Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నేరేడు గింజల్ని పడేస్తున్నారా ? ఆగండి..!!
నల్లగా నిగనిగలాడే నేరేడు పండు చూస్తే ఎవరికైనా.. తినేయాలనిపిస్తుంది. పులుపు, వగరు రుచుల సమ్మేళనమైన నేరేడు పండు తినడానికి ఇష్టపడని వారుండరు. నేరేడు పండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. అయితే నేరేడు పండు మాత్రమే కాదు.. ఇందులో ఉండే గింజలు మరింత అమోఘమైన ప్రయోజనాలు చేకూరుస్తాయి.
READ MORE: ఆరోగ్య ఫల ప్రధాయిని నేరేడు పండు-గొప్ప ప్రయోజనాలు
నేరేడు పండు గింజల్ని ఇకపై పారేయకండి. ఎందుకంటే.. ఈ గింజలకు షుగర్ వ్యాధిని తగ్గించే అద్భుతమైన గుణం ఉంది. ఇందులో ఆక్సాలిక్ ఆమ్లం, మాలిక్ ఆమ్లంతో పాటు, ఎన్నో ఔషధ విలువలు ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగని వీటిని షుగర్ పేషంట్స్ ఉపయోగించడానికి పెద్ద ప్రాసెస్ ఏమీ లేదు. సింపుల్ గా ఉపయోగించి.. మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

నేరేడు గింజల్ని మెత్తగా దంచి అన్నంలో కలుపుకుని తింటే.. ఆ ప్రభావం చాలా బాగా పనిచేస్తుంది. వెంటనే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ లో మార్పులు చూడవచ్చు. ఈ చిట్కాను తరచుగా ఫాలో అవడం వల్ల.. మంచి పలితాలు పొందవచ్చు.
మజ్జిగ, నేరేడు గింజలు కూడా మధుమేహంతో పోరాడటానికి చక్కగా సహకరిస్తాయి. నేరేడు సాధారణంగా వగరుగా, పుల్లగా ఉంటుంది. ఇక గింజలు తినాలి అంటే.. కాస్త ఇబ్బందికరమే. కాబట్టి వాటిని డైరెక్ట్ గా తీసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి నేరేడు గింజల్ని పేస్ట్ లా తయారు చేసి.. మజ్జిగలో కలిపి తీసుకుంటే.. షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయవచ్చు.

నేరేడు గింజల్ని ఎండబెట్టి పొడి చేసి రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక టీ స్పూన్ మజ్జిగతో కలిపి తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. అలాగే అతిమూత్రం కూడా అదుపులోకి వస్తుంది. ఈ విధంగా మూడు సార్లు తీసుకోవడం ఇబ్బందిగా ఫీలయ్యేవాళ్లు నేరేడు 5నుంచి 10 గ్రాముల గింజల చూర్ణాన్ని ఉదయాన్నే తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. లేదా నేరేడు పండు గింజల పొడిని కాచి వడగట్టి తాగితే.. శరీరంలోని చక్కెర నిల్వల స్థాయి తగ్గుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications