Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.!
డిజిటల్ యుగంలో డేటింగ్, రిలేషన్‌షిప్ అర్థం మారిపోతూ వస్తోంది. ఈ క్రమంలో కొత్తగా సోషల్ మీడియాలో మరో కొత్త ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా జెన్ జెడ్ అమ్మాయిలు తమ వయసు కంటే ఎక్కువ ఏజ్ ఉన్న అబ్బాయిలతో డేటింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ ట్రెండ్ వైరల్ అవుతుందా.? లేక ఇందులో నిజమెంత ఇక్కడ చూద్దాం..

1997- 2012 మధ్య జన్మించిన వారిని జెన్ జెడ్‌గా పిలుచుకుంటున్నాం. 1981- 1996 మధ్య పుట్టిన వారిని మిలీనియల్స్‌గా చెప్పుకొంటున్నాం. ఈ క్రమంలో జెన్ జెడ్ అమ్మాయిలు మిలీనియల్స్ అబ్బాయిలతో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడానికి ఇష్టపడుతున్నారని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ డేటింగ్‌కి ప్రధాన కారణం ఆకర్షణ మాత్రమే కానీ వయసు అడ్డం కాదని నిపుణులు తెలిపారు. మిలీనియల్స్ నుంచి వచ్చే వైబ్, శక్తి కూడా అమ్మాయిలను ఆకర్షిస్తోందని అంటున్నారు.
ముఖ్యంగా జెన్ జీ అమ్మాయిలు టెక్నాలజీ పరంగా చాలా అప్‌డేటెడ్‌గా ఉంటారు. ఏ సమాచారమైనా చాలా వేగంగా ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోగలుగుతున్నారు. అందుకే వారి జీవితంలో ఒక స్పష్టత, భావోద్వేగ స్థిరత్వం అనేది ఉంటుంది. ఇక మిలీనియల్ పురుషులు ఇప్పటికే తమ జీవితంలో కొన్ని ఒడుదొడుకులు ఎదుర్కోవడంతో వారు ప్రతి విషయంలో చాలా స్థిరత్వాన్ని కలిగి ఉంటారు.
ఇదిలా ఉండగా మిలీనియల్స్‌లో పరిపక్వత, పరిణతి ఎక్కువగా ఉంటుంది. ఇది కేవలం వయసు ద్వారా మాత్రమే వచ్చేది కాదు. రిలేషన్స్‌ని హ్యాండిల్ చేసే విధానం కూడా వారిలో మెండుగా ఉంటుంది. వీరి మాటల్లో చాలా స్పష్టత ఉంటుంది. ఏ విషయమైనా సంకోచం లేకుండా వివరించగలరు. చిన్న చిన్న వివాదాలను సైతం పెద్దదిగా సాగదీయకుండా పరిష్కరించుకునే సామర్థ్యం ఉంటుంది. అయితే జెన్ జీ అబ్బాయిల్లో ఆ పరిణతి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే జెన్ జెడ్ అమ్మాయిలు తమ తరంలోని గందరగోళ ప్రేమ కంటే శాంతియుత ప్రేమ వైపు మొగ్గు చూపుతూ మిలీనియల్స్‌కి ఆకర్షితులవుతున్నారు.
జెన్ జీ అమ్మాయిలు ముఖ్యంగా మిలీనియల్స్‌ని ఎంచుకోవడానికి ఆర్థిక భద్రత కూడా ఓ కారణంగా ప్రజలు భావిస్తున్నా.. అది ఓ రకంగా తప్పనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కాలం అమ్మాయిలు ఆర్థికంగానూ ఎవరిపైనా ఆధారపడకుండా ఉండగలుగుతున్నారు. తమను తాము కేరింగ్ తీసుకునే ఆర్థిక స్వాతంత్ర్యం ఉంటుంది. అందుకే వారికి ఆర్థిక భద్రత కంటే భావోద్వేగ భద్రతకే ప్రాధాన్యత ఇస్తూ మిలీనియల్స్‌పైన మొగ్గు చూపుతున్నారు.
అయితే మహిళలు తమ కంటే పెద్ద వయసున్న పురుషులను ఇష్టపడటం కొత్తేమీ కాదు. పెద్దలు కుదిర్చిన వివాహాల్లో వయసు తారతమ్యం ఎక్కువగా ఉండటం సాధారణమే. ప్రేమ పెళ్లిళ్లలో వయసు తేడా తక్కువగానే ఉంటుంది. అందుకే ఈ కాలంలో దీనిని జెన్ జెడ్- మిలీనియల్ అనే పేరుతో నెట్టింట్లో చర్చ జరుగుతోంది.

ఇక ఇందుకు సంబంధించి స్పష్టమైన ఉదాహరణలు లేకపోయినా.. మహిళలు తమ జీవితంలో నిజాయితీగా ఉంటూ స్థిరత్వం ఉన్న భాగస్వామిని కోరుకుంటున్నారు. ఇది మిలీనియల్స్‌లోనే కాదు తమకి సమాన వయసులో ఉన్న వారిలో కనిపించినా వారితో కలిసి ఉండటానికి ఇష్టపడుతున్నారు. రిలేషన్‌షిప్ విజయవంతం కావాలంటే ఒకరిపై మరొకరికి గౌరవం, భావోద్వేగంగా మద్దతు అనేది చాలా కీలకం. కాలం, టెక్నాలజీ మారుతున్న కొద్దీ యువతీయువకుల ఆలోచనల్లో పరిపక్వత కనిపిస్తూనే ఉంది. ఇది భాగస్వామి నుంచి ఆశిస్తుండటం వారి మానసిక పరిణతికి ఉదాహరణ.



Click it and Unblock the Notifications
