For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటిక్ రోగులలో ఇన్సులిన్ పాత్ర!

By B N Sharma
|

షుగర్ వ్యాధి లేదా చక్కెర వ్యాధి చాలా ప్రాచీనమైంది. మానవ జాతిని వందల సంవత్సరాలనుండిపట్టి పీడిస్తోంది. ఈ వ్యాధిని గురించి ప్రాచీన శాస్త్రాలలో కూడా వివరించారు. ఇది ఒక దీర్ఘకాల జీవన ప్రక్రియ అసమతుల్యతగా చెప్పబడుతుంది. రక్తంలో షుగర్ స్ధాయి పెరిగిపోతుంది. దీనినే ఇంగ్లీషులో డయాబెటీస్ అంటాము. అంటే తీపి అని అర్ధం. చక్కెర వ్యాధి లేదా షుగర్ వ్యాధి లేదా డయాబెటీస్ లేదా డయాబెటీస్ మెల్లిటస్ అనే పేర్లన్ని దైనందిన జీవితంలో ఒకే రకంగా వాడేస్తూంటాము.

Need of Insulin For Diaabetic Patients!

మనం తినే తిండిలో వున్న గ్లూకోజు పొట్టలోకి వెళ్ళి రక్తంలోకి ప్రవేశిస్తుంది. ఇక మనకు ఎనర్జీ ఇవ్వాలంటే ఈ గ్లూకోజు కణాలలోకి చేరాలి. గ్లూకోజు కణాలలోకి చేరేందుకుగాను ఇన్సులిన్ సహాయపడుతుంది. ఇన్సులిన్ అనే పదార్ధాన్ని మన దేహంలోని పాన్ క్రియాస్ గ్రంధి ఉత్పత్తి చేస్తుంది. ఈ పాన్ క్రియాస్ గ్రంధి కనుక సరిగా పని చేయకపోతే ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది. అపుడు మనం తిన్న గ్లూకోజు కణాలలోకి పూర్తిగా చేరకుండా రక్తంలోనే నిలువ వుంటుంది. ఈ స్ధితినే షుగర్ వ్యాధి వచ్చిన దశగా చెపుతారు.

డయాబెటీస్ వ్యాధి వున్న వారికి శరీరం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేదు. లేదా ఉన్న ఇన్సులిన్ సమర్ధవంతంగా ఉపయోగించుకోలేదు. ఈ కారణంగా శరీరంలో షుగర్ నిల్వలు పెరిగిపోతాయి. రక్తంలో గ్లూకోజ్ స్ధాయి పెరిగి జీవప్రక్రియ లోపించి శరీరంలోని ప్రధాన అవయవాల చర్యలు సమర్ధత కోల్పోతాయి. ఈ పరిస్ధితిని కనుక వైద్యం చేయకుండా అలానే వదిలేస్తే, డయాబెటీస్ వ్యాధి శరీరంలోని ఇతర అవయవాలకు కూడా వ్యాప్తి చెందుతుంది. గుండె వ్యాధులు, కండ్లకు చూపు మందగించటం, కిడ్నీలు విఫలమవటం వంటి తీవ్ర సమస్యలు తలెత్తుతాయి.

డయాబెటీస్ రెండు రకాలుగా వస్తుంది. మొదటిది టైప్ 1. దీనికి ఇన్సులిన్ తీసుకోవడమే మార్గము. ఇది పిల్లలలో వచ్చే వ్యాధి. ప్రారంభంలోని పాన్ క్రియాటిక్ సెల్స్ నష్టం అయి ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోతుంది. కనుక వీరికి ఇన్సులిన్ ఎక్కించడమే చేయాలి. లక్షణాలు ఎలావుంటాయంటే, రక్తంలో, మూత్రంలో షుగర్ లెవెల్ పెరగడం, తరచుగా మూత్రం పోయడం, ఆకలి, దాహం, బరువు తగ్గటం, బలహీనం, అలసట, భావోద్రేకాలు, వికారం, వాంతులు మొదలైనవి.

టైప్ 2 డయాబెటీస్ - వీరికి ఇన్సులిన్ ఎక్కించాల్సిన అవసరం లేదు. ఇది సాధారణంగా 45 సంవత్సరాల వయసు పైబడిన వారికి లేదా అధిక బరువున్న వారికి వస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు, దాహం, మూత్రం అధికంగా పోయటం, అలసట, చికాకు, వికారం, చర్మంపై ఇన్ ఫెక్షన్, చూపు మందగించడం, పొడిచర్మం, చర్మం చురుక్కు మనటంగా వుంటాయి. రక్తంలో గ్లూకోజు నిల్వలు అధికమైతే, వీరిలో కలిగే గాయాలకు నివారణ త్వరగా జరుగదు. ఫలితంగా సెప్టిక్ అయినట్లయితే ఆయా శరీర అవయవాలు సైతం తొలగించాల్సిన పరిస్ధితి వస్తుంది.

English summary

Need of Insulin For Diaabetic Patients! | షుగర్ వ్యాధి అంటే ఏమిటి?

Diabetes affects blood glucose levels. Most of the food we eat is turned into glucose or sugar for our bodies to use for energy. The pancreas, an organ that lies near the stomach, makes a hormone called insulin to help glucose get into the cells of our bodies. In case of Type 2 Diaabetes patients, there is no need of injecting Insulin. This can be controlled by using tablets, etc.
Story first published: Tuesday, July 31, 2012, 10:31 [IST]
Desktop Bottom Promotion