బంగారు నగరమైన శ్రీలంకకు రావణాసురుడు రాజు ఎలా అయ్యాడో తెలుసా?

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, కన్నడ సూపర్ సార్ట్ యశ్ రావణాసురిడిగా తెరకెక్కిన రామాయణ సినిమా పార్ట్ 1 తాజాగా విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో రావణాసురిడి పాత్రలో యశ్ అద్భుతంగా నటించారంటూ అందరూ అతడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అసలు రావణాసురుడు ఇలాగే ఉండేవాడేమో అన్నట్లుగా ఆయన తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకర్షించారు.

రామాయణంలో శ్రీలంకకు ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అసుర చక్రవర్తి రావణాసురుడు పరిపాలించిన ఈ శ్రీలంక ఒక అద్భుతమైన బంగారు నగరం. సకల సిరిసంపదలతో తులతూగిన ఈ స్వర్ణలంక అసలు రావణుడి సొంతం ఎలా అయిందో, ఒక రాక్షసుడి చేతికి ఇంతటి సుందరమైన నగరం ఎలా చిక్కిందో మీకు తెలుసా? పురాణాల ప్రకారం దీని వెనుక రెండు అత్యంత ఆసక్తికరమైన కథలు ప్రచారంలో ఉన్నాయి.

From Lord Shiva to Kubera The Real Story of How Ravana Acquired Swarna SriLanka

మొదటి కథ పరమశివుడు, పార్వతీదేవికి సంబంధించినది
ఒకానొక సమయంలో పార్వతీదేవి తనకు నివాసంగా ఒక అత్యద్భుతమైన రాజభవనాన్ని నిర్మించమని తన భర్త శివుడిని కోరిందట. భార్య కోరికను మన్నించిన భోళాశంకరుడు, ఆ మహాకార్య బాధ్యతను దేవతా శిల్పి అయిన విశ్వకర్మకు అప్పగించాడు. విశ్వకర్మ తన అపారమైన దివ్య నైపుణ్యంతో సముద్రం మధ్యలో ఒక అద్భుతమైన నగరాన్ని సృష్టించాడు. చూసిన వెంటనే ఎవరినైనా మంత్రముగ్ధులను చేసేలా, ఆ నగరాన్ని పూర్తిగా స్వచ్ఛమైన బంగారంతో తీర్చిదిద్దాడు. కాలక్రమంలో ప్రజలు ఆ అందమైన నగరాన్ని స్వర్ణ శ్రీలంక అని పిలవడం ప్రారంభించారు.

అయితే ఆ నగరంలో గృహప్రవేశం చేయడానికి శివుడు ఒక గొప్ప పండితుడిని ఆహ్వానించాలనుకున్నాడు. గొప్ప శివ భక్తుడు, నాలుగు వేదాలు చదివిన మహా పండితుడు అయిన రావణబ్రహ్మను ఆ పుణ్యకార్యానికి, పూజా కార్యక్రమాలకు స్వయంగా ఆహ్వానించాడు. గృహప్రవేశ క్రతువును అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించిన రావణుడు ఆ నగర సౌందర్యానికి తీవ్రంగా ఆకర్షితుడయ్యాడు. పూజ పూర్తయిన తర్వాత తనకు దక్షిణగా ఆ స్వర్ణలంకనే ప్రసాదించమని శివుడిని కోరాడు. తన భక్తుడి కోరికను కాదనలేని పరమశివుడు ఏమాత్రం ఆలోచించకుండా ఆ బంగారు నగరాన్ని రావణుడికి దానం చేశాడు. ఇది చూసిన పార్వతీదేవికి తీవ్ర ఆగ్రహం కట్టలు తెంచుకుంది. భవిష్యత్తులో ఆ నగరం మంటల్లో కాలి బూడిదైపోతుందని ఆమె ఆ క్షణంలోనే శపించింది.

2027లో బంగారం ధర ఎంత ఉంటదో తెలుసా? బాబా వంగా సంచలన జోస్యం!2027లో బంగారం ధర ఎంత ఉంటదో తెలుసా? బాబా వంగా సంచలన జోస్యం!

రెండో కథ రావణుడి సవతి సోదరుడైన కుబేరుడికి సంబంధించినది

విశ్రవస మహాముని కుమారుడైన కుబేరుడిని నేటికీ ప్రజలు సంపదలకు అధిపతిగా పూజిస్తుంటారు. రామాయణం ప్రకారం తొలుత ఈ శ్రీలంకను పరిపాలించిన రాజు కుబేరుడే. ఆయన దగ్గరే మనస్సు సంకల్పం చేత నడిచే అద్భుతమైన పుష్పక విమానం కూడా ఉండేది. అయితే ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుంచి అపారమైన శక్తులు, ఎన్నో వరాలు పొందిన రావణుడు తన సామ్రాజ్యాన్ని నలుదిశలా విస్తరించాలనుకున్నాడు. ఈ క్రమంలో తన అన్న అయిన కుబేరుడిపైనే దండెత్తి, జరిగిన భీకర యుద్ధంలో అతన్ని ఓడించాడు. ఆ విధంగా శ్రీలంకపై పూర్తి ఆధిపత్యాన్ని సాధించడంతో పాటుగా, ఆ పుష్పక విమానాన్ని కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు.

రావణుడి పాలనలోకి వెళ్లిన తర్వాత శ్రీలంక అపారమైన సిరిసంపదలతో, మహాశక్తివంతమైన నగరంగా రూపాంతరం చెందింది. రామాయణంలోని సుందరకాండలో సీతమ్మను వెతుక్కుంటూ లంకలో అడుగుపెట్టిన హనుమంతుడు.. అక్కడి రాజభవనాల వైభవాన్ని, మిరుమిట్లు గొలిపే బంగారు అలంకరణలను చూసి ఆశ్చర్యపోతాడు.

Story first published: Friday, November 6, 2026, 14:09 [IST]
Desktop Bottom Promotion