Latest Updates
-
దీపావళి స్పెషల్ స్వీట్..తమిళనాడు సంప్రదాయ ఉక్కరై మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
క్యాన్సర్ రాకుండా కాపాడే 5 ఆహారాలు ఇవే.. -
దీపావళి స్పెషల్ స్నాక్.. ఇంట్లోనే ఈజీగా క్రిస్పీ కారప్పూస మిక్చర్ చేసుకోండిలా.. -
ఇడ్లీ, దోశలోకి హోటల్ స్టైల్ చిన్న ఉల్లిపాయ చట్నీ..యమా రుచి బాసూ.. -
చికెన్ మజ్జిగ పులుసు..నెలల పాటు నాలుక మీద ఉండేపోయే రుచి..ఈజీగా చేసేయొచ్చు.. -
అరటిపండ్లు రెండు రోజులకే నల్లబడుతున్నాయా? ఇలా చేస్తే 4 వారాలైనా ఫ్రెష్ గా ఉంటాయి! -
ఇనుములాంటి బలాన్నిచ్చే మినుముల అన్నం..నడుము నొప్పితో బాధపడేవారికి బెస్ట్ ఫుడ్ -
రెండో పెళ్లి, జిమ్ ట్రైనర్ తో ఎఫైర్.. భర్తను చంపేందుకు భార్య పక్కా స్కెచ్..ఊహించని ట్విస్ట్ -
పాకం పట్టే పనిలేకుండా పాతకాలం నాటి పర్ఫెక్ట్ రాగి లడ్డు..ఎముకలు దృఢంగా మారతాయి! -
చియా, గుమ్మడి, సబ్జా.. ఏ గింజలు ఎలా తింటే శరీరానికి 100 శాతం పోషకాలు అందుతాయంటే?
ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్లు ఆకుపచ్చ, బ్లూ కలర్ గౌన్స్ మాత్రమే ఎందుకు ధరిస్తారో తెలుసా?
సాధారంగా హాస్పిటల్ అనగానే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది డాక్టర్లు వేసుకునే వైట్ కోట్. అయితే వైద్య వృత్తికి తెల్లకోటు ఒక సింబల్. అయితే అదే డాక్టర్లు ఎవరికైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా ఆకుపచ్చ గౌన్ లేదా నీలం రంగు గౌన్ ధరించడం మనం చూస్తుంటాం.
అయితే ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లేటప్పుడు మాత్రం వీటిని ఎందుకు వేసుకుంటారు, తెలుపు, పసుపు, నలుపు వంటి రంగుల బట్టలు ఎందుకు వేసుకోరు అని మీకెప్పుడైనా డౌట్ వచ్చిందా? డాక్టర్ల ఈ డ్రెస్ కోడ్ వెనుక ఒక ఇంట్రెస్టింగ్ శాస్రీయ కారణమే ఉంది. అదేంటో ఇక్కడ చూడండి.

కంటి ఒత్తిడికి చెక్ పెట్టే అద్భుతమైన రంగులు
ఆపరేషన్ థియేటర్ లో ఉంటే లైట్లు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి ఒక సర్జరీ లేదా ఆపరేషన్ పూర్తవడానికి కొన్నిసార్లు గంటల సమయం పడుతుంది. అంతటి తీవ్రమైన వెలుతురులో నిరంతరం పనిచేయడం వల్ల డాక్టర్ల కంటికి ఎంతో శ్రమ కలుగుతుంది. ఆ టైంలో డాక్టర్లు తమ దృష్టిని కాస్త పక్కకు మళ్లించినప్పుడు, తోటి డాక్టర్లు ధరించిన ఆకుపచ్చ లేదా నీలం రంగు దుస్తులు కంటికి ఎంతో చల్లదనాన్ని, విశ్రాంతిని ఇస్తాయి. ఆకుపచ్చ, నీలం రంగులకు కంటి అలసటను ఇట్టే తగ్గించే సహజ లక్షణం ఉంటుంది.
ఆఫ్టర్ ఇమేజ్ ఎఫెక్ట్ నుండి రక్షణ
ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్లు కంటిన్యూగా పేషెంట్ శరీరంలోని ఎర్రటి రక్తాన్ని, కణజాలాలను తదేకంగా చూడాల్సి వస్తుంది. ఒకే రంగును అలా ఎక్కువసేపు చూస్తే మెదడుకు, కంటికి ఒకరకమైన భ్రమ కలుగుతుంది. దీన్నే సైన్స్ పరిభాషలో ఆఫ్టర్ ఇమేజ్ ఎఫెక్ట్ అంటారు. దీనివల్ల దృష్టి మందగించి ఏకాగ్రత దెబ్బతినే ప్రమాదం ఉంది. రంగుల చక్రం ప్రకారం ఎరుపు రంగుకు పూర్తిగా వ్యతిరేకమైన రంగులు.. ఆకుపచ్చ, నీలం. కాబట్టి, ఈ దుస్తులను చూడగానే కంటికి ఆ ఎరుపు రంగు వల్ల కలిగిన అలసట పోయి, దృష్టి మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుంది. దీనివల్ల డాక్టర్లు మరింత అప్రమత్తంగా ఆపరేషన్ చేయగలుగుతారు.

స్పష్టమైన దృష్టి.. నిశితమైన ఏకాగ్రత
మన శరీరంలోని అతి సూక్ష్మమైన నరాలు, అవయవాలను గుర్తించడంలో ఈ రంగులు డాక్టర్లకు ఎంతో సహాయపడతాయి. రక్తం మధ్యలో పనిచేసేటప్పుడు, ఆకుపచ్చ లేదా నీలం రంగులు బ్యాక్ గ్రౌండ్‌గా ఉండటం వల్ల విజువల్ కాంట్రాస్ట్ పెరిగి, ప్రతి చిన్న భాగం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. డాక్టర్లకు ఎప్పుడైతే స్పష్టమైన దృష్టి ఉంటుందో, అప్పుడు ఆపరేషన్ లో ఎలాంటి పొరపాట్లు జరిగే అవకాశం ఉండదు.
రోగుల్లో భయాన్ని, ఆందోళనను దూరం చేయడం
ఆపరేషన్ అనగానే ఎవరికైనా గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. భయంతో, ఆందోళనతో ఆపరేషన్ థియేటర్ లోకి అడుగుపెట్టే రోగులకు, డాక్టర్లు ధరించే ఈ ఆకుపచ్చ, నీలం రంగులు ఒకరకమైన ప్రశాంతతను ఇస్తాయి. సైకాలజీ ప్రకారం ఈ రంగులు మనసుకు ఆహ్లాదాన్ని, ధైర్యాన్ని ఇస్తాయి. అందుకే డాక్టర్లను ఆ ప్రశాంతమైన దుస్తుల్లో చూడగానే రోగుల టెన్షన్ చాలావరకు తగ్గిపోయి, శారీరకంగా, మానసికంగా రిలాక్స్ అవుతారు.



Click it and Unblock the Notifications
