Latest Updates
-
బ్రేకప్ తర్వాత కూడా..మాజీ లవర్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఎందుకు చూస్తారు? -
Chicken Kofta Recipe: రోటీ, బగారా రైస్‌లోకి అదిరిపోయే చికెన్ కోఫ్తా కర్రీ..ఈజీగా, టేస్టీగా ఇలా చేసుకోండి -
వేగంగా బరువు తగ్గించే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. డయాబెటిస్‌ని ఈజీగా కంట్రోల్ చేసే కీర సలాడ్.! -
కరకరలాడే బెండకాయ భుజియా.. జిగురు లేకుండా ఈ స్నాక్ చేస్తే పిల్లలు కూడా వదిలిపెట్టరు! -
షుగర్ కంట్రోల్ కావాలంటే డైలీ ఎంత సేపు నడవాలి.. భోజనం తర్వాత ఇలా చేయాల్సిందే.! -
ఒకే ప్లేట్లో ఉగాది షడ్రుచులు.. గుమ్మడికాయ ఉల్లి కారం టేస్ట్‌కి లొట్టలేయాల్సిందే.! -
హ్యాపీ గాంధీ జయంతి 2026.. మీ బంధుమిత్రులకు పంపేందుకు బెస్ట్ శుభాకాంక్షలు, కోట్స్, వాట్సాప్ స్టేటస్ లు -
ఫ్లై దుబాయ్ ఘటన.. కాక్‌పిట్‌లో గొడ్డలి ఎందుకు ఉంటుంది, ఇద్దరు పైలట్ల నియమమేంటి.? -
కడుపులో చెత్తను తొలగించి హెల్తీగా ఉంచే కొత్తిమీర పొంగలి.. ఇడ్లీ కంటే ఈజీగా చేసేయండి.! -
సూర్య, శుక్ర, బుధ గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారికి లాభాల పంట పండినట్లే.!
శరీర అవయవాలను నష్టపరిచే డయాబెటీస్!

షుగర్ వ్యాధిలో కళ్ళను ఎలా కాపాడుకోవాలి?
షుగర్ వ్యాధి అదుపు తప్పితే త్వరగా కనుక్కోలేకపోతే, కళ్లు గుడ్డితనానికి గురయ్యే ప్రమాదం వుంది. మొదట్లో చిహ్నాలు కనపడవు. కంటి రెటీనాను ఎప్పటికపుడు చెక్ చేయించుకుంటూ వుండాలి. కంటి డాక్టర్ కు మీకు డయాబెటీస్ వుందని చెప్పాలి. అపుడే ఆయన సరైన పరీక్షలు నిర్వహించగలుగుతాడు.
షుగర్ వ్యాధి బాధితులకు పాదాల జాగ్రత్త అత్యవసరం. ఈ వ్యాధిగ్రస్తులకు పాదాలకు గాయాలైతే వారికి తెలియదు. దీనికి కారణం ఆయా ప్రాంతాల భాగాలలోని రక్త నాళాలలో రక్త సరఫరా దెబ్బతినడమే. గాయాలు త్వరగా నయం కావు. డయాబెటీస్ వున్నవారికి గాయాలైతే, ఇన్ ఫెక్షన్ చాలా త్వరగా శరీర భాగాలలో వ్యాపిస్తుంది. పాదాలకు వీరు సరి అయిన పాదరక్షలు ప్రత్యేకించి బూట్ల వంటివి వాడి గాయాలు అవకుండా చూసుకోవాలి. ఏ చిన్న గాయమైనప్పటికి వైద్యుడిని సంప్రదించి తగన చికిత్ససత్వరమే పొందాలి. పాదాలు ఎల్లపుడూ పొడిగా, శుభ్రంగా వుంచుకోవాలి. గోళ్ళు కత్తిరించుకోవాలి. మాయిశ్చరైజింగ్ క్రీములు రాసి పొడిబారకుండాలేదా పగుళ్ళు ఏర్పడకుండా చూడాలి. పగుళ్ళనుండే వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం వుంది. పాదాలు ఎర్రబడ్డా, అసాధారణమైన నొప్పి కలుగుతున్నా, పుండ్లు, కోతలు, వాపు మొదలైనవి వచ్చినా లేదంటే రంగు మారినా తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి. వైద్యం ఆలస్యమయితే గాంగ్రిన్ ఏర్పడే ప్రమాదం వుంది. కాళ్ళలో రక్త సరఫరా సరిగా లేకుంటే సరైన వైద్యం వెంటనే తీసుకోవాలి.
షుగర్ వ్యాధిగ్రస్తులకు కిడ్నీసమస్యలు - షుగర్ వ్యాధిగ్రస్తులు కిడ్నీలకు షుగర్ వలన కలిగే డామేజీని వెంటనే కనుగొనలేరు. కనుక కనీసం సంవత్సరానికొకసారైనా వీరు కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. మూత్రాన్ని రక్తం మరియు ప్రొటీన్ కొరకు పరీక్షిస్తారు. కిడ్నీలు డయాబెటీస్ వలన దెబ్బతింటే మూత్రంలో ప్రొటీన్ పోతూ వుంటుంది. ప్రొటీన్ అధికంగా పోతే, కిడ్నీ పాడవుతుంది. కనుక వెంటనే వైద్యంతో ప్రొటీన్ లీక్ కాకుండా చూసుకోవాలి.
షుగర్ వ్యాధివలన శరీర అవయవాలకు జరిగే నష్టాలు సత్వరమే కనుగొని వైద్యం చేయించకుంటే, తీవ్ర సమస్యలు ఏర్పడతాయి. కనుక షుగర్ వ్యాధి రోగులకు శరీర పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవడం అత్యవసరంగా చెప్పవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
