Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
ఈ మెడికల్ పరీక్షలు తప్పకుండా చేయించుకోవాల్సిందే..
వయసు పెరిగినాకొద్దీ కొన్ని ఆరోగ్య పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి. రోగం తీవ్రం కాకముందే ముందు జాగ్రత్తతో ఉంటే ఎంతటి తీవ్రఅనారోగ్యాన్నైనా సరే బలంగా ఎదురుకోవచ్చు. బ్లడ్ టెస్ట్, శుగర్ టెస్ట్ ఇవి ఖచ్ఛితంగా చేయించుకోవాలి. ఇలాంటి కొన్ని ముఖ్యమైన ఆరోగ్యపరీక్షలను మిస్ కాకుండా తప్పనిసరిగా చేయించుకోవాలి. అవేంటో ఓసారి తెలుసుకుందాం.

రక్త పరీక్ష
ప్రతీ ఆరునెలలకు ఓసారి రక్తపరీక్షను తప్పకుండా చేయించుకోవాలి. ఇది వైద్యులకు రోగాలను పసిగట్టడానికి, శరీరంలో ఏ అవయవం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.
బేసిక్ మెటాబోలిక్ ప్యానల్ పరీక్ష
దీనినే బీఎంపీ పరీక్ష అని కూడా అంటారు. ఈ టెస్ట్ ద్వారా రక్తంలో ఎనిమిది రకాలైన పోషకాలు, కాల్షియం, గ్లూకోస్, సోడియం, పొటాషియం, బైకార్బొనేట్, క్లోరైడ్, రక్తంలో యూరియా నైట్రోజెన్, క్రియేటినైన్ ఏ మోతాదులో ఉందో తెలుస్తుంది. ఈ పరీక్ష చేయించుకునే ముందు మీరు 8 గంటల ముందు నుంచి ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉపవాసంతో ఉండాలి. పరీక్షలు నార్మల్‌గా లేకుండా అబ్‌నార్మల్‌గా ఉంటే మీరు కిడ్నీ, మధుమేహం లేదా ఇతర వ్యాధులతో బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతారు.
లిపిడ్ పరీక్ష
ఈ లిపిడ్ పరీక్షకు 8 గంటలకు ముందు కూడా మీరు ఉపవాసంతో ఉండాలి. ఈ టెస్ట్‌తో మీలోని కొలస్ట్రాల్ లెవల్స్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. పరీక్ష తరువాత మీకు రిపోర్ట్ నార్మల్‌గా లేకపోతే మీరు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు పరిగణిస్తారు.
థైరాయిడ్ పరీక్ష
ఈ థైరాయిడ్ పరీక్ష ద్వారా మీ బలం, ప్రొటీన్ లెవెల్స్, థైరాయిడ్ స్థితిగతి ఎలా ఉందో తెలుసుకుంటారు.
సి-రియాక్టివ్ ప్రొటీన్ పరీక్ష
దీనినే సీఆర్‌పీ పరీక్ష అంటారు. ఈ సీఆర్‌పీ పరీక్షలో మీ సీఆర్‌పీ స్థాయి ఎక్కువగా ఉంటే మీరు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు. సీఆర్పీ స్థాయిలను బట్టి లుపస్, రుమటాయిడ్ అర్థిరైటిస్, క్యాన్సర్ లాంటి రోగాలను సూచిస్తుంది.
లైంగిక సంక్రమణ వ్యాధులు
లైంగికంగా వ్యాధులు సంక్రమించాయా లేదా తెలుసుకోవడానికి ప్రత్యేకంగా రక్త పరీక్షలు చేస్తారు. ఈ టెస్టుల ద్వారా రిపోర్టులు అబ్‌నార్మల్‌గా ఉంటే హెర్పెస్, హెచ్‌ఐవీ, సిఫిలిస్, హెపటైటిస్ సి లాంటి వ్యాధుల గురించి బయట పడుతుంది.
రక్త పరీక్షలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రక్తం తీసే ప్రదేశాన్ని దూదితో శుబ్రం చేయాలి. నరాలు కనిపించే విధంగా చేయికి బ్యాండ్ చుట్టాలి. నర్సు రక్తాన్ని తీసుకున్న తరువాత కట్టిన బ్యాండ్‌ను తీసేసి రక్తం తీసిన ప్రదేశాన్ని దూదితో లేదా మెడికల్ టేప్‌తో కప్పివేయాలి. రక్త పరీక్ష చేయడానికి స్టెరిలైజ్డ్ సూది, శుబ్రమైన దూదిని మాత్రమే ఉపయోగించాలి. ఈ పై పరీక్షలను తప్పకుండా చేసుకుంటే ఎలాంటి అనారోగ్యాన్నైనా ముందుగానే ఎదురుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications