Latest Updates
-
అతిథులను ఆశ్చర్యపరిచే అద్భుతమైన దీపావళి స్వీట్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా? మందులు లేకుండా ఈ 3 సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టండి! -
బ్రెడ్ లేకుండా బ్రెడ్ పకోడీ చేయడం ఎలా? టేస్ట్ చూస్తే వావ్ అనాల్సిందే.. -
బంగారు నగరమైన శ్రీలంకకు రావణాసురుడు రాజు ఎలా అయ్యాడో తెలుసా? -
మగాళ్లలో వంధ్యత్వానికి కారణం అండర్ వేర్ ఏనా? డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజం! -
దీపావళికి స్పెషల్ స్వీట్.. కేవలం వేరుశెనగలతో నోట్లో వెన్నలా కరిగిపోయే పీనట్ హల్వా చేసుకోండిలా.. -
జీర్ణక్రియను మెరుగుపరిచే.. ఇడ్లీ, దోశలోకి అదిరిపోయే కొబ్బరి అల్లం చట్నీ చేసుకోండిలా.. -
Dhanteras 2026: ధనత్రయోదశి రోజు ఏ ముహూర్తంలో బంగారం కొనాలి? పూజా విధానం పూర్తి వివరాలు -
ఈ దీపావళికి ఇడ్లీలతో స్పైసీ బోటి పులుసు.. ఇలా చేస్తే రుచి అద్భుతం -
2027లో బంగారం ధర ఎంత ఉంటదో తెలుసా? బాబా వంగా సంచలన జోస్యం!
మీ జీర్ణవ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందనడానికి 10 సంకేతాలివే
మన సంపూర్ణ ఆరోగ్యం అంతా మన పొట్ట పనితీరుపైనే ఆధారపడి ఉంటుందని మన పెద్దలు, డాక్టర్లు చెబుతుంటారు. మరి మీ జీర్ణవ్యవస్థ ఎంత ఆరోగ్యంగా ఉందో మీకు తెలుసా? ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ సేథీ..10 సంకేతాలు కనబడితే మీ జీర్ణక్రియ సూపర్ గా పనిచేస్తున్నట్లేనని చెప్పారు. మీ పొట్ట పదిలంగా ఉందని తెలిపే ఆ సంకేతాలేవో ఇక్కడ చూడండి.
రోజుకు 3 సార్లు లేదా వారానికి 3 సార్లు మలవిసర్జన
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ మోషన్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. అధ్యయనాల ప్రకారం వారానికి 3 సార్లు లేదా రోజుకు 3 సార్లు మలవిసర్జనకు వెళ్లినా మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉన్నట్లే.

మలం ఆకారం
మలం మృదువుగా, సాసేజ్ ఆకారంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా బయటకు రావడం మంచి లక్షణం.
తిన్న వెంటనే విసర్జనకు వెళ్లాలనిపించడం
భోజనం చేసిన వెంటనే మోషన్‌కి వెళ్లాలనిపిస్తుందా? భయపడకండి, ఇది గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్. అంటే మీరు ఇప్పుడే తిన్న ఆహారం వెంటనే బయటకు వచ్చేస్తోందని కాదు, పాత మలం బయటకు నెట్టబడుతోందని అర్థం.
గ్యాస్ పోవడం
రోజులో సుమారు 8 నుండి 14 సార్లు, గరిష్టంగా 25 సార్లు గ్యాస్ (అపానవాయువు) పోవడం పూర్తి సహజం. దీని అర్థం మీ పొట్టలో ఏదో సమస్య ఉన్నట్లు అస్సలు కాదు.
భోజనం తర్వాత హాయిగా అనిపించడం
తిన్న తర్వాత కడుపు నిండినట్లు, హాయిగా అనిపిస్తే మీ హార్మోన్లు (GLP-1, PYY) మెదడుకు సరైన సిగ్నల్స్ పంపుతున్నట్లే. అలాకాకుండా రెండు ముద్దలకే కడుపు ఉబ్బరంగా అనిపిస్తే మాత్రం ఆలోచించాల్సిందే.

ఫైబర్ సులభంగా జీర్ణం కావడం
ఎలాంటి కడుపునొప్పి, గ్యాస్ లేకుండా ఫైబర్ (పీచు పదార్థాలు) ఎక్కువగా ఉండే ఆహారాన్ని సులభంగా అరిగించుకోగలగడం మీ గట్ ఆరోగ్యానికి నిదర్శనం.
ముక్కాల్సిన పనిలేకుండా విసర్జన జరగడం
బాత్రూమ్‌లో 5 నిమిషాల కంటే తక్కువ సమయం గడుపుతూ, ఎలాంటి ఒత్తిడి లేకుండా సాఫీగా విసర్జన జరగడం ఆరోగ్యకరమైన అలవాటు.
తిన్న తర్వాత పొట్ట కాస్త ఉబ్బడం
భోజనం చేసిన తర్వాత ఆహారం, నీరు, గ్యాస్ వల్ల పొట్ట కాస్త ఉబ్బడం సహజమే. అయితే అలా ఉబ్బినప్పుడు కడుపులో నొప్పి లేకపోతే అది పూర్తిగా నార్మల్.
పొట్ట పూర్తిగా ఖాళీ అయిన భావన
విసర్జన పూర్తయ్యాక, కడుపు మొత్తం ఖాళీ అయినట్లు అనిపించాలి. ఇంకా ఏదో మిగిలిపోయినట్లు అనిపిస్తే అది మలబద్ధకానికి సూచన.
మీ జీర్ణవ్యవస్థ గురించి మీకెప్పుడూ గుర్తురాకపోవడం
మీరు తిన్నది సక్రమంగా అరిగిపోయి, మలబద్ధకం, నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలేవీ లేకపోతే, అసలు మీ జీర్ణవ్యవస్థ గురించి మీరెప్పుడూ ఆలోచించరు. మీ పొట్ట ఎంత ఆరోగ్యంగా ఉందనడానికి ఇదే అతిపెద్ద సాక్ష్యం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
