అతిథులను ఆశ్చర్యపరిచే అద్భుతమైన దీపావళి స్వీట్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..

Posted By:

దీపావళి అంటేనే కాంతులు, సంతోషాలు కలగలిసిన పండుగ. ఆ వెలుగుల పండుగ వేళ బంధుమిత్రులకు, కుటుంబ సభ్యులకు తీపి పంచుకోవడం మనకు అనాదిగా వస్తున్న ఆనవాయితీ. అయితే ప్రతి ఏడాదీ చేసుకునే రొటీన్ స్వీట్స్.. అంటే లడ్డూలు, మైసూర్ పాక్, బర్ఫీలు లాంటివి కాస్త పక్కనపెట్టి, ఈసారి కొంచెం కొత్తగా, క్రియేటివ్ గా ప్రమిదను పోలి ఉండే దియా బాటి స్వీట్ ట్రై చేయండి.

ఇంట్లోనే తయారు చేసుకోగలిగే ఈ స్వీట్, మీ అతిథులను, పిల్లలను కచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. ఇది నిజంగా ఇంట్లో చేసిందేనా?అని తిన్నవారు అడగక మానరు. దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఇక్కడ చూడండి.

Unique Diwali Sweet Recipe Step by Step Guide to Make Diya Bati Sweet at Home in Telugu

కావలసిన పదార్థాలు

కోవా (మావా): 500 గ్రాములు
షుగర్ పౌడర్: 1 కప్పు
యాలకుల పొడి: 1 టీస్పూన్
జీడిపప్పు, పిస్తా పొడి: 3-4 టేబుల్ స్పూన్లు
కుంకుమపువ్వు రేకులు: 15-20
నెయ్యి: చేతులకు రాసుకోవడానికి కొద్దిగా
దీపం వత్తి కోసం: పొడవుగా కట్ చేసిన జీడిపప్పు, బాదం, పిస్తా లేదా లవంగాలు

దీపావళి స్పెషల్ స్వీట్..తమిళనాడు సంప్రదాయ ఉక్కరై మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..

తయారీ విధానం

-1 టీస్పూన్ గోరువెచ్చని పాలలో 20 కుంకుమపువ్వు రేకులు నానబెట్టుకోండి.

-తర్వాత మందపాటి అడుగు ఉన్న కడాయిని స్టవ్ మీద ఉంచి, అందులో మావాను వేయండి. మంటను మీడియంలో ఉంచి 3 నుంచి 4 నిమిషాల పాటు పచ్చిదనం పోయేలా వేయించాలి. కమ్మటి వాసన రాగానే స్టవ్ ఆఫ్ చేసి, మిశ్రమాన్ని ఒక ప్లేట్‌ లోకి తీసుకుని గోరువెచ్చగా అయ్యేంతవరకు చల్లారనివ్వండి.

-కోవా గోరువెచ్చగా ఉన్నప్పుడే అందులో పంచదార పొడి, యాలకుల పొడి, పాలలో నానబెట్టిన కుంకుమపువ్వు వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ చేతులతో మృదువుగా, మెత్తని పిండి ముద్దలా కలుపుకోవాలి. ఒకవేళ మిశ్రమం కొద్దిగా పలుచగా లేదా తడిగా అనిపిస్తే, అందులో ముందుగా సిద్ధం చేసుకున్న జీడిపప్పు, పిస్తా పొడిని కలిపి పిండి పర్ఫెక్ట్ గా వచ్చేలా చూసుకోండి.

-ఇప్పుడు మీ చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని, పిండి నుండి నిమ్మకాయ సైజులో చిన్న చిన్న ఉండలు తీసుకోండి. వాటిని గుండ్రంగా చేసి, మధ్యలో బొటనవేలితో సున్నితంగా నొక్కండి. ప్రమిద ఆకారం వచ్చేలా అంచులను పైకి లేపి, ఒకవైపు దీపం ముక్కులా (వత్తి పెట్టే చోట) కొద్దిగా ముందుకు సాగదీయండి.

-వెలుగుతున్న వత్తిలా కనిపించేందుకు దీపం ముక్కు భాగంలో పొడవుగా కట్ చేసిన జీడిపప్పు లేదా పిస్తా ముక్కను ఉంచండి. స్వీట్ షాప్ స్టైల్‌ లో మరింత రాయల్‌ గా కనిపించాలంటే అంచులకు సిల్వర్ ఫాయిల్ (వెండి రేకు) అంటించవచ్చు.

-ఈ అందమైన దీపాలు సరైన ఆకారంలో గట్టిపడేందుకు, వాటిని ఒక ప్లేట్‌ లో పెట్టి సుమారు 30 నిమిషాల పాటు ఫ్రిజ్‌ లో ఉంచండి.

[ of 5 - Users]
Story first published: Friday, November 6, 2026, 23:50 [IST]
Desktop Bottom Promotion