యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా? మందులు లేకుండా ఈ 3 సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టండి!

ప్రస్తుతం చాలామంది యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతూ హాస్పిటల్స్ చుట్టూ తిరిగి దానిని తగ్టించుకునే రకరకాల మెడిసిన్స్ వాడుతున్నారు. కాలక్రమేణా మారిపోతున్న లైఫ్ స్టైయిల్, ఫుడ్ అలవాట్ల వల్లనే ఎక్కువమందిని యూరిక్ యాసిడ్ సమస్య వేధిస్తోంది. మన శరీరంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు జీర్ణమైన తర్వాత వెలువడే ఒక వ్యర్థమే ఈ యూరిక్ యాసిడ్. సాధారణంగా దీనిని మన కిడ్నీలు ఫిల్టర్ చేసి శరీరం నుంచి బయటకు పంపేయాలి..అయితే కిడ్నీలు ఆ పనిని కరెక్ట్ గా చేయలేనప్పుడు రక్తంలో దీని లెవల్స్ అమాంతం పెరిగిపోయి కీళ్ల నొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది.

అయితే ఈ సమస్య రాగానే చాలా మందిలో అనవసరమైన భయాలు మొదలవుతాయి. పప్పుధాన్యాలు, టమోటాలు, పాలకూర తింటే యూరిక్ యాసిడ్ పెరుగుతుందనే అపోహతో వాటిని పూర్తిగా మానేస్తారు. కానీ బాలీవుడ్ స్టార్స్ కరీనా కపూర్, ఆలియా భట్ ల ఫేవరెట్ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్ ఇదంతా అపోహ మాత్రమేనని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో స్పష్టం చేస్తున్నారు. పప్పులు మానేయడం కాదు, కొన్ని మంచి అలవాట్లు చేసుకుంటూ, చెడు అలవాట్లను వదిలేస్తే ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చని ఆమె సూచిస్తున్నారు. ఆ అద్భుతమైన 3 మార్గాలు ఏమిటో ఇక్కడ చూడండి.

How to Reduce Uric Acid Naturally 3 Magical Tips by Celebrity Nutritionist Rujuta Diwekar

యూరిక్ యాసిడ్‌ ను మాయం చేసే 3 అద్భుతమైన మార్గాలు

వాటర్ మ్యాజిక్

మన శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు పోవాలంటే నీరే అసలైన మందు. రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తప్పకుండా త్రాగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే యూరిక్ యాసిడ్ లెవల్స్ నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి. కేవలం నీళ్లు తాగడమే కాకుండా నీటి శాతం,ఫైబర్ ఎక్కువగా ఉండే సొరకాయ, బీరకాయ వంటి కూరగాయలను రెగ్యులర్ గా మీ ఆహారంలో చేర్చుకోండి.

మగాళ్లలో వంధ్యత్వానికి కారణం అండర్ వేర్ ఏనా? డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజం!</a><a class=" title="మగాళ్లలో వంధ్యత్వానికి కారణం అండర్ వేర్ ఏనా? డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజం!" />మగాళ్లలో వంధ్యత్వానికి కారణం అండర్ వేర్ ఏనా? డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజం!

ప్రాసెస్ చేసిన ధాన్యాలు వద్దు

మనం తినే ధాన్యాల విషయంలో కాస్త శ్రద్ధ వహించాలి. జొన్నలు, గోధుమలు వంటి ముడి ధాన్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మార్కెట్లో దొరికే ప్యాకెట్ పిండిని వాడటం కంటే, ఇంట్లోనే స్వయంగా గోధుమలు తెచ్చుకుని, పట్టించి రొట్టెలు చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అన్నం విషయానికొస్తే..మరీ ఎక్కువగా పాలిష్ చేయని బియ్యాన్ని వాడటమే బెటర్. వారానికి కనీసం రెండు సార్లైనా జొన్న రొట్టెలు తినాలని రుజుతా దివేకర్ సలహా ఇస్తున్నారు.

విటమిన్ C తో అద్భుత ప్రయోజనాలు

విటమిన్ C పుష్కలంగా ఉండే పండ్లు యూరిక్ యాసిడ్‌ ను కరిగించడంలో చాలా బాగా సహాయపడతాయి. ముఖ్యంగా ఉసిరికాయను రోజూ పచ్చిది, ఎండబెట్టింది, జామ్ లేదా పచ్చడి ఇలా ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. మీకు ఉసిరి నచ్చకపోతే జామకాయ, నారింజ వంటి విటమిన్ C అధికంగా ఉండే ఇతర పండ్లను క్రమం తప్పకుండా తినాలి.

వ్యాయామంతో కీళ్లకు రక్షణ కవచం

యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు ముందుగా దెబ్బతినేది మన కీళ్లే. అందుకే రోజూ ఉదయం యోగా, సూర్య నమస్కారాలు చేయడం దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కీళ్లు దృఢంగా మారి నష్టాన్ని నివారించవచ్చు.

వీటికి ఎంత దూరంగా ఉంటే.. అంత ఆరోగ్యం

సిగరెట్ తాగడం,మందు తాగడం,ప్యాకెట్ల ఫుడ్స్ తినడం,రోజంతా కుర్చీకే పరిమితమై ఒకే చోట కూర్చోవడం,శరీరానికి వ్యాయామం ఇవ్వకుండా రోజంతా ఫోన్ చూస్తూ గడపడం.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Friday, November 6, 2026, 17:00 [IST]
Desktop Bottom Promotion