Latest Updates
-
వాస్తు ప్రకారం ఇల్లు తుడుచుకోవడానికి సరైన సమయం ఏది? తప్పు సమయంలో తుడిస్తే ఏమవుతుంది? -
కిచెన్‌లో శ్రమ తగ్గించే చిట్కాలు.. ఈ టెక్నిక్స్‌తో అన్నం అంటుకోదు, పప్పు పొంగిపోదు.! -
టీ తాగితే ఎముకలు కరిగిపోతాయా? ఈ విషయాలు మీకు తెలుసా? -
డైలీ ఐదు చాలు.. వీటిని రాత్రంతా నానబెట్టి తింటే రక్తహీనత బాధే ఉండదు.! -
రాఖీ, కృష్ణాష్టమి స్పెషల్..అచ్చు స్వీట్ షాప్ రుచితో ఇంట్లోనే పర్ఫెక్ట్ సోన్ పాప్డీ చేసుకోండిలా.. -
శుక్ర గోచారం 2026..ఆగష్టు 25 నుంచి ఈ 3 రాశులకు కష్టాలు తప్పవు! -
శ్రావణ మాసం స్పెషల్ మజ్జిగ ఆలు కర్రీ..జన్మ జన్మలు గుర్తిండిపోయే రుచి! -
పాముకాటుకి గురైతే మేల్కొని ఉండాలా.. పొరపాటున కళ్లు మూస్తే ఏం జరుగుతుంది.? -
పిల్లల్లో క్యాన్సర్ తొలి లక్షణాలు..ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన నిజాలు.. -
రాఖీ 2026 స్పెషల్: స్వీట్ షాప్ టేస్ట్‌ను తలదన్నేలా ఇంట్లోనే ఈజీగా కొకొనట్ బర్ఫీ.!
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ నల్లి గోష్ట్ బిర్యానీ.. ఈ సర్ప్రైజ్ కి ఫ్యామిలీ ఫిదా!
బిర్యానీ పేరు వింటేనే చాలు, ఆహార ప్రియుల మనసు ఉప్పొంగుతుంది. అందులోనూ పొగలు కక్కే నల్లి గోష్ట్ బిర్యానీ గురించి అయితే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. మృదువైన నల్లి బొక్కలు, కీమా కాంబినేషన్‌తో, అదిరిపోయే మసాలాలు జోడించి చేసే ఈ బిర్యానీ రుచిని జీవితంలో మర్చిపోలేరు. ఈ వీకెండ్ లో మీ ఇంట్లో వాళ్లందరినీ సర్ప్రైజ్ చేయాలనుకుంటే, రెస్టారెంట్ స్టైల్ రుచిని తలపించే ఈ స్పెషల్ నల్లి గోష్ట్ బిర్యానీ రెసిపీని ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

నల్లి గోష్ఠ్ బిర్యానీ తయారీ విధానం
-ముందుగా తాజా నల్లి ముక్కలను శుభ్రంగా కడిగి ఒక పెద్ద గిన్నెలో తీసుకోవాలి. అందులో 1 టీస్పూన్ ఉప్పు, 1 టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ కారం, అర టీస్పూన్ ధనియాల పొడి, పావు టీస్పూన్ జీలకర్ర పొడి, అర టీస్పూన్ ఫ్రెష్ గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా ఆకులు, 4 యాలకులు, 4 లవంగాలు, ఒక అంగుళం దాల్చిన చెక్కను మెత్తటి మసాలా పొడిలా దంచి అందులో కలుపుకోవాలి. చివరగా 1 టేబుల్ స్పూన్ కమ్మని నెయ్యి, 100 గ్రాముల గట్టి పెరుగు వేసి ఈ మసాలా అంతా నల్లి ముక్కలకు బాగా పట్టేలా చేత్తో కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టి, కొద్దిగా నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న నల్లి ముక్కలను అందులో వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత 250 ఎంఎల్ నీళ్లు పోసి, కుక్కర్ మూత పెట్టేయాలి. నల్లి మాంసం చాలా మెత్తగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉడకాలంటే మంటను మీడియంలో పెట్టి సుమారు 7 నుంచి 9 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
-ఈ బిర్యానీకి అసలు ప్రాణం ఈ కీమా గ్రేవీనే. ఒక మందపాటి వెడల్పాటి గిన్నెలో కొద్దిగా నెయ్యి వేడి చేసి, అందులో కీమా వేసి వేయించాలి. కాసేపటికి కీమాలో నుంచి సహజంగానే నీరు ఊరుతుంది. అప్పుడు అందులో కాస్త పసుపు, తగినంత కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. అందులోనే 1 కప్పు బ్రౌన్ ఆనియన్స్ (క్రిస్పీగా వేయించిన ఉల్లిపాయలు), ఒక పెద్ద టమాటాను చిన్న ముక్కలుగా కోసి వేయాలి. మంటను సిమ్ లో పెట్టి 10 నిమిషాల పాటు ఉడికిస్తే టమాటా మెత్తబడిపోతుంది. ఆ సమయంలో తాజా కొత్తిమీర, పుదీనా, కొద్దిగా కుంకుమపువ్వు కలిపిన నీళ్లు చల్లాలి.
-ఇప్పుడు ముందుగా కుక్కర్‌లో ఉడికించిన నల్లి ముక్కలను మాత్రమే తీసి కీమా గ్రేవీలో వేయాలి. ఈ మిశ్రమాన్ని తక్కువ మంటపై మరో 5-8 నిమిషాలు ఉడికించి పైన కొత్తిమీర చల్లుకోవాలి.

-నల్లి ఉడికించిన ఆ రుచికరమైన నీళ్లను పారబోయకండి, అన్నం వండేందుకు పక్కన పెట్టుకోండి.
-ఇక చివరగా బిర్యానీ రైస్ వండటానికి ఒక పెద్ద గిన్నెలో, 3 కప్పుల నానబెట్టిన బాస్మతి బియ్యానికి సరిపడా ఎసరు పెట్టుకోవాలి. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు అనే లెక్కన.. ఇందాక పక్కన పెట్టుకున్న నల్లి ఉడికించిన నీటిని, మిగతా సాధారణ నీటిని కలిపి ఎసరు పోయాలి.
-ఎసరులో రుచికి సరిపడా ఉప్పు, 6-7 పచ్చిమిర్చి చీలికలు, షాహీ జీలకర్ర, బిర్యానీ ఆకులు వేసి మరిగించాలి.
-నీళ్లు మరుగుతున్నప్పుడు నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని అందులో వేసి ఉడికించాలి. అన్నం చక్కగా ఉడుకుతున్నప్పుడు పైన కుంకుమపువ్వు నీళ్లు, ఫ్రైడ్ ఆనియన్స్ చల్లి మూతపెట్టి సన్నపు మంటపై దమ్ చేయాలి.
-అంతే మూత తీయగానే ఇల్లంతా వ్యాపించే బిర్యానీ సువాసనకు ఎవరికైనా సరే ఆకలి రెట్టింపు అవ్వాల్సిందే. వేడి వేడి బాస్మతి అన్నంతో పాటు ఈ కీమా, నల్లి గ్రేవీని కలుపుకుని తింటుంటే.. ఆ మజానే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications