Latest Updates
-
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే!
బీపీని తరిమికొట్టే 5 సూపర్ ఫుడ్స్.. ఇక మందులతో పనిలేదు!
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో యువతను తీవ్రంగా వేధిస్తున్న ప్రధాన సమస్య అధిక రక్తపోటు (హై బీపీ). ఇదొక సాధారణ సమస్యే అని తీసిపారేస్తే పొరపాటే. ఎందుకంటే ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండానే గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ ఫెయిల్, చిత్తవైకల్యం వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీసే అతిపెద్ద సైలెంట్ కిల్లర్ ఇది. బీపీని కంట్రోల్ లో ఉంచడానికి డాక్టర్లు మందులు సూచిస్తారు. వాటిని క్రమం తప్పకుండా వాడకపోతే ప్రాణాలకే ప్రమాదం.

అయితే జీవితాంతం మందులు వాడటం కంటే మన రోజువారీ ఆహారంలో చిన్నచిన్న మార్పులు చేసుకుంటే సహజంగానే బీపీని జయించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యవంతులైన వ్యక్తుల్లో సాధారణ రక్తపోటు 120/80 ఉండాలి. అదే 60 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో ఇది 120-140 వరకు ఉన్నా సాధారణమే. ఎన్ని మెడిసిన్స్ వాడినా కొన్నిసార్లు బీపీ హెచ్చుతగ్గులకు గురవుతుంది. కానీ శాస్త్రీయంగా నిరూపించబడిన 5 రకాల ఆహార పదార్థాలను రోజూ తీసుకుంటే బీపీని సులభంగా నియంత్రించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ఆ ఐదు సూపర్ ఫుడ్స్ ఏవో ఇక్కడ చూడండి.
అల్లం
అల్లం మన వంటింట్లో దొరికే అత్యుత్తమ ఔషధం. శరీరంలో క్యాల్షియం ఛానల్ ఉత్తేజితమైనప్పుడు రక్తనాళాలు, కండరాలు బిగుసుకుపోయి బీపీ పెరుగుతుంది. ఇలాంటి సమయంలో అల్లం ఒక సహజసిద్ధమైన క్యాల్షియం ఛానల్ బ్లాకర్ గా పనిచేస్తుంది. ఇది కండరాలను సడలించి, రక్తప్రసరణను సాఫీగా మార్చి బీపీని తగ్గిస్తుంది.
అరటిపండు
అరటిపండు బీపీ రోగులకు ఒక వరం. దీంట్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. మన శరీరంలో సోడియం (ఉప్పు), పొటాషియం ఎప్పుడూ బద్ధ శత్రువుల్లా ఉంటాయి. సోడియం పెరిగితే రక్తంలో నీరు నిలిచిపోయి బీపీ పెరుగుతుంది.
మీరు అరటిపండు తిన్నప్పుడు అందులోని పొటాషియం కిడ్నీలను ఉత్తేజపరిచి, అదనంగా ఉన్న సోడియంను మూత్రం ద్వారా బయటకు పంపేస్తుంది. ఫలితంగా బీపీ అదుపులోకి వస్తుంది. షుగర్, బీపీ రెండూ ఉన్నవారు రోజుకో అరటిపండు, కేవలం బీపీ మాత్రమే ఉన్నవారు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి తినడం అలవాటు చేసుకోండి.

డార్క్ చాక్లెట్
చాక్లెట్ తింటే ఆరోగ్యం పాడవుతుందని అనుకుంటారు. కానీ డార్క్ చాక్లెట్ బీపీకి అద్భుతమైన ఔషధం. ఇందులో పాలీఫెనాల్స్, ఫ్లేవనాల్స్, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచుతాయి, తద్వారా రక్తనాళాలు విశాలమై రక్తపోటు సులభంగా తగ్గుముఖం పడుతుంది.
బీట్ రూట్
ఎర్రగా నిగనిగలాడే బీట్ రూట్ కూడా బీపీకి చెక్ పెడుతుంది. ఇందులో ఉండే ఆర్గానిక్ నైట్రేట్లు మన శరీరంలోకి ప్రవేశించగానే నైట్రస్ ఆక్సైడ్ గా రూపాంతరం చెందుతాయి. రక్తనాళాల పనితీరును మెరుగుపరచి, అధిక రక్తపోటును అడ్డుకోవడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది.

దానిమ్మ
మన శరీరంలో రెనిన్ యాంజియోటెన్సిన్ అనే వ్యవస్థ ఉంటుంది. కిడ్నీలు, గుండెకు సంబంధించిన ఈ వ్యవస్థ బీపీని పెంచేలా చేస్తుంది. మనం దానిమ్మపండు లేదా రసం తీసుకున్నప్పుడు, అది ఆ వ్యవస్థలోని ఎంజైమ్ ల తీవ్రతను తగ్గించి, రక్తపోటును మ్యాజిక్ లా అదుపులోకి తీసుకొస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications