Latest Updates
-
Diwali 2026 Wishes in Telugu: మీ బంధుమిత్రులకు ప్రత్యేకంగా దీపావళి శుభాకాంక్షలు చెప్పండిలా.. -
రెస్టారెంట్ స్టైల్ పనీర్ భుర్జీ మసాలా గ్రేవీ.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
బంగాళదుంపతో ఇలా దోశ వేస్తే రుచికి ఫిదా అవ్వాల్సిందే.. తయారీ విధానం ఇదే.. -
మీ జీర్ణవ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందనడానికి 10 సంకేతాలివే -
అతిథులను ఆశ్చర్యపరిచే అద్భుతమైన దీపావళి స్వీట్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా? మందులు లేకుండా ఈ 3 సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టండి! -
బ్రెడ్ లేకుండా బ్రెడ్ పకోడీ చేయడం ఎలా? టేస్ట్ చూస్తే వావ్ అనాల్సిందే.. -
బంగారు నగరమైన శ్రీలంకకు రావణాసురుడు రాజు ఎలా అయ్యాడో తెలుసా? -
మగాళ్లలో వంధ్యత్వానికి కారణం అండర్ వేర్ ఏనా? డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజం! -
దీపావళికి స్పెషల్ స్వీట్.. కేవలం వేరుశెనగలతో నోట్లో వెన్నలా కరిగిపోయే పీనట్ హల్వా చేసుకోండిలా..
ఎముకలను బలపరిచే పోషకాల నిధి.. దీపావళి పండుగ స్పెషల్ గా పెసరపప్పు పాయసం చేయండిలా..
దీపావళి అంటేనే టపాసులు, నోరూరించే స్వీట్లు. ఈ దీపావళికి మీ ఇంటి వేడుకలను మరింత మధురంగా మార్చడానికి, ఆరోగ్యం, రుచి కలబోసిన అద్భుతమైన వంటకం పెసరపప్పు సేమియా పాయసం. సంప్రదాయ పద్ధతిలో బెల్లంతో తయారు చేసే ఈ పాయసం, కేవలం రుచిలోనే కాదు, అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
ఈ పాయసంలో ఉపయోగించే పెసరపప్పులో శరీరానికి కావలసిన ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే రిఫైన్డ్ పంచదారకు బదులుగా ఉపయోగించే స్వచ్ఛమైన బెల్లం ఆరోగ్యాకి మేలు చేస్తుంది. ఈ స్వీట్ తినడం ద్వారా ఎముకలు బలపడతాయి. ఈ పాయసం, దీపావళి రోజున మీ కుటుంబ సభ్యులందరికీ ఒక అద్భుతమైన ఆరోగ్యకరమైన కానుక అవుతుంది. పెసరపప్పు సేమియా పాయసం ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
పెసరపప్పు: అర కప్పు (పసుపు రంగుది)
సేమియా: పావు కప్పు
నెయ్యి: 1 టేబుల్ స్పూన్
బెల్లం తురుము: పావు కప్పు
కాచి చల్లార్చిన పాలు: 1 కప్పు
డ్రై ఫ్రూట్స్: తగినన్ని (బాదం, జీడిపప్పు, ఎండు
కొబ్బరి,కిస్మిస్)
యాలకుల పొడి: 4-5 యాలకులది
నీరు: ఉడికించడానికి, బెల్లం కరిగించడానికి తగినంత
అతిథులను ఆశ్చర్యపరిచే అద్భుతమైన దీపావళి స్వీట్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో అర కప్పు పెసరపప్పు వేసి, మంచి సువాసన వచ్చే వరకు తక్కువ మంట మీద నిరంతరం కలుపుతూ వేయించాలి. పప్పు రంగు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, దానిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ వేయించిన పెసరపప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, అర కప్పు నీళ్లు పోసి కొద్దిసేపు నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల ఉడికే సమయం చాలా వరకు తగ్గుతుంది.
-ఇప్పుడు ఒక గిన్నెలో రెండున్నర కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. నీరు మరుగుతున్నప్పుడు, నానబెట్టిన పెసరపప్పును అందులో వేయాలి. కుక్కర్ లో ఉడికించడం కంటే నేరుగా గిన్నెలో ఉడికించడం వల్ల పాయసం రుచి అద్భుతంగా వస్తుంది,పప్పు మరీ మెత్తగా చిదురుగా అవ్వకుండా ఉంటుంది. ఐదు నిమిషాల తర్వాత, వేయించిన సేమియాను కూడా వేసి బాగా కలపాలి. పెసరపప్పు వేసిన ఐదు నిమిషాల తర్వాత సేమియా వేస్తే, అది ముద్దగా కాకుండా విడివిడిగా ఉడుకుతుంది. మూత కొద్దిగా తెరిచి ఉంచి, రెండూ మెత్తబడే వరకు ఉడికించాలి.
-మరోవైపు, ముప్పావు కప్పు తురిమిన బెల్లాన్ని ముప్పావు కప్పు నీటిలో కరిగించాలి. దీనికి ప్రత్యేకమైన పాకం అవసరం లేదు. బెల్లం నీటిలో పూర్తిగా కరిగితే సరిపోతుంది. పప్పు, సేమియా ఉడికిన తర్వాత ఈ బెల్లం నీటిని వడకట్టి పాయసంలో కలపాలి. మూత పెట్టి ఐదు నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి. ఆ తర్వాత మంట ఆపి యాలకుల పొడి కలపాలి.
-ఇప్పుడు కాచి చల్లార్చిన పాలను ఒకేసారి పోయకుండా, రెండు మూడు టేబుల్ స్పూన్ల చొప్పున వేస్తూ మధ్యమధ్యలో కలుపుతూ పోయాలి. ఇలా చేయడం వల్ల పాలు విరిగిపోకుండా ఉంటాయి. పాలు బాగా కలిసిన తర్వాత, మరో రెండు నిమిషాలు తక్కువ మంటపై ఉడికించి స్టవ్ ఆపేయాలి.
-చివరగా నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష, కొబ్బరి తురుమును పాయసంలో కలపాలి.
-ఎంతో కమ్మని, గుమగుమలాడే పెసరపప్పు సేమియా పాయసం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
