Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు
క్యాన్సర్.. ఓ భయంకరమైన మహమ్మారి. చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరికి వస్తుంది. సైలెంట్ గా ఒంట్లోకి చేరి అంతే సైలెంట్‌గా పెరిగి పెద్దదవుతుంది. క్రమంగా లక్షణాలు బయటపడుతుంటాయి. శారీరకంగా, మానసికంగా కుంగదీస్తుంది. ఒంట్లో శక్తిని హరిస్తుంది, బతకాలన్న ఆశను చంపేస్తుంది.

క్యాన్సర్ ను ముందే గుర్తించాలి. చివరి దశలో గుర్తిస్తే బతకడం చాలా కష్టం. తొలి దశలో గుర్తించి సరైన చికిత్స అందిస్తే బతకొచ్చు. అయితే క్యాన్సర్ ను జయించి బతికి బట్టకట్టాలంటే దృఢసంకల్పం ఉండాలి. బతకాలన్న తపన ఉండాలి. శారీరకంగా కంటే కూడా మానసికంగా బలంగా ఉన్న వ్యక్తులే క్యాన్సర్ ను జయించగలరు. ఇలాంటి మహమ్మారిని పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఓడించారు. అందులో కొంత మంది ఇప్పటికీ ఆరోగ్యంగా జీవిస్తున్నారు. వాళ్లెవరో ఇప్పుడు తెలుసుకుందాం.

సోనియా గాంధీ:
గాంధీ కుటుంబ కోడలిగా, కాంగ్రెస్ పార్టీ అధినేత్రిగా సోనియాగ గాంధీ భారతీయులు అందరికీ సుపరిచితమే. సోనియా గాంధీ కూడా గర్భాశయ క్యాన్సర్ తో బాధపడ్డారు. తనకు క్యాన్సర్ ఉందని ఆలస్యంగానే తెలిసింది. కానీ సరైన సమయానికి చికిత్స ప్రారంభించడంతో ఆమె క్యాన్సర్ పై విజయం సాధించారు.

మనీషా కోయిరాలా:
మనీషా కోయిరాలా 2012లో అండాశయ క్యాన్సర్ తో బాధపడ్డారు. క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించి చికిత్స కోసం అమెరికా వెళ్లారు. పట్టుదల, దృఢసంకల్పంతో క్యాన్సర్ ను జయించారు. హీల్డ్ అనే పేరుతో ఆటో బయోగ్రఫీ కూడా రాశారు.

యువరాజ్ సింగ్:
2011 ప్రపంచకప్ టోర్నీ తర్వాత క్రికెటర్ యువరాజ్ సింగ్ కు క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. ఆయన ఎడమ ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ కణితి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. కీమోథెరపీ లాంటి కఠినమైన చికిత్స తీసుకున్నారు. 2012లో క్యాన్సర్ పై పోరాడి విజయం సాధించారు. 2012 లో జరిగిన టీ20 ప్రపంచ కప్ లో కూడా పాల్గొన్నారు.

సంజయ్ దత్:
2020వ సంవత్సరంలో సంజయ్ దత్ కు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. పలు దఫాలుగా కీమో థెరపీ చేయించుకున్నారు. దుబాయ్ లో క్యాన్సర్ కు చికిత్స తీసుకుని మహమ్మారిపై గెలుపొందారు. క్యాన్సర్ ను జయించిన తర్వాత ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు.

సోనాలి బింద్రే:
సోనాలి బింద్రేకు క్యాన్సర్ ఉన్నట్లు 2018లో తేలింది. మెటాస్టాటిక్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. తను క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లి ఎంతో పట్టుదలతో చికిత్స తీసుకుని విజయం సాధించారు.

రాకేష్ రోషన్:
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ 2018లో క్యాన్సర్ బారిన పడ్డారు. గొంతు క్యాన్సర్ తో బాధపడ్డారు. ఆ తర్వాత కఠినమైన చికిత్స తీసుకుని విజయవంతంగా క్యాన్సర్ ను జయించారు.

మమతా మోహన్ దాస్:
సింగర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది మమతా మోహన్ దాస్. ఆ తర్వాత హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. చాలా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. మమత మోహన్ దాస్ బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఆ తర్వాత కఠినమైన చికిత్స తీసుకుని క్యాన్సర్ మహమ్మారిని జయించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications