండేపోయే రుచి..ఈజీగా చేసేయొచ్చు.. -
అరటిపండ్లు రెండు రోజులకే నల్లబడుతున్నాయా? ఇలా చేస్తే 4 వారాలైనా ఫ్రెష్ గా ఉంటాయి! -
ఇనుములాంటి బలాన్నిచ్చే మినుముల అన్నం..నడుము నొప్పితో బాధపడేవారికి బెస్ట్ ఫుడ్ -
రెండో పెళ్లి, జిమ్ ట్రైనర్ తో ఎఫైర్.. భర్తను చంపేందుకు భార్య పక్కా స్కెచ్..ఊహించని ట్విస్ట్ -
పాకం పట్టే పనిలేకుండా పాతకాలం నాటి పర్ఫెక్ట్ రాగి లడ్డు..ఎముకలు దృఢంగా మారతాయి! -
చియా, గుమ్మడి, సబ్జా.. ఏ గింజలు ఎలా తింటే శరీరానికి 100 శాతం పోషకాలు అందుతాయంటే? -
స్వీట్ షాప్ స్టైల్ పర్ఫెక్ట్ బీట్ రూట్ జిలేబీ.. ఈ సింపుల్ టిప్స్ తో ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పిల్లలు లంచ్ బాక్స్ ఖాళీ చేసి రావాలంటే.. ఈ స్పెషల్ దొండకాయ మసాలా రైస్ చేసి పెట్టండి!
క్యాన్సర్ రాకుండా కాపాడే 5 ఆహారాలు ఇవే..
మారిన జీవనశైలి, ఆహార అలవాట్ల కారణంగా ఈ రోజుల్లో చాలామంది వయస్సుతో సంబంధం లేకుండా క్యాన్సర్ బారిన పడుతున్నారు. చిన్న పిల్లలు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే క్యాన్సర్ అనే పేరు వినగానే చాలామందిలో తెలియని ఓ టెన్షన్ మొదలవుతుంది. అయితే ఈ మహమ్మారిని చూసి భయపడాల్సిన పనిలేదు. సరైన జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో క్యాన్సర్ ను దరిచేరనివ్వకుండా సులభంగా అడ్డుకోవచ్చు.
నివారణే చికిత్స కన్నా మిన్న అన్నట్లుగా.. ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఆహార పదార్థాలు క్యాన్సర్ పై పోరాడే సైనికుల్లా మనకు రక్షణ కవచాన్ని అందిస్తాయి. క్యాన్సర్ రాకుండా కాపాడే 5 ఆహారాల గురించి నెల్లూరుకి చెందిన ప్రముఖ డాక్టర్ శ్రీధర్ ముండ్లపూడి యూట్యూబ్ లో పోస్ట్ చేసిన ఒక వీడియో ద్వారా సూచించారు.

క్యాన్సర్ రాకుండా కాపాడే 5 ఆహారాలు
సిరిధాన్యాలు, తృణధాన్యాలు
మిల్లెట్స్ (సిరిధాన్యాలు), ఓట్స్, పొట్టుతీయని గోధుమలు ఆరోగ్యానికి పవర్ హౌస్ లాంటివి. వీటిలో ఉండే పుష్కలమైన ఫైబర్ జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. ముఖ్యంగా కోలోరెక్టల్(పెద్దప్రేగు) క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడకుండా ఇవి మనల్ని అద్భుతంగా రక్షిస్తాయి.
ఎర్రటి టమాటోలు
కూరల్లో రుచిని పెంచే టమాటోలు క్యాన్సర్ ను నివారించడంలోనూ ముందుంటాయి. టమాటోలో లైకోపిన్(Lycopene) అనే అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో పరిశోధనల్లో ఈ లైకోపిన్ క్యాన్సర్ కణాల వృద్ధిని సమర్థవంతంగా అడ్డుకుంటుందని తేలింది.
క్రూసిఫెరస్ కూరగాయలు (క్యాబేజీ, క్యాలీఫ్లవర్)
క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రోకోలీ వంటి కూరగాయలను మీ ఆహారంలో తప్పక చేర్చుకోండి. వీటిలో గ్లూకోసినోలేట్స్(Glucosinolates) అనే అద్భుతమైన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలోని క్యాన్సర్ కారకాలను బయటకు పంపి, మన ఆరోగ్యానికి ఒక బలమైన కవచంలా సహాయపడతాయి.

పప్పుధాన్యాలు (రాజ్మా, శనగలు)
రాజ్మా, శనగలు (చనా), ఇతర పప్పు దినుసులు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే అత్యుత్తమ ప్రోటీన్లు, ఫైబర్ శరీరానికి అవసరమైన బలాన్ని ఇవ్వడంతో పాటు కణాలను ఆరోగ్యంగా ఉంచి, క్యాన్సర్ ముప్పును చాలా వరకు తగ్గిస్తాయి.
రంగురంగుల పండ్లు, కూరగాయలు
ప్రకృతి మనకు ఎన్నో రంగుల్లో పండ్లను, కూరగాయలను అందించింది. ప్రతిరోజూ విభిన్న రంగుల్లో ఉండే పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో రకాల మైక్రో న్యూట్రియంట్స్ (సూక్ష్మ పోషకాలు) శరీరానికి అందుతాయి. ఇవి మనకు తెలియకుండానే అద్భుతమైన రోగనిరోధక శక్తిని ఇచ్చి క్యాన్సర్ నుంచి కాపాడుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
