Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
డయాబెటీస్ ను అరికట్టే కొవ్వు కణాలు!

సాధారణంగా ఊబకాయం లేక అధిక బరువు అనేవి డయాబెటీస్ కలిగిస్తాయని అందరూ భావిస్తారు. అయితే శరీరంలోని కొవ్వు కూడా వాస్తవంగా ప్రయోజనం చేకూరుస్తుందని అది రక్తంలోని బ్లడ్ షుగర్ స్ధాయిలను నియంత్రించి శరీర పటుత్వాన్ని అధికం చేస్తుందని అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్యయనకార్లు కననుగొన్నారు.
వారి రీసెర్చిలో సైంటిస్టులు ఒక కొత్త జన్యువును కనిపెట్టారు. ఆ జన్యువు టైప్ 2 డయాబెటీస్ ను నిరోధిస్తుంది. గ్లూకోజ్ షుగర్ ను ఫ్యాటీ యాసిడ్లలోకి మారుస్తుంది. బ్లడ్ షుగర్ ను నియంత్రించే ఇన్సులిన్ కు అధిక శక్తినిస్తుంది. ఈ పరిశోధనా వివరాలను లండన్ లోని డెయిలీ ఎక్స్ప్రెస్ వార్తాపత్రిక ప్రచురించింది.
టైప్ 2 డయాబెటీస్ సాధారణంగా మధ్యవయసులలో వస్తుంది. మధ్యవయసులలోనే వ్యక్తులకు ఊబకాయం రావటం, జీవన విధానాలు అనారోగ్యకరంగా మారడం జరుగుతుంది.
కొవ్వు చెడు చేస్తుందనేది నిజంకాదు. ఊబకాయం లేదా అధిక బరువు జీవక్రియ సరిగా లేకుండుటకు సహకరిస్తుంది. దానితో వ్యక్తులు డయాబెటీస్, స్ట్రోక్ లేదా గుండె జబ్బు పొందే అవకాశం వుంది. అయితే, ఊబకాయం ఉన్నప్పటికి కొద్ది మందికి ఈ సమస్యలేవీ లేవని వారిలో జీవక్రియ సజావుగా సాగుతూ వారు ఆరోగ్యంగా వున్నారని అధ్యయన కర్త డా. మార్క్ హెర్మన్ పేర్కొన్నారు.
ఊబకాయం అధికంగా కలవారిని రక్తంలో షుగర్ స్ధాయిలు అధికంగా వుంటాయి. దానికి కారణం షుగర్ జీవకణాలకు చేరకపోవటమే. అయితే, సైంటిస్టులు చేసిన పరిశోధనలో, ట్రాన్స్ పోర్టర్ జన్యువు ఊబకాయంకల ఎలుకలకు అధిక గ్లూకోజ్ ఇస్తే అది కొవ్వు కణాలలోకి అధికంగా పీల్చుకోబడిందని వాటికి డయాబెటీస్ రాకుండా రక్షించిందని తేలింది ఈ రకంగా కొవ్వు కణాలలోకి ట్రాన్స్పోర్టర్ జన్యువునుండి షుగర్ చేరిందని అది ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా శరీరమంతా అధికం చేసిందని నేచర్ జర్నల్ పత్రిక ప్రచురించింది. సాధారణ బరువున్న ఎలుకలలో ట్రాన్స్ పోర్టర్ జీన్ లేకుంటే అవి డయాబెటిక్ లక్షణాలు చూపాయట.
చేయబడిన పరిశోధనా ఫలితాలు ఎంతో ఆశావహంగా వున్నాయని పరిశోధన మరింత ముందుకు సాగితే, డయాబెటీస్ వ్యాధికి చికిత్స తేలికవుతుందని అధ్యయనకార్లు వెల్లడించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications